For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Dividend Stock: ఒక్కో షేరుకు రూ.28 చెల్లింపు.. డివిడెండ్ కావాలంటే ఇలా చేయండి..

|

Dividend Stock: మార్కెట్లో ప్రస్తుతం కంపెనీలు మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తుండగా కోలాహలం కొనసాగుతోంది. అయితే ఈ క్రమంలో చాలా కంపెనీలు తమకు వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని తమ పెట్టుబడిదారులకు సైతం అందించాలని నిర్ణయిస్తుంటాయి. అలా కంపెనీలు చెల్లించే దానినే డివిడెండ్ ఆదాయం అని పిలుస్తారు.

బంపర్ రాబడి..

బంపర్ రాబడి..

మార్కెట్లో చాలా కంపెనీలు లిస్ట్ అయి ఉన్నప్పటికీ కేవలం కొన్ని మాత్రమే తమ ఇన్వెస్టర్లకు క్రమంగా డివిడెండ్ చెల్లిస్తుంటాయి. ఈ క్రమంలో డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన ఐటి కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ పెట్టుబడిదారులకు శుభవార్త చెప్పింది. ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్ ఇవ్వనున్నట్లు త్రైమాసిక ఫలితాలతో పాటు కంపెనీ ప్రకటించింది. డివిడెండ్ రికార్డు తేదీని సైతం ప్రకటించింది.

పెర్సిస్టెంట్ సిస్టమ్స్..

పెర్సిస్టెంట్ సిస్టమ్స్..

అర్హత కలిగిన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై రూ.28 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని బోర్డు నిర్ణయించినట్లు కంపెనీ స్టాక్ మార్కెట్ కు అందించిన వివరాల్లో వెల్లడించింది. ఇందుకోసం కంపెనీ రికార్డు తేదీని ఈ వారం జనవరి 27, 2023గా నిర్ణయించింది. ప్రస్తుతం కంపెనీ T+2 సెటిల్‌మెంట్ కేటగిరీలో ఉందని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. అందువల్ల జనవరి 25 ఎక్స్-డివిడెండ్ తేదీ కానుంది. దీనికి తోడు జనవరి 26 రిపబ్లిక్ డే కావటం వల్ల మార్కెట్లు మూసివేయబడి ఉంటాయని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి.

కంపెనీ పనితీరు..

కంపెనీ పనితీరు..

శుక్రవారం కంపెనీ షేర్లు 1.24 శాతం మేర పెరిగి రూ.4,311 వద్ద ముగిశాయి. గత నెలలో స్టాక్ ధర 10 శాతానికి పైగా పెరిగింది. అదే సమయంలో 6 నెలల కిందట కంపెనీ షేర్లపై విశ్వాసం వ్యక్తం చేసిన ఇన్వెస్టర్లు ఇప్పటివరకు హోల్డింగ్‌పై 18 శాతానికి పైగా రాబడిని అందుకున్నారు. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.4,954 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.3,092.05గా ఉంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.33,044.26 కోట్లుగా ఉంది.

English summary

Dividend Stock: ఒక్కో షేరుకు రూ.28 చెల్లింపు.. డివిడెండ్ కావాలంటే ఇలా చేయండి.. | Persistent Systems giving 28 rupees dividend per share know details

Persistent Systems giving 28 rupees dividend per share know details
Story first published: Sunday, January 22, 2023, 12:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X