For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆఫీస్ స్పేస్ రెంటల్ డౌన్, 1 శాతం నుండి 8 శాతం తగ్గుదల

|

ఈ ఏడాది ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ కనిపించడం లేదు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో బెంగళూరు, ముంబై, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఆఫీసులకు వినియోగించే భవనాల్లో రెంట్స్ పడిపోయాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే బెంగళూరులో అత్యధికంగా 8 శాతం, ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో అత్యల్పంగా 1 శాతం రెంటల్స్ తగ్గాయి. ముంబైలో ఆఫీస్ స్పేస్ రెంటల్స్ ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 6.2 శాతం తగ్గినట్టు నైట్ ఫ్రాంక్ వెల్లడించింది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో కొంత అనిశ్చితి నెలకొన్నప్పటికీ పన్నెండు నెలల్లో ఈ మూడు ప్రధాన నగరాల్లో ఆఫీస్ రెంటల్స్ స్థిరంగా ఉండే అవకాశముందని అంచనా వేసింది. సెకండ్ వేవ్ కారణంగా అమలవుతున్న స్థానిక లాక్ డౌన్‌లతో ఇప్పటికే ఆఫీస్ స్పేస్ తీసుకున్న సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించలేకపోతున్నాయని తెలిపింది. కాగా ఆఫీస్ స్పేస్ రెంటల్ పరిస్థితి మరో సంవత్సరం పాటు ఇలాగే ఉండవచ్చునని అంచనా.

 Office space rentals likely to stay stable for 12 months

అయితే ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌కు ఢోకా లేదని సీబీఆర్ఈ తెలిపింది. ఇప్పటికే పలు కంపెనీలు ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ కోసం 3.6 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాలను లీజు లేదా రెంటుకు తీసుకున్నాయి.

English summary

ఆఫీస్ స్పేస్ రెంటల్ డౌన్, 1 శాతం నుండి 8 శాతం తగ్గుదల | Office space rentals likely to stay stable for 12 months

Rentals in India’s prime office markets — Bengaluru, NCR and Mumbai markets are expected to remain stable over the next 12-months.
Story first published: Friday, May 14, 2021, 20:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X