డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు, మరింత మంది వ్యాపారులు డిజిటల్ చెల్లింపులు స్వీకరించేందుకు సరికొత్త సదుపాయాన్ని పేటీఎం అందుబాటులోకి తీసుకు వచ్చింది. హైదరాబాద్ సహా ఎనిమిది నగరాల్లో All in One QRను ప్రవేశ పెట్టింది.

వ్యాపారుల నుంచి ఛార్జీలు వసూలు చేయం
పేటీఎం వ్యాలెట్, రుపే కార్డులు, అన్ని UPI ఆధారిత పేమెంట్ యాప్స్ ద్వారా కొనుగోలుదారులు చేసే డిజిటల్ చెల్లింపుల్ని వ్యాపారులు స్వీకరించడానికి ఈ QR కోడ్ ఉపయోగపడుతుంది. పరిమితి లేకుండా కొనుగోలుదారులు చెల్లింపులు చేసుకోవచ్చు. చెల్లింపులు స్వీకరించే వ్యాపారుల నుంచి ఎలాంటి ఛార్జీ వసూలు చేయమని పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సౌరబ్ శర్మ తెలిపారు.

పదిహేను రోజుల్లో దేశవ్యాప్తంగా..
ఆల్ ఇన్ వన్ QRను హైదరాబాద్‌లో సోమవారం విడుదల చేశారు. ఇదే సమయంలో హైదరాబాదుతో పాటు మరో ఏడు నగరాల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. రానున్న పదిహేను రోజుల్లో దీనిని దేశ వ్యాప్తంగా ప్రవేశపెడతారు. QR కోడ్‌తో దుకాణాల్లో వినియోగించే కాలుక్యులేటర్, గడియారాలు, పెన్ స్టాండ్స్, సౌండ్ బాక్స్ తదితరాలను పేటీఎం విడుదల చేసింది.

వ్యాపారులు సౌండ్ వినవచ్చు
ఎవరైనా కొనుగోలుదారు చెల్లింపు చేసిన వెంటనే వ్యాపారులు దానిని సౌండ్ బాక్స్‌లో వినవచ్చు. QR కోడ్ ద్వారా కొనుగోలుదారులు చేసే చెల్లింపులు నేరుగా సదరు వ్యాపారుల బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతాయి.

ఏపీ, తెలంగాణలలో...
సోమవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఆల్ ఇన్ వన్ QR కోడ్ ప్రవేశ పెట్టారు. ఏపీ, తెలంగాణలలో పేటీఎంను వినియోగించి కొనుగోలుదారులు చేసే చెల్లింపులను 15 లక్షల మంది వ్యాపారులు స్వీకరిస్తున్నారు. వచ్చే ఏడాదికి ఈ సంఖ్యను 30 లక్షల నుంచి 35 లక్షలకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలలో 60 శాతం వృద్ధి నమోదయింది.

మర్చంట్స్‌ను 2.5 కోట్లకు పెంచుకోవడమే లక్ష్యం
ఆల్ ఇన్ వన్ QR కోడ్‌ను లాంచ్ చేసిన అనంతరం సౌరబ్ శర్మ మాట్లాడుతూ... ఇప్పటికే 1.5 కోట్ల మంది మర్చంట్స్ ఉన్నారని, వచ్చే ఏడాది ఈ సంఖ్యను 2.5 కోట్లకు పెంచుకోనున్నట్లు తెలిపారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications