ప్రస్తుతం దేశంలో మెజార్టీ ప్రజలు, సంస్థలు కరోనా హెల్త్ ఇష్యూ కంటే ఆర్థిక సంక్షోభం గురించే ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని లక్నో ఐఐఎం (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్) సెంటర్ ఫర్ మార్కెటింగ్ ఇన్ ఎమర్జింగ్ ఎకానమీస్ (CMEE) ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 23 రాష్ట్రాల్లోని 104 నగరాల్లో వివిధ వర్గాలకు చెందిన వారి ద్వారా సర్వే నిర్వహించారు. కరోనా వ్యాప్తిపై 79%మంది ఆందోళన చెందుతున్నారని, 40% మందిలో భయం, 22% మందిలో విచారం నెలకొందని ఈ అధ్యయనంలో తేలింది.

ఆర్థిక నష్టంపై ఆందోళన
లాక్ డౌన్ వల్ల ఆర్థికంగా జరుగుతోన్న నష్టంపై ఈ అధ్యయనంలో 32% మంది ఆందోళన వ్యక్తం చేశారు. లాక్ డౌన్‌ను ఎత్తేస్తే జనం ఇష్టారీతిన వ్యవహరిస్తారని, దీంతో కరోనా మరింత విజృంభిస్తుందని 15% మంది అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితుల గురించి 16% మందిలో, కరోనా బారిన పడతామని 14% మందిలో భయం నెలకొన్నట్లు అధ్యయనంలో తేలిందని వెల్లడించింది.

ప్రభుత్వం చర్యలపై విశ్వాసం
ప్రతి 5గురిలో ముగ్గురు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విశ్వాసం వ్యక్తం చేశారు. మొదటి దశ లాక్ డౌన్ సమయంలో 57 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేయగా రెండో దశ లాక్ డౌన్ సమయానికి అది 63 శాతానికి పెరిగింది. అలాగే, మాస్కులు, పీపీఈ కిట్స్ వంటి హెల్త్ ఇన్‌ప్రాస్ట్రక్చర్ పెరగడంపై ఎక్కువ మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల కోఆపరేషన్ బాగుందని 29 శాతం మంది, కేసులు, మరణాల శాతం తక్కువగా ఉండటంపై 26 శాతం, ప్రభుత్వం చర్యలపై 19 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు.

సర్వే పాల్గొన్నవారిలో...
ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 62 శాతం మంది పురుషులు, 38 శాతం మంది మహిళలు, 63 శాతం మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతకంటే ఎక్కువ, 40 శాతం మంది రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారు ఉన్నారు.

ఆతిథ్య రంగంపై పెను ప్రభావం
కరోనా-లాక్ డౌన్ కారణంగా ఆతిథ్య రంగంపై ఎక్కువ ప్రభావం పడింది. ఈ రంగానికి అపారనష్టం కలిగింది. కరోనా- లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న హోటల్స్, ట్రాన్సుపోర్ట్ సంబంధించిన అన్ని కార్యాలయాలు క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా ఈ వేసవిలో ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించి లాభపడాలనుకున్న వారికి నిరాశను మిగిల్చింది. కరోనా కారణంగా ఆతిథ్య రంగం రూ.5 లక్షల కోట్లకు పైగా నష్టపోయి ఉంటుందని ఈ రంగంలోని సంస్థల అంచనా. ఇందులో సంఘటిత రంగానికి చెందిన సంస్థలు మూడో వంతు ఆదాయాన్ని కోల్పోయాయని ఓ నివేదికలో వెల్లడైంది. ఆదాయ నష్టం, ఉద్యోగా, ఉపాధి అవకాశాలు పోయాయి. ఈ ఒక్క రంగంలోనే దాదాపు రెండు కోట్ల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతారని అంచనా.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications