For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

JRD Tata: దేశ దశ దిశ మార్చిన JRD టాటా జయంతి నేడు .. జీవితగాథ తెలుసుకోవాల్సిందే.. రతన్ టాటా..

|

JRD Tata: దేశ అభివృద్ధిలో టాటాల పాత్ర మరువలేనిది. ఈ రోజు దేశంలోని గొప్ప పారిశ్రామికవేత్త జేఆర్‌డీ టాటా జయంతి. ఆయన 29 జూలై 1904న పారిస్‌లో జన్మించారు. JRD టాటా 53 ఏళ్ల పాటు టాటా సన్స్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన హయాంలో టాటా గ్రూప్ వృద్ధి 50 రెట్లు పెరిగింది. TCS సహా 14 కొత్త కంపెనీలను ప్రారంభించాడు. టాటా మోటార్స్, టాటా సాల్ట్, టాటా గ్లోబల్ బెవరేజెస్, టైటాన్ వంటి విజయవంతమైన కంపెనీలకు JRD టాటా పునాదులు వేశారు. దేశంలోనే తొలి విమానయాన సంస్థను ప్రారంభించిన ఘనత కూడా ఆయనదే. ఆయన జీవిత చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 ఫ్రాన్స్‌లో జన్మించి..

ఫ్రాన్స్‌లో జన్మించి..

JRD టాటా తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో గొప్ప విజయాలు సాధించారు. ఆయన పూర్తి పేరు జహంగీర్ రతన్ జీ దాదాభోయ్ టాటా. 1904 సంవత్సరంలో పారిస్‌లో జన్మించారు. JRD టాటా బాల్యం ఫ్రాన్స్‌లో గడిచింది. వేసవి సెలవుల్లో, ఆయన ఒకసారి విమానయాన రంగంలోని అనుభవజ్ఞుడైన సర్ లూయిస్ బ్లెరియట్‌ను కలిశారు. ఇది విమానం, ఫ్లయింగ్ పట్ల జేఆర్డీ టాటాకు ఆసక్తిని రేకెత్తించింది.

 నాలుగు దేశాల్లో విద్యాభ్యాసం..

నాలుగు దేశాల్లో విద్యాభ్యాసం..

JRD టాటా నాలుగు దేశాల్లో చదువుకున్నారు. ఫ్రాన్స్‌తో పాటు జపాన్, ఇంగ్లండ్, భారత్‌లో చదువుకున్నారు. తన భార్య మరణానంతరం.. జేఆర్డీ టాటా తండ్రి కుటుంబాన్ని ఇండియాకు, జేఆర్‌డీని ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్‌కు పంపారు. ఫ్రెంచ్ పౌరుడిగా.. JRD కనీసం ఒక సంవత్సరం ఫ్రెంచ్ సైన్యంలో చేరవలసి వచ్చింది. సర్వీసు తర్వాత కూడా సైన్యంలో ఎక్కువ సమయం గడపాలని భావించినా.. తండ్రి అనుమతించలేదు. JRD పనిచేసిన రెజిమెంట్ సైనికులందరూ తరువాత మొరాకోలో చంపబడ్డారు.

 జీతం లేని ఉద్యోగం..

జీతం లేని ఉద్యోగం..

JRD కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ చదవాలనుకున్నారు. కానీ తండ్రి ఆదేశాల మేరకు ఇండియా తిరిగి వచ్చేశారు. అతను డిసెంబర్ 1925 లో టాటా గ్రూప్‌లో అప్రెంటిస్‌గా తన వృత్తిని ప్రారంభించారు. 1929 తన విదేశీ పౌరసత్వాన్ని వదులుకుని భారత్ లో వ్యాపారంపై పూర్తి దృష్టి పెట్టాడు. 1930లో తెల్మా వికాజీని వివాహం చేసుకున్నారు. కానీ వారికి పిల్లలు లేరు. నిజానికి థెల్మా అతని న్యాయవాది.

ఫాథరాఫ్ ఇండియన్ ఏవియేషన్..

ఫాథరాఫ్ ఇండియన్ ఏవియేషన్..

JRD భారతదేశ పౌర విమానయాన పరిశ్రమకు తండ్రి అని కూడా పిలుస్తారు. 1929లోనే దేశంలో విమానాన్ని నడిపేందుకు లైసెన్స్ పొందిన మొదటి వ్యక్తి ఆయన. దీని తరువాత.. 1932లో మొట్టమొదటి వాణిజ్య విమానయాన సంస్థ టాటా ఎయిర్‌లైన్స్‌ను స్థాపించారు. ఎయిర్ ఇండియా జాతీయీకరణ తర్వాత కూడా JRD చైర్మన్‌గా కొనసాగారు. ఇటీవలే ఎయిరిండియా టాటా గ్రూప్‌కు తిరిగి వచ్చింది.

 అనేక కంపెనీలకు పునాది..

అనేక కంపెనీలకు పునాది..

JRD టాటా విద్యా రంగంలో కూడా ముఖ్యమైన కృషి చేశారు. 1936లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(TISS)ని స్థాపించారు. దీని తర్వాత 1945లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(TIFR), నేషనల్ సెంటర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ స్థాపించారు. JRD అర్ధ శతాబ్దం క్రితమే కంప్యూటర్ల శక్తిని గ్రహించి.. 1968లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు పునాది వేశారు. ప్రస్తుతం ఇది దేశంలో అతిపెద్ద IT కంపెనీగా ఉంది. 1987లో టైటాన్‌ను స్థాపించాడు.

భావోద్వేగానికి గురైన రతన్ టాటా..

టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా.. జూలై 29న ఆయన 118వ జయంతి సందర్భంగా విమానయాన మార్గదర్శకుడు JRD టాటాకు నివాళులర్పించారు. JRD టాటాను గౌరవిస్తూ సోషల్ మీడియా పోస్ట్‌లో రతన్ టాటా.. ఆయన వారసత్వం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. జేఆర్డీ టాటా తన జీవితంపై భారీ ప్రభావాన్ని చూపిన వ్యక్తి అని తెలిపారు.

భారతరత్నతో సత్కారం..

భారతరత్నతో సత్కారం..

JRD 1956లో టాటా గ్రూప్‌లోని యువ ప్రతిభకు శిక్షణ ఇచ్చి వారిని నాయకత్వానికి సిద్ధం చేయాలనే లక్ష్యంతో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) తరహాలో టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (TAS)ని ప్రారంభించింది. టాటా తొలిసారిగా 8 గంటల డ్యూటీని నిర్ణయించింది. ఒక ఉద్యోగికి ప్రమాదం జరిగితే, టాటా మొదటగా నష్టపరిహారాన్ని ప్రారంభించింది. ఉద్యోగులకు ఉచిత వైద్య సౌకర్యం మరియు ప్రావిడెంట్ ఫండ్ పథకాన్ని కూడా తొలుత వీరే ప్రారంభించారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను పొందిన ఏకైక పారిశ్రామికవేత్త JRD టాటా. 1992లో ఆయనకు భారతరత్న పురస్కారం లభించింది. 29 నవంబర్ 1993న ఆయన జెనీవాలోని ఒక ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.

English summary

JRD Tata: దేశ దశ దిశ మార్చిన JRD టాటా జయంతి నేడు .. జీవితగాథ తెలుసుకోవాల్సిందే.. రతన్ టాటా.. | on JRD Tata 118 birth aniversary his journey that evey indian should know and ratan tata remembered memories

on JRD Tata 118 birth aniversary his legendary journey
Story first published: Friday, July 29, 2022, 16:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X