For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

hp Layoffs: కోత మెుదలైంది.. ఉద్యోగుల్ని ఎవ్వరూ రక్షించలేరు.. కంప్యూటర్ మేకర్

|

hp Layoffs: ప్రస్తుతం ఉన్న వ్యాపార వాతావరణంలో ఎదురవుతున్న సవాళ్లకు ఉద్యోగుల తొలగింపే ఏకైక సమాధానం అన్నట్లుగా కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో ఒకటి తర్వాత మరొక కంపెనీ తన ఉద్యోగుల తొలగింపు ప్రణాళికలను ప్రారంభించాయి. తాజాగా ఇందులో కంప్యూటర్ల తయారీ కంపెనీ hp కూడా చేరిపోయింది.

ఉద్యోగుల తొలగింపు..

ఉద్యోగుల తొలగింపు..

hp ఇది చిన్నప్పటి నుంచి మనలో చాలా మందికి పరిచయం ఉన్న కంప్యూటర్ల తయారీ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన దీని వ్యాపారాన్ని సైతం ప్రస్తుత మాంద్యం అతలాకుతలం చేస్తోంది. దీంతో ఫేస్‌బుక్, అమెజాన్, ట్విట్టర్ వంటి దిగ్గజాల తర్వాత.. హ్యూలెట్ ప్యాకర్డ్ ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. తన ప్లాన్ లో భాగంగా కంపెనీ సుమారు 6000 మందిని తొలగించేందుకు సిద్ధంగా ఉంది.

కారణం ఇదే..

కారణం ఇదే..

మాంద్యం ఆవరించిన వేళ చాలా మంది ప్రజలు కొత్త వస్తువులను కొనేందుకు విముఖత చూపుతున్నారు. దీంతో పర్సనల్ కంప్యూటర్లకు భారీగా డిమాండ్ తగ్గింది. ఇంది కంపెనీ ఆదాయం, లాభదాయకతలపై పెద్ద ప్రభావాన్ని చూపింది. రానున్న మూడేళ్లలో మెుత్తంగా 10 శాతం ఉద్యోగులను తొలగించాలని hp యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. గతంలో అమెరికాకు చెందిన చిప్ మేకర్ ఇంటెల్ సైతం ఇదే కారణంతో ఉద్యోగుల తొలగింపును ప్రకటించింది.

సీఈవో ఏమన్నారంటే..

సీఈవో ఏమన్నారంటే..

ప్రస్తుతం కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 61 వేల మందిలో 10 శాతం ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు కంపెనీ సీఈవో ఎన్రిక్ లోర్స్ వెల్లడించారు. కంపెనీ పునర్వ్యవస్థీకరణ ఖర్చులు మొత్తం 1 బిలియన్ డాలర్లుగా అంచనా వేసినట్లు చెప్పారు. ఆ ఖర్చుల్లో దాదాపు 60% కొత్త ఆర్థిక సంవత్సరంలో 2023లో తగ్గుతాయని వెల్లడించారు. ఈ ప్రణాళిక 2025 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఏడాదికి 1.4 బిలియన్ డాలర్లను ఆదా చేస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం మూడవ త్రైమాసికంలో ప్రపంచ PC షిప్‌మెంట్‌లలో దాదాపు 20% క్షీణత నమోదైందన్నారు.

Read more about: pc maker hp hp inc it layoffs it jobs
English summary

hp Layoffs: కోత మెుదలైంది.. ఉద్యోగుల్ని ఎవ్వరూ రక్షించలేరు.. కంప్యూటర్ మేకర్ | pc maker hp inc planning to layoff 6000 employees in next 3 years

pc maker hp planning to layoff 6000 employees in next 3 years
Story first published: Wednesday, November 23, 2022, 10:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X