For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2 పాన్‌కార్డులు.. లగ్జరీగా ఖర్చులు: అలా ఐతే 18 కోట్ల పాన్‌కార్డులు క్యాన్సిల్?

|

ఆధార్ కార్డు-పాన్ కార్డు గడువును కేంద్ర ప్రభుత్వం గతంలో మార్చి 31, 2021కి పొడిగించింది. అంతకుముందు వివిధ కారణాలతో దీనిని పొడిగిస్తూ వచ్చింది. తాజాగా కరోనా మహమ్మారి వంటి కారణాలతో ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అవకాశం కల్పించింది. ఆ గడువులోగా ఆధార్-పాన్ లింక్ చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ పలుమార్లు సూచించింది. అయితే చాలామంది ఇంకా లింక్ చేయకుండా ఉన్నారు. ఇంకా కోట్లాది పాన్ కార్డులు ఆధార్ కార్డుతో లింక్ చేయలేదు. ఇందులో డూప్లికేట్ అంటే ఒకరికి ఒకటికి మించి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి.

రెస్టారెంట్లకు భారీ షాక్, 40% పర్మినెంట్‌గా క్లోజ్: అదొక్కటే కాస్త గుడ్‌న్యూస్రెస్టారెంట్లకు భారీ షాక్, 40% పర్మినెంట్‌గా క్లోజ్: అదొక్కటే కాస్త గుడ్‌న్యూస్

18 కోట్ల పాన్ కార్డులు క్యాన్సిల్!

18 కోట్ల పాన్ కార్డులు క్యాన్సిల్!

మార్చి 31, 2021 నాటికి ఆధార్ కార్డుతో లింక్ చేయని పాన్ కార్డులను ఐటీ శాఖ నిర్వీర్యం చేస్తోంది. ఇలా ఇప్పటి వరకు లింక్ చేయని పాన్ కార్డులు దాదాపు 18 కోట్లు ఉన్నాయని, గడువు ముగిసేలోగా వాటిని ఆధార్‌తో జత చేసుకోవాలని సూచించింది ఐటీ శాఖ. లేదంటే వాటిని క్యాన్సిల్ చేయనున్నట్లు వెల్లడించింది. ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను ఉపయోగించే వారిని, పన్ను ఎగవేతదారులను, అధిక మొత్తాల్లో ట్రాన్సాక్షన్స్ జరిపే వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు ఐటీ అధికారులు తెలిపారు.

రెండు పాన్ కార్డులు... లగ్జరీగా ఖర్చులు

రెండు పాన్ కార్డులు... లగ్జరీగా ఖర్చులు

కొంతమంది లగ్జరీగా ఖర్చులు చేస్తూ పన్నులను ఎగవేసేందుకు ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులు ఉపయోగిస్తున్నారన్నారు. పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేస్తే ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు పొందే అవకాశం ఉండదని, అందుకే లింక్ చేసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నట్లు చెబుతున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్ డెబిట్ కార్డులు వంటి వ్యవస్థల ద్వారా జరిగే భారీ ట్రాన్సాక్షన్స్‌ను గుర్తించి ఆ ఖర్చులపై కూడా ఐటీ శాఖ నిఘా పెడుతుంది.

ఐటీ రిటర్న్స్.. జీలో ట్యాక్స్

ఐటీ రిటర్న్స్.. జీలో ట్యాక్స్

దేశంలో 50.95 కోట్ల పాన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు. కానీ 6.48 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తుండగా, 1.5 కోట్ల మంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారు. దాదాపు 4.98 కోట్ల మంది ఐటీఆర్ దాఖలు చేస్తున్నారు. వీరంతా దాదాపు జీరో ట్యాక్స్ లయబులిటీ లేదా ఫుల్ అమౌంట్ క్లెయిమ్ చేసుకుంటున్నారు. మరికొంతమందికి ఒకటికి మించి పాన్ కార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం 32.71 కోట్ల పాన్ కార్డులు మాత్రమే ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్నాయి. దేశంలో130 కోట్లకు పైగా జనాభా ఉండగా కేవలం కోటిన్నర మంది మాత్రమే ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల అన్నారు.

English summary

2 పాన్‌కార్డులు.. లగ్జరీగా ఖర్చులు: అలా ఐతే 18 కోట్ల పాన్‌కార్డులు క్యాన్సిల్? | PAN will not have to be linked with Aadhaar, 18 crore cards will be canceled after March 31

The central government has been continuously extending the deadline for linking PAN cards with Aadhaar.
Story first published: Friday, August 21, 2020, 17:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X