For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరుగుతున్న చమురు ధరలు, ఇక క్రూడాయిల్ ఉత్పత్తి తగ్గే ఛాన్స్

|

కరోనా వైరస్ కారణంగా చమురుకు డిమాండ్ పడిపోయింది. దీనికి తోడు రష్యా - సౌదీ అరేబియా ప్రైస్ వార్ ధరలు భారీగా పడిపోయేలా చేసింది. అయితే ఒపెక్ సమావేశానికి ముందు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. డిమాండ్ తగ్గిన నేపథ్యంలో ఉత్పత్తిని తగ్గించేందుకు అన్ని దేశాలు అంగీకారానికి వచ్చే అవకాశాలున్నాయి. ఈ ప్రభావం ధరలపై పడింది.

10 రోజుల్లో ఈ షేర్లు 30% శాతం లాభాలు తెచ్చాయి, రూ.5 లక్షల కోట్లతో హిందూస్తాన్ రికార్డ్10 రోజుల్లో ఈ షేర్లు 30% శాతం లాభాలు తెచ్చాయి, రూ.5 లక్షల కోట్లతో హిందూస్తాన్ రికార్డ్

అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ఫ్యూచర్స్ 3.5 శాతం (1.14 డాలర్లు) పెరిగి 33.97 డాలర్ల పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ ఫ్యూచర్స్ 5.1 శాతం (1.99 డాలర్లు) పెరిగి 26.37 డాలర్లు పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగడంతో భారత మార్కెట్‌పై ఈ ప్రభావం ఉంటుంది.

 OPEC Meeting: Crude oil futures gain 6.23%

క్రూడాయిల్ ఫ్యూచర్స్ నేడు (ఏప్రిల్ 9) భారత కరెన్సీలో బ్యారెల్‌కు రూ.2,012కు చేరుకుంది. టాప్ క్రూడాయిల్ ఉత్పత్తిదారులు చమురు ఉత్పత్తికి అంగీకారం తెలపనున్నారనే అంచనాల నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయి. ఫ్యూచర్ మార్కెట్లో ఏప్రిల్ డెలివరీ క్రూడాయిల్ ఇంట్రాడేలో అత్యధికంగా రూ.2,056 పలకగా, కనిష్టంగా రూ.1,969 పలికింది.

English summary

పెరుగుతున్న చమురు ధరలు, ఇక క్రూడాయిల్ ఉత్పత్తి తగ్గే ఛాన్స్ | OPEC Meeting: Crude oil futures gain 6.23%

In the futures market, crude oil for April delivery touched an intraday high of Rs 2,056 and an intraday low of Rs 1,969 per barrel on MCX.
Story first published: Thursday, April 9, 2020, 20:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X