For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాహసోపేతమైన అడుగు: 59 చైనీస్ యాప్స్ బ్యాన్‌పై పేటీఎం చీఫ్

|

దేశ భద్రత లక్ష్యంగా టిక్‌టాక్, హెలో సహా 59 చైనీస్ యాప్స్ పైన కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ స్వాగతించారు. ప్రజాదరణ పొందిన టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, విచాట్, షేర్ చాట్ వంటి యాప్స్‌ను దేశంలో నిషేధించడం దేశ ప్రయోజనాల విషయంలో తీసుకున్న ఓ సాహసోపేత నిర్ణయమని అభివర్ణించారు.

6 నెలల్లో ఆదాయం, ఖర్చులు పెరుగుతాయి: ఉద్యోగుల్లో సరికొత్త విశ్వాసం6 నెలల్లో ఆదాయం, ఖర్చులు పెరుగుతాయి: ఉద్యోగుల్లో సరికొత్త విశ్వాసం

ప్రముఖ మొబైల్ ఇంటర్నెట్ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఈ డిజిటల్ చెల్లింపులు, ఈ-కామర్స్ సేవలు అందిస్తున్న పేటీఎం యాప్‌ను నిర్వహిస్తోంది. ఈ మదర్ కంపెనీలో చైనాకు చెందిన అలీబాబా, యాంట్ ఫైనాన్స్ సంస్థల పెట్టుబడులు పెద్ద మొత్తంలో ఉన్నాయి. అయినప్పటికీ విజయ్ శేఖర్ శర్మ చైనా యాప్స్ నిషేధంపై సానుకూలంగా స్పందించడం గమనార్హం.

Paytm boss says ban on 59 Chinese apps bold step in national interest

జాతి ప్రయోజనాల కోసం ఇదో ధైర్యంతో కూడిన నిర్ణయమని కితాబిచ్చారు. మోడీ ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ నేపథ్యంలో బెస్ట్ ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూయర్స్ ముందుకు వచ్చి కొత్త ఆవిష్కరణలు అందించాల్సిన సమయమని పేర్కొన్నారు. భారతీయులతో... భారతీయుల కోసం నిర్మించాలని పేర్కొన్నారు. ఇదే భారత్ డిజిటల్ క్రాంతీ, ఆత్మనిర్భర్ భారత్ అని ట్వీట్ చేశారు.

English summary

సాహసోపేతమైన అడుగు: 59 చైనీస్ యాప్స్ బ్యాన్‌పై పేటీఎం చీఫ్ | Paytm boss says ban on 59 Chinese apps bold step in national interest

Paytm founder Vijay Shekhar Sharma has made a statement on India banning 59 Chinese apps including popular ones like TikTok, UC Brower, WeChat, Shareit, others saying the move by the Government of India is in the national interest.
Story first published: Tuesday, June 30, 2020, 21:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X