For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?

|

Home Loan: ఉద్యోగాలు చేసుకునేవారందరికీ ఎక్కువగా ఉండేవీ EMIలు. ఎందుకంటే చాలా మంది హోమ్ లోన్ తీసుకుంటుంటారు కాబట్టి. అయితే తాజాగా కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను రేట్ల విషయంలో కొత్త విధానం కింద రూ.7 లక్షల వరకు ఎలాంటి టాక్స్ కట్టాల్సిన పనిలేదని చెప్పటంతో చాలా మందిలో గందరగోళం నెలకొంది. అయితే ఇప్పుడు హౌసింగ్ లోన్ తీసుకునేవారు ఏ టాక్స్ విధానం పాటిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్త టాక్స్ విధానం..

కొత్త టాక్స్ విధానం..

కేంద్రం తీసుకొచ్చిన న్యూ టాక్స్ రీజిమ్ ప్రకారం ఎవరైనా ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు వారి ఆదాయం రూ.7 లక్షల లోపు ఉన్నట్లయితే ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఆదాయం రూ.7 లక్షల కంటే ఎక్కువ ఉంటే తాజాగా ప్రకటించిన శ్లాబ్ రేట్ల ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. పైగా ఇందులో నష్టం ఏమిటంటే పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి రిబేట్స్ అంటే పన్ను మినహాయింపులు లభించవు. మీరు కొత్త టాక్స్ విధానం కింద హోమ్ లోన్ చెల్లింపులకు ఎలాంటి పన్ను మినహాయింపును పొందలేరన్నమాట.

పాత టాక్స్ విధానం..

పాత టాక్స్ విధానం..

ఎక్కువ ఆదాయం పొందేవారు ఎల్లప్పుడూ మెచ్చేది పాత టాక్స్ విధానాన్నే ఎందుకంటే దీనికింద పలు సెక్షన్ల ప్రకారం పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఉదాహరణకు మీరు హోమ్ లోన్ తీసుకుని పాత టాక్స్ విధానం కింద ఐటీఆర్ ఫైల్ చేసినట్లయితే హౌసింగ్ లోన్ కోసం చెల్లించే వడ్డీలో గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు టాక్స్ చెల్లింపులో తగ్గింపు లభిస్తుంది. దీనికి తోడు లోన్ అసలు చెల్లింపు కింద గరిష్ఠంగా ఏడాదికి రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. ఇలాంటి తగ్గింపులు కొత్త టాక్స్ విధానం అంటే న్యూ టాక్స్ రీజిమ్ లో ఉండవు.

అద్దె ఇంట్లో ఉన్నట్లయితే..

అద్దె ఇంట్లో ఉన్నట్లయితే..

ప్రస్తుతం మీరు అద్దె ఇంట్లో ఉంటున్నట్లయితే కొత్త టాక్స్ విధానం కింద అద్దె చెల్లింపును టాక్స్ మినహాయింపులో పొందటానికి వీలు ఉండదు. అదే పాత టాక్స్ విధానంలో ఐటీఆర్ ఫైల్ చేస్తున్నట్లయితే HRAను మినహాయింపుగా పొందవచ్చు. అయితే దేశంలోని వివిధ ప్రాంతాలకు ఈ విషయంలో కొన్ని షరతులు ఉన్నాయి. వాటి ప్రకారం తగ్గింపు లభిస్తుంది. అలాగే మనం హోమ్ లోన్ తీసుకుని నిర్మించిన నివాసాన్ని అద్దెకు ఇచ్చినప్పుడు కూడా పాత టాక్స్ విధానం కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. హోమ్ లోన్ పై చెల్లిస్తున్న వడ్డీని రెంటల్ ఆదాయం నుంచి మినహాయించటానికి పాత టాక్స్ విధానం కింద వెసులుబాటు ఉంటుంది.

తెలివైన నిర్ణయం..

తెలివైన నిర్ణయం..

రూ.7 లక్షల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే వారికి కొత్తా టాక్స్ రీజిమ్ కింద పెద్దగా ఒరిగేది ఏమీ లేదని టాక్స్ అండ్ అకౌంటింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీర్ఘకాలంలో ప్రయోజనాలను దృష్టిలోకి తీసుకుంటే పాత టాక్స్ చెల్లింపు విధానం ఉపయోగకరమైనదని, అదే తెలివైన ఎంపిక అని వారు అంటున్నారు. మినహాయింపులు కావాలంటే పాత టాక్స్ విధానం సరైనదిగా చెప్పుకోవచ్చు. ఇలాంటి కీలక విషయాలను పరిగణలోకి తీసుకుని అవసరాలకు అనుగుణంగా.. పన్ను చెల్లింపుదారులు తెలివైన నిర్ణయం తీసుకోవటం మంచిది.

English summary

Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..? | Old Tax regime or New tax Regime which one better for Home Loan Tkers Know in detail

Old Tax regime or New tax Regime which one better for Home Loan Tkers Know in detail
Story first published: Sunday, February 5, 2023, 12:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X