For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pakistan debts: పాకిస్థాన్ పరిస్థితి ఇంత దారుణమా ?

|

Pakistan debts: పొరుగు దేశం శ్రీలంక ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం తెలిసిందే. దాయాది పాకిస్థాన్ సైతం ఇప్పుడు అదే దారిలో పయనిస్తోందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. గత 22 ఏళ్లలో దాదాపు 1500 శాతం రుణభారం పెరిగినట్లు అక్కడి ప్రముఖ వార్తాపత్రిక 'ది ఎక్స్‌ ప్రెస్ ట్రిబ్లూన్‌' పేర్కొంది. 2000 సంవత్సరం నుంచి ఆ దేశానికి గడ్డు కాలం మొదలైనట్లు చెప్పింది. స్వాతంత్ర్యం అనంతరం 75 ఏళ్లలో ఏ విధంగా అప్పుల ఊబిలో చిక్కుకుపోయిందో వివరించింది.

ప్రభుత్వాలు పూర్తిగా విఫలం:

ప్రభుత్వాలు పూర్తిగా విఫలం:

2000 సంవత్సరం నుంచి అధికారంలో ఉన్న సైనిక, ప్రజా ప్రభుత్వాలే పాక్ రుణ భారం తీవ్రమవడానికి కారణమని ఆ పత్రిక అభిప్రాయపడింది. ఆర్థిక క్రమశిక్షణ, అప్పుల నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించింది. ప్రస్తుతం.. దేశ బడ్జెట్‌ లో 50 శాతం అంటే 4.8 లక్షల కోట్లు రూపాయలు కేలవం రుణాలపై వడ్డీ చెల్లింపులకే వెచ్చించాల్సి వచ్చినట్లు తెలిపింది.

 అప్పుల మీద అప్పులు:

అప్పుల మీద అప్పులు:

పాకిస్థాన్ మొత్తం రుణ భారతం 2000 సంవత్సరం నాటికి 3.1 ట్రిలియన్‌ రూపాయలుగా ఉంది. పర్వేజ్ ముషారఫ్ ఎనిమిదేళ్ల పాలనలో దాదాపు 100 శాతం పెరిగి 2008 నాటికి 6.1 ట్రిలియన్లకు పెరిగింది. తర్వాతి ఐదేళ్లలో 130 శాతం పెరిగి 14.3 ట్రిలియన్లకు చేరుకుంది. 2013తో పోలిస్తే తర్వాతి ఐదేళ్లలో అప్పులు 76 శాతానికి ఎగబాకి మొత్తం 25 లక్షల కోట్లకు వెళ్లింది. తాజా మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్.. దేశ రుణభారాన్ని కనీసం 5 లక్షలకోట్లు తగ్గిస్తానంటూ అధికారంలోకి వచ్చారు. కానీ అందుకు విరుద్ధంగా 25 నుంచి 44 లక్షల కోట్లకు తీసుకెళ్లి మరింత నష్టాల్లోకి నెట్టారు. వెరసి ప్రస్తుతానికి మొత్తం అప్పుల భారం 60 లక్షల కోట్లకు పైమాటే.

విదేశీ నిల్వలూ అడుగంటాయి..

విదేశీ నిల్వలూ అడుగంటాయి..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ లెక్కల ప్రకారం 1971లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ విభజన నాటికి కేవలం ఆ దేశ విదేశీ రుణం 564 మిలియన్ డాలర్లు. 1960 నుంచి 2014 మధ్య కాలంలో ప్రపంచ బ్యాంకు నుం 26 బిలియన్ డాలర్లను పాక్ రుణంగా పొందింది. ఫారెక్స్ నిల్వలు సైతం దశాబ్దంలో కనిష్ట స్థాయికి చేరుకుని సాయం కోసం ఎదురుచూస్తోంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ ఫోర్స్‌ పాకిస్థాన్‌ ను చాలా కాలంపాటు గ్రే లిస్టులో ఉంచడంతో అనుకున్న స్థాయిలో రుణాలను సైతం సమీకరించలేకపోయింది.

English summary

Pakistan debts: పాకిస్థాన్ పరిస్థితి ఇంత దారుణమా ? | Pakistan situation very worse due to peak debts

Pakistan external debts are in peak
Story first published: Saturday, January 21, 2023, 22:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X