For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూడింట ఒక బిజినెస్ రికవరీ కష్టమే.. కరోనా దెబ్బతో మాత్రమేకాదు

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి 25వ తేదీ నుండి కొనసాగిన లాక్ డౌన్ ఇప్పుడిప్పుడే అన్‌లాక్ అవుతోంది. ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. కానీ కరోనా దెబ్బ కారణంగా మూడింట ఒక వంతు స్వయం ఉపాధి, చిన్న-మధ్యతరహా వ్యాపారాలు కోలుకునే పరిస్థితి లేదని ఆల్ ఇండియా మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (AIMO) తెలిపింది. 9 ఇతర ఇండస్ట్రీ బాడీలతో కలిసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

Covid 19తో పదేళ్ల దెబ్బ: అమెరికా పరిస్థితి దారుణం.. 2030 వరకు అంతేCovid 19తో పదేళ్ల దెబ్బ: అమెరికా పరిస్థితి దారుణం.. 2030 వరకు అంతే

రికవరీ కష్టమే

రికవరీ కష్టమే

ఎంఎస్ఎంఈ, స్వయంఉపాధి, కార్పోరేట్ సీఈవోలు, ఉద్యోగులు తదితరుల నుండి AIMO 46,525 స్పందనలు తీసుకుంది. మే 24వ తేదీ నుండి మే 30వ తేదీ మధ్య ఆన్ లైన్ ద్వారా సర్వే చేసింది. ఎంఎస్ఎంఈల నుండి 35 శాతం, స్వయం ఉపాధి నుండి 37 శాతం మంది రికవరీ కష్టమని వెల్లడించాయి. ఎంఎస్ఎంఈలో 32 శాతం మంది రికవరీకి ఆరు నెలలు పడుతుందంటే, కేవలం 12 శాతం మంది మాత్రం మూడు నెలలు పడుతుందని తెలిపాయి.

కరోనా ఒక్కటే తీసిన దెబ్బ కాదు

కరోనా ఒక్కటే తీసిన దెబ్బ కాదు

కార్పోరేట్ సంస్థలు మూడు నెలల్లో కోలుకుంటాయని భావిస్తున్నాయి. అయితే కొంతమంది వ్యాపారాలు క్లోజ్ చేయడానికి కరోనా మహమ్మారి ఒక్కటే కారణంగా భావించడం లేదని సర్వేలో వెల్లడైంది. నోట్ల రద్దు, జీఎస్టీ, గత రెండు మూడేళ్లుగా కొనసాగిన మందగమనానికి కరోనా దెబ్బపడటంతో క్లోజ్ చేయాల్సిన పరిస్థితి అని తేలింది. నాటి నుండి అప్పుల్లో కూరుకుపోయి, కరోనా వల్ల కోలుకోలేని పరిస్థితికి చేరుకున్నారని AIMO మాజీ ప్రెసిడెంట్ కేఈ రఘునాథన్ అన్నారు. స్వాతంత్రానంతరం ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు.

మేం సేఫ్.. వారు కోలుకోలేరు

మేం సేఫ్.. వారు కోలుకోలేరు

కరోనా వల్ల తమపై ఎలాంటి ప్రభావం పడలేదని 3 శాతం ఎంఎస్ఎంఈలు, 6 శాతం కార్పోరేట్స్, 11 శాతం స్వయంఉపాధికి చెందిన వారు చెప్పారు. ఎందుకంటే వీరు లాక్ డౌన్ సమయంలో అత్యవసరమైన ఎమర్జెన్సీ సేవల్లో ఉండటంతో వీరిపై ప్రభావం పడలేదు. మొత్తంగా 32 శాతం మంది రికవరీ కష్టమని, 29 శాతం మంది కోలుకోవడానికి 6 నెలలు పడుతుందన్నారు.

English summary

మూడింట ఒక బిజినెస్ రికవరీ కష్టమే.. కరోనా దెబ్బతో మాత్రమేకాదు | One in three small businesses close to winding up

AS UNLOCK 1 kicks in, more than a third of self-employed and small and medium businesses do not see any grounds for recovery and are on the verge of winding up, according to a survey by All India Manufacturers’ Association (AIMO) in partnership with nine other industry bodies.
Story first published: Tuesday, June 2, 2020, 19:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X