For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Omicron variant: TCS, ఇన్ఫోసిస్, HCL ఆలోచనలకు ఒమిక్రాన్ దెబ్బ

|

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో గతంలో తమ ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించే ప్రయత్నాలు చేసిన ఐటీ సంస్థలు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో మళ్లీ పునరాలోచనలో పడ్డాయి. ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ వంటి ఐటీ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ప్రోగ్రాంను పోస్ట్‌‍పోన్ చేశాయి. ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించే అంశంపై ఐటీ కంపెనీలు తర్జనభర్జన పడుతున్నాయి.

వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్‌కు స్వస్తీ పలకాలని, గతంలో నిర్ణయించినప్పటికీ, ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. జనవరి 2022 నుండి బ్యాక్ టు ఆఫీస్ ప్రణాళికలను సిద్ధం చేశాయి ఐటీ కంపెనీలు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్‌ను కొనసాగించే ఆలోచనలో పడ్డాయి.

మళ్లీ ఆలోచిస్తాం...

మళ్లీ ఆలోచిస్తాం...

ఒమిక్రాన్ అంశం తేలాకే తమ ఉద్యోగులు మళ్లీ కార్యాలయాలకు వస్తారని, అప్పటి వరకు హైబ్రిడ్ విధానమే అమలవుతుందని, 100 శాతం ఉద్యోగులు కార్యాలయాలకు ప్రోగ్రాం ఇక ఉండదని టీసీఎస్ ప్రతినిధులు చెబుతున్నారు. టీసీఎస్‌లో ఇప్పటికే పది శాతం మంది ఉద్యోగులు ఆఫీస్ నుండి వర్క్ చేస్తున్నాయి. క్రమంగా పూర్తిస్థాయి ఉద్యోగులను రప్పించే ఆలోచన చేశాయి.

కానీ ఇప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. అలాగే, పరిస్థితులకు అనుగుణంగా, ఉద్యోగుల ఆరోగ్యం దృష్ట్యా నిర్ణయం తీసుకుంటామని ఇన్ఫోసిస్ తెలిపింది.కరోనా వేరియంటలు ఉద్యోగుల కదలికలను ఏ మేరకు ప్రభావితం చేస్తాయనేది నిరంతరం మదింపు చేస్తున్నామని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వెల్లడించింది.

కంపెనీల ఆలోచనలో మార్పు

కంపెనీల ఆలోచనలో మార్పు

రెండో త్రైమాసికం ఫలితాల సందర్భంగా అక్టోబర్ నెలలో వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కు మారనున్నట్లు ఆయా ఐటీ కంపెనీలు వెల్లడించాయి. డిసెంబర్ 2021 నుండి జనవరి 2022 నాటికి ఉద్యోగులను క్రమంగా కాల్ బ్యాక్ (కార్యాలయానికి రప్పిస్తాం) చేస్తామని వెల్లడించారు. అదే సమయంలో హైబ్రిడ్ మోడల్‌కు పూర్తిగా స్వస్తీ పలకమని చెప్పాయి.

మొదట 25 ఏళ్లకు పైగా ఉన్న ఉద్యోగులను, ఆ తర్వాత 40 ఏళ్లకు పైగా ఉన్న ఉద్యోగులను కార్యాలయాలకు క్రమంగా రప్పిస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. నాస్‌కాం ప్రకారం దేశంలోని 4.5 మిలియన్ల మంది త్వరలో ఆఫీస్ నుండి వర్క్ చేయాల్సి ఉంది. అయితే ఒమిక్రాన్ కారణంగా ఇది వాయిదా పడుతూ వస్తోంది. కొత్త వేరియంట్ కంపెనీలలో మార్పును తీసుకు వచ్చాయి.

ఐటీకి సవాళ్లు

ఐటీకి సవాళ్లు

ఐటీ ఉద్యోగాలు ఏడాదిన్నరకు పైగా ఇంటి నుండి వర్క్ చేస్తున్నారు. దీనికి అనుగుణంగా ఐటీ పరిశ్రమ పనివిధానాల్లో మార్పులు వచ్చాయి. అయితే ఐటీ సేవలకు ప్రస్తుతం ఉన్న అనుకూల పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మన ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులు వస్తున్నాయి. క్లౌడ్, అనలటిక్స్, ఏఐ, మెషీన్ లర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, 5జీ, వీఎల్ఎస్ఐ వంటి ప్రాజెక్టులు చేపడుతున్నాయి.

ఇప్పటికీ ఐటీ కంపెనీలకు తగినంత మంది ఐటీ నిపుణులు దొరకటం లేదనే వాదనలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ పరిశ్రమ డబుల్ డిజిట్ గ్రోత్‌ను నమోదు చేయవచ్చు. నైపుణ్యాల అభివృద్ధి ప్రధాన సమస్యగా మారింది ఐటీకి. కొత్త అవకాశాలకు తగినట్లుగా మానవ వనరులను సిద్ధం చేసుకోవాలి. దీనిపై ముందస్తుగా పెట్టుబడులు పెట్టాలి.

English summary

Omicron variant: TCS, ఇన్ఫోసిస్, HCL ఆలోచనలకు ఒమిక్రాన్ దెబ్బ | Omicron variant: Return To Office Postponed By TCS, Infosys, HCL

The recent outbreak of Omicron variant has forced Indian IT companies to postpone their move to work from office for millions of employees.
Story first published: Wednesday, December 22, 2021, 14:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X