For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రైవేట్ ఈక్విటీ పరవళ్లు: ఏడాదిలో భారీ స్థాయిలో పెట్టుబడులు

|

దేశంలోని వివిధ రంగాల్లో ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఆయా రంగాల్లోని కంపెనీలు వృద్ధి సాధించడానికి ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని పీఈ పెట్టుబడులు పెరుగుంతున్నాయి. ఆర్ధిక వ్యవస్థలో మందగమనం మూలంగా కొన్ని రంగాలు పెట్టుబడులు లేక విలవిల్లాడుతుంటే.. మరికొన్ని రంగాల్లోని కంపెనీలు మాత్రం పీఈ పెట్టుబడుల దన్నుతో మార్కెట్లను దున్నేస్తున్నాయి. గడచిన ఏడాది పీఈ పెట్టుబడులకు చాలా అనుకూలంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాదిలో పీఈ సంస్థలు కంపెనీల్లో ఏకంగా 3,700 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. 2018 సంవత్సరంలో ఈ సంస్థల పెట్టుబడుల మొత్తం 3,616 కోట్ల డాలర్లకు పరిమితం అయింది.

కొత్త సంవత్సరంలో ఏపీ-తెలంగాణలో లిక్కర్ సేల్స్ ఎంత పెరిగాయంటేకొత్త సంవత్సరంలో ఏపీ-తెలంగాణలో లిక్కర్ సేల్స్ ఎంత పెరిగాయంటే

వెంచర్ ఇంటెలిజెన్స్ వెల్లడించిన గణాంకాల ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఒక వైపు దేశ ఆర్ధిక వ్యవస్థలో వృద్ధి మందగించింది. మరోవైపు రాజకీయ ఆనిచ్చిత పరిస్థితులు. ఇంకోవైపు ప్రపంచ వాణిజ్యానికి సంబంధిన ఆందోళనలు. ఇన్ని ప్రతికూల పరిణామాలు ఉన్నప్పటికీ పీఈ పెట్టుబడులు పెరగడం అనేది ఆయా రంగాల్లోని కంపెనీలు వృద్ధి ని సాధించేందుకు ఉన్న సానుకూల పరిస్థితులేనని మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. ఈ పెట్టుబడుల వాతావరణం కంపెనీల్లో భరోసాను నింపుతోందని అంటున్నారు. పీఈ పెట్టుబడుల మూలంగా కంపెనీలు మరింత విశ్వాసంతో ముందడుగు వేసే అవకాశం ఉందని, దీని వల్ల ఎంతో ప్రయోజనం కూడా ఉంటుందని అంటున్నారు.

PE investments climbed to record level in last year

ఎన్ని డీల్స్ కుదిరాయంటే...
కంపెనీలకు వాటిలోని ఇన్వెస్టర్లకు పీఈ పెట్టుబడులు ఎంతో ముఖ్యమైనవి. ఈ పెట్టుబడుల ద్వారా ఆయా కంపెనీల షేర్ల ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ఈ పెట్టుబడులు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. 2017 సంవత్సరం నుంచి పీఈ పెట్టుబడులు పెరుగుతున్నాయి. 2017 సంవత్సరంలో 846 డీల్స్ కుదరగా వీటి విలువ 2,410 కోట్ల డాలర్లుగా ఉంది. 2018లో డీల్స్ 937 జరగ్గా వీటి విలువ 3,620 కోట్ల డాలర్లు, 2019 సంవత్సరంలో 861 డీల్స్ విలువ 3,700 కోట్ల డాలర్లుగా ఉంది.

- మొత్తం డీల్స్ లో 74 పీఈ పెట్టుబడులు 10 కోట్ల డాలర్లు అంతకు మించి ఉన్నాయి. మొత్తం పెట్టుబడుల్లో వీటి విలువనే 74 శాతం వరకు ఉండటం విశేషం.
- ఐదు పెట్టుబడుల విలువ 100 కోట్ల డాలర్లకు పైగా ఉంది.
- ఇక మొత్తం పెట్టుబడుల్లో మౌలిక సదుపాయాల కల్పనా రంగం వాటాయే 40 శాతానికి పైగా ఉండటం విశేషం. ఈ మొత్తం 1,470 కోట్ల డాలర్లుగా ఉంది.

ప్రధాన పెట్టుబడులు ఇవే ...
* రిలయన్స్ టవర్ ఇన్ఫ్రా తో పాటు రిలయన్స్ పైప్ లైన్ ఇన్ఫ్రా కంపెనీలు బ్రూక్ ఫీల్డ్ నుంచి వరుసగా 366 కోట్ల డాలర్లు, 187.5 కోట్ల డాలర్లు గా ఉన్నాయి.

* జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ కంపెనీ ఎస్ ఎస్ జీ క్యాపిటల్, జీఐసీ, ఇతర ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించింది.
* జీవీకే ఎయిర్ పోర్ట్స్.. ఎన్ ఐ ఐ ఎఫ్, ఏ డీ ఐ ఏ, పీఎస్పీ ఇన్వెస్ట్ మెంట్స్ నుంచి, పేటీఎం.. అలీబాబా, సాఫ్ట్ బ్యాంక్ ఇతర ఇన్వెస్టర్ల నుంచి, ఎస్ బీ ఐ లైఫ్ ఇన్సూరెన్సు.. కార్లైల్ నుంచి నిధులు సమకూర్చుకున్నాయి.

100 కోట్ల డాలర్ల విలువ దాటిన స్టార్ట్ అప్స్ ఎన్నంటే...

* ప్రస్తుతం మన దేశంలో 100 కోట్ల డాలర్లకు పైగా మార్కెట్ విలువ దాటిన స్టార్ట్ అప్స్ సంఖ్య 27 వరకు ఉంది.
* గత ఏడాది ఈ క్లబ్బులో చేరిన స్టార్ట్ అప్స్ తొమ్మిది.
* వీటిలో డెలివరీ, డ్రీమ్11, బిగ్ బాస్కెట్, రివిగో, ధ్రువ సాఫ్ట్ వేర్, ఐసెర్టిస్, సిటీయస్ టెక్, ఓలా ఎలక్ట్రిక్. లెన్స్ కార్ట్ ఉన్నాయి.
* వంద కోట్లకు పైగా మార్కెట్ విలువ కలిగిన స్టార్ట్ అప్స్ ను యునికార్న్ కంపెనీలుగా పరిగణిస్తారు.

English summary

ప్రైవేట్ ఈక్విటీ పరవళ్లు: ఏడాదిలో భారీ స్థాయిలో పెట్టుబడులు | PE investments climbed to record level in last year

Private Equity (PE) investments in last year reached new record level. According to a report in th e last year 3,700 crore dollar worth of 861 deals had reported.
Story first published: Friday, January 3, 2020, 8:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X