For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకుల రుణాల్లో భారీగా పెరిగిన పర్సనల్ లోన్లు, ఆర్బీఐ డేటా

|

గత ఏడాది కాలంలో బ్యాంకు లోన్‌లలో ఎక్కువగా వ్యక్తిగత రుణాలే ఉంటున్నాయట. దేశంలో ప్ర‌భుత్వ‌, ప్రయివేటు బ్యాంకుల్లో వ్య‌క్తిగత రుణాల వాటా భారీగా పెరుగుతున్న‌ట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెల్లడించింది. గత ఫిబ్ర‌వ‌రి చివ‌రి నాటికి బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాల వ్యాల్యూ రూ. 89.8 ల‌క్ష‌ల కోట్లు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 7.3 శాతం ఎక్కువ‌.

ట్రంప్ లాక్‌డౌన్‌కు ఎందుకు దూరం జరిగారు, రెండు కారణాలివే!ట్రంప్ లాక్‌డౌన్‌కు ఎందుకు దూరం జరిగారు, రెండు కారణాలివే!

ఈ రుణాల్లో మాన్యుఫాక్చ‌రింగ్ రంగం వాటా 31 శాతం. రూ. 27.9 ల‌క్ష‌ల కోట్లుగా ఉంది. ఈ రంగం రుణ విత‌ర‌ణ‌లో గత ఏడాదితో పోలిస్తే ఎలాంటి మార్పులేదు. పర్సనల్ రుణాల వాటా 28 శాతంతో రూ.25.3 ల‌క్ష‌ల కోట్లుగా ఉంది. ఈ రంగంలో గత ఏడాదితో పోలిస్తే అత్య‌ధికంగా 17 శాతం పెరుగుదల ఉంది.

 Personal loans are now 28% of total bank credit

హోమ్ లోన్ వాటా 14.8 శాతంతో రూ.13.3 ల‌క్ష‌ల కోట్లుగా ఉంది. ఇత‌ర రుణాలు రూ.7 ల‌క్ష‌ల కోట్లుగా ఉంద‌ని RBI తెలిపింది. వ్య‌క్తిగ‌త రుణాలు ఇచ్చిన సంస్థ‌ల్లో ఎక్కువ‌ శాతం నాన్ బ్యాంకింగ్ సంస్థ‌లే ఉన్నాయి. పర్సనల్ లోన్స్‌లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ముందున్నాయి. 2019 ఫిబ్రవరి నాటికి రూ.5.75 లక్షల కోట్ల నుండి 22 శాతం పెరుగుదలతో రూ.7 లక్షల కోట్లకు పెరిగాయి.

English summary

బ్యాంకుల రుణాల్లో భారీగా పెరిగిన పర్సనల్ లోన్లు, ఆర్బీఐ డేటా | Personal loans are now 28% of total bank credit

According to data released by the Reserve Bank of India (RBI), bank credit as of end-February stood at Rs 89.8 lakh crore an increase of only 7.3% over the previous year.
Story first published: Tuesday, April 7, 2020, 8:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X