For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Petrol prices today: క్రూడాయిల్ ధరలు జంప్, ఇక్కడ పెట్రోల్ ధరలు స్థిరంగా

|

పెట్రోల్, డీజిల్ ధరలు నెల రోజులకు పైగా స్థిరంగా ఉన్నాయి. చమురు ధరలు వరుసగా 35వ రోజు బుధవారం(డిసెంబర్ 09) స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి. దీపావళికి ముందు మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఆ పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి ధరలు తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం తగ్గింపు పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 మాత్రమే వర్తిస్తోంది. ఢిల్లీలోను అక్కడి ప్రభుత్వం వ్యాట్‌‍ను తగ్గించింది. వ్యాట్‌ను ముప్పై శాతం నుండి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర రూ.8 తగ్గింది. వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.95.41, చెన్నైలో రూ.101.40, కోల్‌కతాలో రూ.104.67, ముంబైలో రూ.109.98, హైదరాబాద్‌లో రూ.108.20, విశాఖపట్నంలో రూ.109.05గా ఉంది.
లీటర్ డీజిల్ ఢిల్లీలో రూ.86.67, చెన్నైలో రూ.91.43, కోల్‌కతాలో రూ.89.79, ముంబైలో రూ.94.14, హైదరాబాద్‌లో రూ.94.62, విశాఖపట్నం రూ.95.18గా ఉంది.

Petrol, diesel prices today: Fuel prices unchanged on 9 december 2021

ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చమురు వినియోగం తిరిగి పుంజుకుంటుందని భావిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. వరుసగా మూడు రోజుల పాటు 5 శాతం, 3 శాతం చొప్పున పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ నేడు 76 డాలర్లు దాటింది. సోమవారం బ్రెంట్ క్రూడ్ 4.6 శాతం లాభపడింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ నేడు 72 డాలర్లుదాటి 73 డాలర్ల దిశగా కనిపిస్తోంది.

English summary

Petrol prices today: క్రూడాయిల్ ధరలు జంప్, ఇక్కడ పెట్రోల్ ధరలు స్థిరంగా | Petrol, diesel prices today: Fuel prices unchanged on 9 december 2021

Benchmark U.S. crude oil for January delivery rose 31 cents to $72.36 a barrel Wednesday. Brent crude for February delivery rose 38 cents to $75.82 per barrel.
Story first published: Thursday, December 9, 2021, 7:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X