For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Petrol, Diesel Rates: ఈ నాలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర ఎక్కువ

|

పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఎనిమిదో రోజు స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు భారీగా తగ్గాయి. ఇటీవల మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి దీపావళికి శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా లీటర్ పెట్రోల్, డీజిల్ పైన రూ.7 చొప్పున తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. ధరలు తాము తగ్గించేది లేదని చెబుతున్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం తగ్గింపు పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 మాత్రమే వర్తిస్తోంది. అసోం, మణిపూర్, గోవా, త్రిపుర, కర్నాటక, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కేంద్రం తగ్గింపుకు రాష్ట్రాలు తోడు కావడంతో పెట్రోల్ పైన రూ.12, డీజిల్ పైన రూ.17 తగ్గింది. మందగమనం, కరోనా వంటి కఠిన పరిస్థితుల్లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగి, ఇక్కడ కూడా ధరలు ఆకాశాన్ని అంటాయి. ధరలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో గత మూడేళ్లలో మొదటిసారి కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. దీంతో చాలాచోట్ల డీజిల్ ధరలు రూ.100 దిగువకు వచ్చాయి. పెట్రోల్ ధరలు కూడా కాస్త తగ్గాయి.

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 103.97, లీటర్ డీజిల్ ధర 86.67, ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 109.98, డీజిల్ ధర 94.14, చెన్నైలో పెట్రోల్ ధర 101.40, డీజిల్ ధర 91.43, కోల్‌కతాలో పెట్రోల్ ధర 104.67, డీజిల్ ధర 89.79, భోపాల్‌లో పెట్రోల్ ధర 112.56, డీజిల్ ధర 95.40, హైదరాబాద్‌లో డీజిల్ రూ.94.62, లీటర్ పెట్రోల్ రూ.108.20గా ఉంది. అయితే ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఉత్తర ప్రదేశ్, గోవా, కర్నాటక దారిలో పంజాబ్ నడిచింది. ఇక్కడ పెట్రోల్ పైన రూ.10, డీజిల్ పైన రూ.5 తగ్గించింది. ఢిల్లీతో పోలిస్తే పంజాబ్‌లో ఇప్పుడు పెట్రోల్ ధర రూ.9 తక్కువ. పంజాబ్‌లో ఇప్పుడు లీటర్ పెట్రోల్ రూ.95.63, లీటర్ డీజిల్ రూ.84.42గా ఉంది.

Petrol Diesel Price: Rates constant on 12 November 2021

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా నాలుగైదు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే వ్యాట్ ఎక్కువగా విధిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. వీటి కంటే ముందు రాజస్థాన్, మహారాష్ట్ర ఉన్నాయి. రాజస్థాన్‌లో లీటర్ పెట్రోల్ రూ.111.10, మహారాష్ట్రలో రూ.109.98, ఆంధ్రప్రదేశ్ రూ.109.05, తెలంగాణ రూ.108.10గా ఉంది.
యూఎస్ ఇన్వెంటరీ రిపోర్ట్ అనంతరం అంతర్జాతీయంగా చమురు ధరలు కాస్త శాంతించాయి. బ్రెంట్ క్రూడ్ 83 డాలర్ల వద్ద, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ ఫ్యూచర్ క్షీణించి 82 డాలర్ల వద్ద ఉంది.

దేశీయ అవసరాల్లో భారత్ 86 శాతం చమురును దిగుమతి చేసుకుంటోంది. దీంతో ఇంధన ధరల నియంత్రణ ప్రభుత్వాల చేతుల్లో ఉండదని గుర్తు చేశారు. అంతర్జాతీయస్థాయిలో డిమాండ్-సరఫరాకు అనుగుణంగా ధరలు మారుతుంటాయని చెబుతున్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరగడానికి కరోనా సంక్షోభం కారణమన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోతే ధరలు పెరుగుతాయని గుర్తు చేస్తున్నారు. అలాగే చమురు రంగంపై ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టకపోవడం కూడా ధరలు ప్రభుత్వాల చేతిలో ఉండకపోవడానికి ఓ కారణమన్నారు. కేవలం పునరుత్పాదక, హరితఇంధనంపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నాయని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంధన ధరలు మరింత పెరిగి, 2023 నాటికి లీటర్ ముడి చమురు మరో రూ.100 పెరగవచ్చునని అంటున్నారు.

దీపావళి సమయంలో ఎక్సైజ్ డ్యూటీని తగ్గించి వాహనదారులకు కేంద్రం శుభవార్త అందించిన విషయం తెలిసిందే. ఈ తగ్గింపు ధరలు గురువారం ఉదయం నుండి అమల్లోకి వచ్చాయి. రాష్ట్రాలు కూడా పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని కేంద్రం సూచించింది. పలు రాష్ట్రాలు పెట్రోల్‌పై విధించే పన్నును తగ్గించాయి. ఈ జాబితాలో అసోం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి. కాగా అసోం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా రాష్ట్రాలు లీటర్ పెట్రోల్‌పై రూ.7 తగ్గించాయి. ఉత్తర ప్రదేశ్ ఏకంగా రూ.12 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్ రూ.2 తగ్గించింది. దీంతో ప్రజలకు పెట్రోల్ మరింత చౌకగా అందుబాటులోకి వచ్చింది. మిగతా రాష్ట్రాల్లో కూడా వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని డిమాండ్లు వస్తున్నాయి.

English summary

Petrol, Diesel Rates: ఈ నాలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర ఎక్కువ | Petrol Diesel Price: Rates constant on 12 November 2021

The petrol and diesel prices remained unchanged on Friday across various cities in the country including the national capital Delhi, Mumbai, Kolkata, etc.
Story first published: Friday, November 12, 2021, 7:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X