For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తగ్గుతున్న ఉల్లి ధరలు, జనవరి నాటికి కిలో రూ.25!

|

గత కొంతకాలంగా భారీగా పెరుగుతూ సామాన్యుల కంట నీరు తెప్పిస్తున్న ఉల్లి ధరలు తగ్గుముఖం పడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. జనవరి 2020 వాటికి ఉల్లి ధరలు కిలో రూ.20 నుండి రూ. 25కు దిగి వస్తుందని భావిస్తున్నారు. ఉల్లి మార్కెట్ కు రావడం క్రమంగా పెరుగుతుందని, దీంతో ఈ నెలలోనే కిలో ఉల్లి రూ. 30 నుండి రూ. 35కు దిగి కావొచ్చని అంచనా వేస్తున్నారు.

అందుకే తగ్గుతున్నాయి

అందుకే తగ్గుతున్నాయి

కాగా కొత్త పంట అందుబాటులోకి వస్తున్నాయి. జనవరి నాటికి మరింత పంట చేతికి కానుంది. దీంతో ధరలు నెమ్మదిగా దిగి వస్తున్నాయని చెబుతున్నారు. హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌ హోల్‌ సేల్ మార్కెట్లో లాసాగావ్ నుంచి వచ్చిన ఉల్లి రూ. 70 నుంచి ర౪. 90పలుకుతోంది.

ఈ ఉల్లి ధర ఎంతంటే

ఈ ఉల్లి ధర ఎంతంటే

ఇక కర్నాటక, కర్నూలు, మహబూబ్‌నగర్‌, మెదక్‌ నుంచి వచ్చిన ఉల్లి రూ. 30 నుంచి రూ.60 పలుకుతుంది. కానీ మహారాష్ట్ర నుంచి వస్తున్న పాతది మాత్రం రూ.100కు పైగా ఉంది. ఇప్పటి వరకు హైదరాబాదుకు తక్కువగా ఉల్లి వస్తున్నందున ధర 150 వరకు కూడా పలుచోట్ల పలుకుతుంది.

తగ్గుదల

తగ్గుదల

ఇప్పుడిప్పుడే దిగుమతి పెరుగుతోంది. దీంతో ధరలు తగ్గుతున్నాయి. కొత్త పంటకు తోడు మహారాష్ట్ర నుంచి కూడా పంట నగరానికి దిగుమతి అవుతోంది. ఉల్లి పంట పండించే రాష్ట్రాలలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఉల్లి దిగుమతి తగ్గి ధర పెరిగిన విషయం తెలిసిందే.

English summary

తగ్గుతున్న ఉల్లి ధరలు, జనవరి నాటికి కిలో రూ.25! | Onion prices likely to be between Rs. 20 in January

Onion prices are likely to be between Rs 20 a kg and Rs 25 a kg by January. Prices will decline gradually as arrivals increase steadily.
Story first published: Friday, December 13, 2019, 8:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X