For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Rocket Stock: రాకెట్ లాగా దూసుకెళ్తున్న షేర్.. దుస్తుల వ్యాపారంలో సంచలనం.. టార్గెట్ ధర ఎంతంటే..

|

Multibagger Stock: పెట్టుబడిని డబుల్ ట్రిపుల్ చేసిన స్టాక్ గురించి ఇప్పటి వరకు మనం మాట్లాడుకునే ఉంటాం. అయితే ఈ స్టాక్ వాటికి భిన్నం. స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన నాటి నుంచి షేర్ రాకెట్ లాగా దూసుకుపోతోంది. బ్రోకరేజ్ సంస్థలు ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌కు 'బై' రేటింగ్ ఇస్తున్నాయి. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

బలమైన త్రైమాసిక ఫలితాలతో..

బలమైన త్రైమాసిక ఫలితాలతో..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది పేజ్ ఇండస్ట్రీస్ స్టాక్ గురించే. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే నాటికి ఈ షేర్ తొలిసారిగా రూ.50,000 మార్క్ ను తాకింది. అద్భుతమైన త్రైమాసిక ఫలితాలను నివేదించిన తర్వాత.. అప్పెరల్ మాన్యుఫ్యాక్చరింగ్ స్టాక్ మంచి మెుమెంటం కలిగి ఉంది. శుక్రవారం స్టాక్ ట్రేడింగ్ ప్రారంభంలో రూ.50 వేల మార్క్ ను తాకినప్పటికీ.. ఇన్వెస్టర్లు లాభాలను బుక్ చేసుకునేందుకు మెుగ్గు చూపటంతో దాని ధర రూ.49,137.35 వేల దగ్గర ముగిసింది.

బ్రోకరేజ్ కంపెనీల టార్కెట్..

బ్రోకరేజ్ కంపెనీల టార్కెట్..

తాజా రిజల్ట్స్ ప్రకారం.. పేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నికర లాభం అనేక రెట్లు పెరిగి రూ.207 కోట్లకు పెరిగింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా దాని ఆదాయం రూ.1,341 కోట్లుగా ఉంది. త్రైమాసిక ఫలితాల తర్వాత.. బ్రోకరేజ్ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రూ.52,000 టార్కెట్ తో స్టాక్‌కు 'బై' ట్యాగ్‌ను ఇచ్చింది. బ్రోకరేజ్ ప్రకారం.. కంపెనీ కొత్త పెట్టుబడి మార్గంలో ఉంది. కంపెనీ రాబోయే రోజుల్లో మరింత లాభదాయకంగా ఉంటుందని బ్రోకరేజ్ అంచనా వేస్తోంది. ఇదే సమయంలో.. యాక్సిస్ సెక్యూరిటీస్ ఈ స్టాక్‌పై హోల్డ్ రేటింగ్ ఇస్తూ.. రూ.51,900 టార్గెట్ ధర‌గా నిర్ణయించింది.

అనేక దేశాల్లో కంపెనీ వ్యాపారం..

అనేక దేశాల్లో కంపెనీ వ్యాపారం..

పేజ్ ఇండస్ట్రీస్ ఇన్నర్‌వేర్‌ల తయారీ, రిటైలింగ్ వ్యాపారంలో అగ్రగామిగా ఉంది. కంపెనీ మన దేశంతో పాటు.. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఒమన్, ఖతార్, మాల్దీవులు, భూటాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లలో జాకీ ఇంటర్నేషనల్ ప్రత్యేక లైసెన్స్ ఉంది. ఇది భారతీయ మార్కెట్ కోసం స్పీడో ఇంటర్నేషనల్‌తో సహా వ్యాపార లైసెన్స్‌లను కలిగి ఉంది.

మల్టీబ్యాగర్ రాబడులు..

మల్టీబ్యాగర్ రాబడులు..

ఈ మల్టీబ్యాగర్ స్టాక్ మార్చి 2007లో లిస్టింగ్ అయినప్పుడు స్టాక్ ధర కేవలం రూ.270 గా ఉండేది. అయితే స్టాక్ 15 సంవత్సరాల కారంలో ఏకంగా 18110% పైగా లాభపడింది. ఆ సమయంలో స్టాక్ లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వారికి ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రూ.18.20 కోట్లుగా ఉంది. అయితే ఈ స్టాక్ రేటు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉందని బ్రోకరేజ్ అంచనాలు చెబుతున్నాయి.

Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసమే. వాటి ఆదారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవి కాబట్టి మీ ఆర్థిక సలహాదారును సంప్రదించి నిర్ణయం తీసుకోండి.

English summary

Rocket Stock: రాకెట్ లాగా దూసుకెళ్తున్న షేర్.. దుస్తుల వ్యాపారంలో సంచలనం.. టార్గెట్ ధర ఎంతంటే.. | page industries stock moving in rocket speed turned one lakh into 18 crores know brokerages target

this apperal stock gave multibagger returns to its investors know details
Story first published: Sunday, August 14, 2022, 13:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X