For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Covid 19: మళ్లీ పడిపోతున్న చమురు ధరలు, సౌదీ కీలక నిర్ణయం

|

కరోనా మహమ్మారి రెండోసారి విజృంభించే అవకాశాలు ఉన్నాయనే భయాల నేపథ్యంలో చమురు ధరలు మళ్లీ పడిపోతున్నాయి. గత నెలలో ఆయిల్ ధరలు ఏకంగా జీరో కంటే తక్కువ స్థాయికి పడిపోయాయి. ఆ తర్వాత క్రమంగా కోలుకుంటున్నాయి. అయితే వివిధ దేశాల్లో రెండోసారి విజృంభించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ ప్రభావం చమురు ధరలపై పడుతోంది.

ఆర్థిక ఆత్మహత్యే, జీవితాలకు అదే రోగనిరోధక వ్యవస్థ: లాక్‌డౌన్ పొడిగింపుపై ఆనంద్ మహీంద్రాఆర్థిక ఆత్మహత్యే, జీవితాలకు అదే రోగనిరోధక వ్యవస్థ: లాక్‌డౌన్ పొడిగింపుపై ఆనంద్ మహీంద్రా

మళ్లీ క్రూడాయిల్ ధరల తగ్గుదల

మళ్లీ క్రూడాయిల్ ధరల తగ్గుదల

బ్రెంట్ క్రూడాయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 3.1 శాతం లేదా 96 సెంట్లు పడిపోయి 30.01 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 21 సెంట్లు లేదా 0.9 శాతం తగ్గి 24.53 పలికింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో షట్ డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురుకు డిమాండ్ భారీగా పడిపోయింది. ఇటీవల క్రమంగా షట్ డౌన్ ఆంక్షలు ఎత్తివేస్తున్న తరుణంలోను 30 శాతం డిమాండ్ తగ్గింది.

భయాలు..

భయాలు..

ముడి చమురు ధరలు ఈ ఏడాది 55 శాతానికి పైగా పడిపోయాయి. ప్రయాణాలు, రవాణా స్తంభించడంతో డిమాండ్ పడిపోయి, ధరలు తగ్గాయి. కోలుకుంటున్న సమయంలో రెండోసారి కరోనా విజృంభించవచ్చునని భయాలు అలుముకున్నాయి. లాక్ డౌన్ ఆంక్షలు క్రమంగా ఎత్తివేస్తుండటంతో సోమవారం జర్మనీలో కరోనా కేసులు పెరిగినట్లు తేలింది.అలాగే చైనాలోని వూహాన్‌లోను ఇదే పరిస్థితి. రెండోసారి విజృంభించే అవకాశముందని సౌత్ కొరియా ఆందోళన వ్యక్తం చేసింది.

ఉత్పత్తి తగ్గించాలని సౌదీ

ఉత్పత్తి తగ్గించాలని సౌదీ

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జూన్ నెలలో ఉత్పత్తిని మరో 1 మిలియన్ బీపీడీ తగ్గించాలని సౌదీ ఎనర్జీ మినీస్ట్రీ అధికారులు సూచించారు. ఇప్పటికే ఓపెక్ దేశాల ఒప్పందం మేరకు మే 1వ తేదీ నుండి 10 మిలియన్ బీపీడీ తగ్గిస్తున్నారు. కరోనా రెండోసారి విజృంభనకు చమురు ఉత్పత్తి కోతకు లింక్ ఉంటుందని చెబుతున్నారు. కరోనా, చమురు ఉత్పత్తి మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. అంతేకాదు, డిమాండ్ లేకపోవడంతో అమెరికా సహా పలు దేశాల్లో చమురు స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతోన్న విషయం తెలిసిందే.

English summary

Covid 19: మళ్లీ పడిపోతున్న చమురు ధరలు, సౌదీ కీలక నిర్ణయం | Oil falls on fears of second Covid 19 wave

Oil prices fell on Monday as investors worried about a second wave of coronavirus infections, but new output cuts from Saudi Arabia tempered worries about oversupply and limited price losses.
Story first published: Wednesday, May 13, 2020, 11:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X