For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Paytm: యూపీఐ ట్రాన్సాక్షన్లకు ఇన్సూరెన్స్ రక్షణ.. పేమెంట్ ప్రొటెక్ట్ పూర్తి వివరాలు..

|

Paytm: యూపీఐ చెల్లింపుల సంస్థ పేటీఎం ఎల్లప్పుడూ కస్టమర్ల రక్షణ, చెల్లింపుల సులభతరం చేసేందుకు అనేక చర్యలు చేపడుతోందని మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో అన్ని యాప్‌లు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ద్వారా జరిపే లావాదేవీలను బీమా చేయడానికి HDFC ERGO జనరల్ ఇన్సూరెన్స్‌తో కలిసి గ్రూప్ ఇన్సూరెన్స్ ప్లాన్ 'Paytm పేమెంట్ ప్రొటెక్ట్'ని సోమవారం ప్రారంభించింది.

 తక్కువ ప్రీమియంతో కవరేజ్..

తక్కువ ప్రీమియంతో కవరేజ్..

తొలుత కంపెనీ ఏడాదికి రూ.10,000 వరకు అందించే ఇన్సూరెన్స్ కవరేజ్ కు కేవలం రూ.30 కంటే తక్కువ ధరలో అందిస్తోంది. దీనిని కొనుగోలు చేసిన వినియోగదారులు మోసపూరిత లావాదేవీలు జరిగినప్పుడు ఆర్థికంగా నష్టపోకుండా రక్షణ పొందేందుకు వీలుంటుందని పేటీఎం వెల్లడించింది. అయితే ఏడాదికి రూ.లక్ష వరకు ఇన్సూరెన్స్ కవర్ కోసం త్వరలోనే మరిన్ని ఉత్పత్తులను జోడించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

 పేటీఎం ఏమందంటే..

పేటీఎం ఏమందంటే..

యూపీఐ వినియోగదారులను రక్షించడానికి, సైబర్ నేరాలకు వ్యతిరేకంగా పోరాడటానికి అనుకూలమైన ఇన్సూరెన్స్ క్లెయిమ్ కవర్ అందిస్తున్నాయని పేటీఎం లెండింగ్ సీఈవో భవేష్ గుప్తా వెల్లడించారు. దీనికోసం కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ ERGOతో జతకట్టినట్లు ఆయన వెల్లడించారు. దేశంలో సురక్షితమైన డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించటమే లక్ష్యంగా దీనిని అందుబాటులోకి తెచ్చినట్లు స్పష్టం చేశారు. నేటి డిజిటల్ యుగంలో సైబర్ ప్రమాదాలను తగ్గించడానికి వినూత్న పరిష్కారాలను అందించడానికి ఈ ఇన్సూరెన్స్ కవర్ ఎంతగానో దోహద పడుతుందని HDFC ERGO జనరల్ ఇన్సూరెన్స్ రిటైల్ ప్రెసిడెంట్ పార్థనిల్ ఘోష్ అన్నారు.

రక్షణ పొందటం ఎలా..?

రక్షణ పొందటం ఎలా..?

పేటీఎం ప్రొటెక్ట్ కింద ఎవరైనా వినియోగదారులు నమోదు చేసుకోవటానికి.. Paytm యాప్‌లో 'పేమెంట్ ప్రొటెక్ట్' కోసం సెర్చ్ చేయవచ్చు. అక్కడ వినియోగదారుని పేరు, మెుబైల్ నంబర్ నమోదు చేసి 'ప్రొసీడ్ టు పే'పై క్లిక్ చేయాలి. ఇటీవల పేటీఎం UPI ఇంటర్‌ఆపరబిలిటీని ప్రారంభించింది. దీని ద్వారా డబ్బు పొందుతున్న వ్యక్తి Paytmతో నమోదు చేసుకోనప్పటికీ చెల్లింపులకు వెసులుబాటు ఉంటుంది. ఫిషింగ్, ఈ-మెయిల్ స్పూఫింగ్ ద్వారా వచ్చే నష్టాలకు కూడా కవరేజ్ లభిస్తుందని కంపెనీ వెల్లడించింది.

 ప్లాన్ కింద ఏవేవి కవర్ కావంటే..?

ప్లాన్ కింద ఏవేవి కవర్ కావంటే..?

కార్డు, మొబైల్‌, ల్యాప్‌ట్యాప్‌, ఇతర డివైజులు దొంగిలించడం కారణంగా జరిగిన మోసాలను పాలసీ కవర్‌ చేయదు. పరిమితం చేసిన వెబ్‌సైట్‌లు, గ్యాంబ్లింగ్‌, ప్రొఫెషనల్‌, బిజినెస్‌ కార్యకలాపాల వల్ల జరిగిన మోసాలు, క్రిప్టో కరెన్సీ నష్టాలను కవర్‌ చేయదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు హెచ్డీఎఫ్సీ ఎర్గో అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.

English summary

Paytm: యూపీఐ ట్రాన్సాక్షన్లకు ఇన్సూరెన్స్ రక్షణ.. పేమెంట్ ప్రొటెక్ట్ పూర్తి వివరాలు.. | Paytm Launched payment protect Insurance plan with HDFC ERGO For UPI payments

Paytm Launched payment protect Insurance plan with HDFC ERGO For UPI payments
Story first published: Tuesday, December 20, 2022, 16:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X