For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికాలో తీవ్ర ప్రతిష్టంభనకు దారితీస్తున్న ఒమిక్రాన్!

|

సౌతాఫ్రికాలో గుర్తించిన కరొనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. గత ఏడాది కోవిడ్ 19 కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. ఆ తర్వాత క్రమంగా కోలుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ అంటూ ఆందోళనలు కనిపిస్తున్నాయి. తాజాగా ఒమిక్రాన్ కారణంగా ప్రపంచ ఆరోగ్య సంక్షోభంతో పాటు ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ కొత్త వైరస్‌ను గుర్తించిన తర్వాత ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లు కుప్పకూలాయి. ఈ వైరస్ గుర్తింపుకు ముందే పెరుగుతున్న ద్రవ్యోల్భణం, క్షీణిస్తున్న వృద్ధి ప్రపంచాన్ని వణికించింది. దీనికి ఒమిక్రాన్ తోడవడం మరింత ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తోంది.

కొత్త వేరియంట్ భయాలు

కొత్త వేరియంట్ భయాలు

ఒమిక్రాన్ గుర్తింపు తర్వాత ప్రపంచ మార్కెట్‌తో పాటు అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పటికే ఈ కొత్త కేసును తొమ్మిది దేశాలకు పైగా నివేదించాయి. మళ్లీ పలు దేశాల్లో సాధారణ జీవనస్థితికి అంతరాయం కనిపిస్తోంది. ఇప్పటికే ఒమిక్రాన్‌ను ఆందోళన కలిగిచే వేరియంట్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఎందుకంటే ఇది అధిక ఇన్‌ఫెక్షన్ ప్రభావం, వ్యాక్సీన్‌ను కూడా ఇది అధిగమిస్తుందని చెబుతున్నారు.

దక్షిణాఫ్రికా దేశాల నుండి అమెరికా, కెనడా, యూకేతో సహా పలు దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ఒమిక్రాన్‌ను నియంత్రించడంపై ప్రపంచం దృష్టి సారించిన సమయంలో మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.

ఫియర్ ఇండెక్స్ VIX శుక్రవారం 9 పాయింట్లకు పైగా పెరిగి 27ను దాటింది. కొత్త వేరియంట్ భయంతో డిమాండ్ తగ్గుతుందనే ఉద్దేశ్యంతో చమురు ధరలు ఏకంగా పది శాతం క్షీణించాయి. యూఎస్ గవర్నమెంట్ బాండ్స్ గత ఏడాది కాలంలోనే అతిపెద్ద వన్డే మూవ్‌ను నమోదు చేసింది.

సరఫరా గొలుసుపై ప్రభావం

సరఫరా గొలుసుపై ప్రభావం

ఒమిక్రాన్ వేగవంతమైన వ్యాప్తీ సరఫరా గొలుసు ఇబ్బందులను మరింత తీవ్రతరం చేస్తోందని, రికార్డ్ స్థాయిలో అధిగ ద్రవ్యోల్భణ ఒత్తిడిని పెంచుతుందని అమెరికా ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధి క్షీణత, అధిక ద్రవ్యోల్భణం ఈ రెండు ప్రస్తుత మార్కెట్‌కు ఆందోళన కలిగించే అంశాలుగా పేర్కొంది. ఫెడ్ పాలసీలో మార్పుకు ఇది అవకాశమని, ద్రవ్యోల్భణం తాత్కాలికమైన అంశం కాదని, దీనిని ఫెడ్ గ్రహించాలని అలియన్జ్ ముఖ్య ఆర్థికసలహాదారు మొహమ్మద్ ఎల్-ఎరియాన్ అన్నారు.

30 మ్యుటేషన్స్

30 మ్యుటేషన్స్

సౌతాఫ్రికా నుండి వచ్చిన నమూనాల్లో ఒమిక్రాన్‌ను గుర్తించారని, ఈ కొత్త వేరియంట్‌లో ముప్పై కంటే ఎక్కువ ఉత్పరివర్తనాలు (మ్యుటేషన్స్) తేలిందని, ఇది కరోనా వేరియంట్‌లలో అత్యధికమని గుర్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న వ్యాక్సీన్ ఆర్మోరీ ఒమిక్రాన్ వ్యాప్తిని నియంత్రించగలదని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. మరింత ప్రభావవంతమైన వ్యాక్సీన్, బూస్టర్ షాట్స్‌ను గుర్తించేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయి.

English summary

అమెరికాలో తీవ్ర ప్రతిష్టంభనకు దారితీస్తున్న ఒమిక్రాన్! | Omicron can lead to stagflation in US

The rapid spread of the new Omicron strain of coronavirus has not just overwhelmed the healthcare infrastructure across the globe, but also made financial markets in the United States anxious about stagflation - that awful combination of rising inflation and declining growth.
Story first published: Monday, November 29, 2021, 12:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X