దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేదలకు ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్రం ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానాన్ని అమలు చేయనున్నారు. రేషన్ కార్డు ఉన్న పేదలు దేశంలోని ఏ ప్రాంతంలోని రేషన్ షాప్‌కైనా వెళ్లి సరుకులు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ సదుపాయం వచ్చే ఏడాది జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని ప్రభుత్వం మంగళవారం లోకసభకు తెలిపింది.

వీరికి లబ్ధి
ఒకే దేశం ఒకే రేషన్ కార్డు పథకం వల్ల వలస కార్మికులు, దినసరి కూలీలు లబ్ధి పొందుతారని రామ్ విలాస్ పాశ్వాన్ చెప్పారు. జాతీయ ఆహార భద్రత చట్టం కింద లబ్ధిదారులు దేశంలోని ఏ రేషన్ దుకాణానికి అయినా వెళ్లి తమకు నిర్దేశించిన ఆహార ధాన్యాలను కొనుగోలు చేయవచ్చునని చెప్పారు.

వేలిముద్రలు, ఆదార్ ధ్రవీకరించుకోవడం ద్వారా
సదరు రేషన్ దుకాణంలోని ఈపోస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్)లో వేలిముద్రలు/ఆధార్ కార్డును ధ్రువీకరించుకోవడం ద్వారా ఈ సదుపాయం పొందవచ్చని రామ్ విలాస్ పాశ్వాన్ చెప్పారు.

ఒకే కార్డు ఆలోచన లేదు
పౌరులంతా అన్ని సదుపాయాలు పొందేందుకు వీలుగా ఒకే కార్డును జారీ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర సహాయమంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి జాతీయ జనాభా రిజిస్టర్‌ను సిద్ధం చేసి, తాజాపరచాలని తమ ప్రభుత్వం ప్రతిపాదించిందని అన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications