For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Petrol, diesel prices today: ధరలు అక్కడ పెరిగినా.. ఇక్కడ స్థిరంగా పెట్రోల్ ధరలు

|

పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. చమురు ధరలు శుక్రవారం (డిసెంబర్ 17) కూడా యథాతథమే. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి. దీపావళికి ముందు మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఆ పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి ధరలు తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం తగ్గింపు పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 మాత్రమే వర్తిస్తోంది. ఢిల్లీలోను అక్కడి ప్రభుత్వం వ్యాట్‌‍ను తగ్గించింది. వ్యాట్‌ను ముప్పై శాతం నుండి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర రూ.8 తగ్గింది. వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.95.41, చెన్నైలో రూ.101.40, కోల్‌కతాలో రూ.104.67, ముంబైలో రూ.109.98, హైదరాబాద్‌లో రూ.108.20, విశాఖపట్నంలో రూ.109.05గా ఉంది.
లీటర్ డీజిల్ ఢిల్లీలో రూ.86.67, చెన్నైలో రూ.91.43, కోల్‌కతాలో రూ.89.79, ముంబైలో రూ.94.14, హైదరాబాద్‌లో రూ.94.62, విశాఖపట్నం రూ.95.18గా ఉంది.

Petrol, diesel prices today: Relief continues! Petrol and diesel prices did not change

ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చమురు వినియోగం తిరిగి పుంజుకుంటుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఆగస్ట్ నెల నుండి ఓ వారంలో గరిష్ట పెరుగుదలను గతవారం నమోదు చేసింది. గతవారం బ్రెంట్ క్రూడ్ ఏకంగా 7 శాతం లాభపడింది. ఆ తర్వాత కాస్త ప్రాఫిట్ బుకింగ్ నమోదయింది. బ్రెంట్ క్రూడ్ చివరి వారంలో 75.15 డాలర్ల వద్ద ముగిసింది. బ్రెంట్ ఇప్పటికీ 75 డాలర్ల సమీపంలోనే ఉంది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ గతవారం 71.67 డాలర్ల వద్ద ముగిసింది. నేడు ఇది 72 డాలర్లకు పైన ఉంది.

ఇటీవలి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు భారత్‌లో చర్చనీయాంశంగా మారాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరగడం దేశీయంగా ధరలపై ప్రభావం చూపాయి. అయితే కేంద్ర ప్రభుత్వం సెస్‌ను తగ్గించడంతో సామాన్యుడిపై కాస్త భారం తగ్గింది. అయితే ప్రపంచంలో పెట్రోల్, డీజిల్ ధరలు అతి తక్కువగా ఏ దేశంలో, ఎంత ఉన్నాయో తెలుసా? వెనిజులాలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యంత చౌక. డిసెంబర్ 6వ తేదీన లీటర్ పెట్రోల్ ఇక్కడ రూ.1.885 (మన భారత కరెన్సీలో). ప్రపంచంలోనే గ్యాసోలైన్‌ను చౌకకు అందించే దేశం ఇది. ఇరాన్‌లో లీటర్ పెట్రోల్ రూ.3.866గా ఉంది. ప్రపంచంలో చౌక ధరకు అందించే రెండో దేశం ఇది. ఇక, ప్రపంచంలోనే ఎక్కువ ధర ఉన్న దేశం హాంగ్‌కాంగ్. ఈ దేశంలో లీటర్ పెట్రోల్ రూ.195.113. ఆ తర్వాత నెదర్లాండ్స్‌లో రూ.170.7. అమెరికాలో లీటర్ పెట్రోల్ ధర భారత కరెన్సీలో రూ.74.021. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్యాసోలైన్ ధర సగటున లీటర్‌కు రూ.90.83గా ఉంది.

English summary

Petrol, diesel prices today: ధరలు అక్కడ పెరిగినా.. ఇక్కడ స్థిరంగా పెట్రోల్ ధరలు | Petrol, diesel prices today: Relief continues! Petrol and diesel prices did not change

Government Oil Companies (IOCL) have released new rates of petrol and diesel (Petrol-Diesel Price Today). There has been no change in the fuel price even today. According to the new rate, today the price of petrol in the national capital Delhi is Rs 95.41 per liter, while diesel is being sold at Rs 86.67 per liter.
Story first published: Friday, December 17, 2021, 7:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X