For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓయో సంచలనం: ఇకపై ఉద్యోగులందరూ వాటాదారులే!

|

కరోనా వైరస్ తో ప్రపంచంలో కొత్త వింతలు ఆవిష్కృతం అవుతున్నాయి. ఈ మహమ్మారి ఎన్ని కష్టాలను తెచ్చిందో... అలాగే కొన్ని అవకాశాలను కూడా మోసుకు వచ్చింది. ఇది ప్రముఖ ఆన్లైన్ హోటల్స్ గదుల బుకింగ్ సంస్థ ఓయో విషయంలో సరిగ్గా సరిపోతుంది. అనతి కాలంలోనే ఆకాశం అంత ఎత్తు ఎదిగిన ఇండియన్ స్టార్టప్ కంపెనీ ఐన ఓయో.. కొంత కాలంగా విపరీతమైన నష్టాలను నమోదు చేస్తూ సతమతం అవుతోంది. ఇంతలోనే ప్రపంచాన్ని కరోనా కాటేసింది.

ఈ సమయంలో అన్ని రంగాలకంటే అధికంగా ఆతిథ్య రంగం, టూరిజం, ట్రావెల్ రంగాలు ప్రభావితం అయ్యాయి. దీంతో ఈ రంగంలోనే సేవలు అందిస్తున్న ఓయో కూడా అంతకంటే అధికంగా దెబ్బతింది. కాబట్టి వెంటనే చాలా మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. సుమారు 2,400 మంది ఉద్యోగులను తొలగించినట్లు వార్తలు వెలువడ్డాయి.

అయితే, ఇక్కడే సంస్థ కొంచెం కొత్తగా ఆలోచించింది. ఇకపై ఉద్యోగులకు ఈ విషయంలో ఏదో రకంగా ప్రయోజనం చేకూర్చాలని, వారు కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, ఆ తర్వాత కూడా ఓయో తమ సొంత కంపెనీ అనే భావన కలిగేలా సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.

చైనా అవసరం లేదు.. చైనా పెట్టుబడులూ అవసరం లేదు..

వారంతా సహ యజమానులు...

వారంతా సహ యజమానులు...

కరోనా వైరస్ దెబ్బకు విధించిన లాక్ డౌన్ తో ఓయో కొంత మంది ఉద్యోగులను తొలగించగా... ఉన్న వారికి కూడా 25% వేతనాల్లో కోత విధించారు. మరికొందరిని ఆగష్టు వరకు పరిమితమైన ప్రయోజనాలతో ఇంటికే పరిమితం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఓయో సీఈఓ రోహిత్ కపూర్ కూడా ఒక సందర్భంలో ఇదే విషయం వెల్లడించారు. అయితే, తాజాగా కంపెనీ సరికొత్త విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం ఇకపై ఓయో ఉద్యోగులు అందరూ ఓయో సహ - యజమానులు (కో- ఓనర్) గా మారనున్నారు. ఆ మేరకు వారికి చాలా తక్కువ ధరలో కంపెనీ ఈసోప్స్ కేటాయించనున్నారు. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. కంపెనీ తమ ఉద్యోగులకు ఇచ్చిన రాత పూర్వక పత్రాలను కూడా చూసినట్లు ఈటీ పేర్కొంది.

తక్కువలో తక్కువ రూ 70,000...

తక్కువలో తక్కువ రూ 70,000...

ఎంప్లాయ్ స్టాక్ ఆప్షన్స్ (ఈసోప్స్) అందించే ప్రక్రియలో భాగంగా... ఓయో తమ ఉద్యోగులకు రూ. 10 ముఖ విలువ కలిగిన కంపెనీ షేర్ల ను కేటాయిస్తుంది. ఒక్కో షేరు వాస్తవిక మార్కెట్ విలువ సుమారు రూ 34 లక్షల మేరకు ఉన్నప్పటికీ... ఉద్యోగులకు వాటిని అత్యంత తక్కువ ధరకు (డిస్కౌంట్) కు కేటాయిస్తుంది. దీంతో ఒక్కో ఉద్యోగికి కనీసం రూ 70,000 మేరకు ప్రయోజనం చేకూరనుంది. ఇది కొంత మందికి రూ 1.5 లక్షల వరకు ఉండనుందని చెబుతున్నారు. ప్రస్తుత ఓయో సరికొత్త విధానం ప్రకారం ప్రతి ఉద్యోగికి ఈసోప్స్ కేటాయించిన నాటి నుంచి ఏడాది కాలం పాటు అవి అమల్లో ఉంటాయి. ఆ సమయంలో ఉద్యోగి ఓయో లో పనిచేస్తున్నా .. చేయకపోయినా ప్రయోజనం మాత్రం కొనసాగుతుంది.

రూ 130 కోట్ల కేటాయింపు...

రూ 130 కోట్ల కేటాయింపు...

ఓయో హోటల్స్ ఇండియా తో పాటు ప్రపంచవ్యాప్తంగా సుమారు 80 దేశాలకు విస్తరించింది. దీనికి సుమారు 17,000 మంది పూర్తిస్థాయి ఉద్యోగులు ఉన్నారు. ఒక్క ఇండియాలోనే సుమారు 8,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. కానీ వారిలో సుమారు 2,400 మందిని తొలగించారు. ప్రస్తుతం ఓయో అందిస్తున్న ఈసోప్స్ అందరు ఉద్యోగులకు వర్తిస్తుంది. ఇందుకోసం సుమారు రూ 130 కోట్ల నిధులను కేటాయించినట్లు ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్ ఉద్యోగులకు పంపిన ఒక అంతర్గత ఈమెయిల్ లో పేర్కొన్నట్లు ఈటీ తెలిపింది. అయితే, ఈసోప్స్ పథకాన్ని అటు కంపెనీ బోర్డు సభ్యుల అనుమతి తో పాటు కేంద్ర ప్రభుత్వ కార్పోరేట్ వ్యవహారాల శాఖ అనుమతి కూడా లభించాల్సి ఉంది. అన్ని అనుమతులు లభిస్తే ఇకపై ఓయో ఉద్యోగులంతా దాని కో ఓనర్స్ గా మారిపోనున్నారు.

English summary

Oyo sends letter to employees stating it's making all employees shareholders

Following the salary cuts which have been implemented across functions and putting some employees on a leave with limited benefits plan, SoftBank backed Oyo Hotels & Homes has sent off a letter to employees stating they have decided to make every employee a co-owner and shareholder of the company by granting them ‘deeply discounted ESOPS.'
Story first published: Sunday, July 5, 2020, 14:10 [IST]
Company Search