కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా చిన్నస్థాయి నుండి పెద్ద కంపెనీల వరకు కార్యాలయాలను ఖాళీ చేయడమో లేదా తగ్గించడమో చేశాయి. దీంతో ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్ భారీగా పడిపోయింది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో వాణిజ్య స్థలాలకు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 50 శాతం మేర క్షీణించినట్లు జేఎల్ఎల్ నివేదిక తెలిపింది. జనవరి నుండి సెప్టెంబర్ వరకు చూస్తే 47 శాతం పడిపోయింది. ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, పుణే, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఆఫీస్ స్పేస్ గిరాకీ పడిపోయింది.

సగానికి తగ్గిన ఆఫీస్ స్పేస్ లీజింగ్
సెప్టెంబర్ క్వార్టర్‌లో నెట్ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 5.4 మిలియన్ స్క్వేర్ ఫీట్స్‌కు పరిమితమైంది. అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 50 శాతానికి తగ్గింది. జనవరి-సెప్టెంబర్ 2020 ఆఫీస్ స్పేస్ లీజింగ్ 17.3 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది. ఏడు ప్రధాన నగరాల్లో 2019లో ఇదే కాలంలో 32.7 మిలియన్ చదరపు అడుగులతో పోలిస్తే 47 శాతం క్షీణించింది. కరోనా నేపథ్యంలో కార్పోరేట్స్, కో-వర్కింగ్ కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలు వాయిదా వేయడంతో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ఆఫీస్ స్పేస్ లీజ్ తగ్గడానికి కారణం. అయితే జూన్ క్వార్టర్‌తో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 64 శాతం వృద్ధిని నమోదు చేసింది.

హైదరాబాద్ సహా ఏ నగరంలో ఎంత అంటే
జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో బెంగళూరు నెట్ ఆఫీస్ లీజింగ్ 2.72 మిలియన్ చదరపు అడుగులతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత హైదరాబాద్ 1.54 మిలియన్ చదరపు అడుగులతో రెండో స్థానంలో ఉంది. పుణే 0.46 మిలియన్ చదరపు అడుగులు, ముంబై 0.28 మిలియన్ చదరపు అడుగులు, చెన్నై 0.21 మిలియన్ చదరపు అడుగులు, ఢిల్లీ-ఎన్సీఆర్ 0.2 మిలియన్ చదరపు అడుగులు, కోల్‌కతా 0.02 మిలియన్ చదరపు అడుగులతో ఉన్నాయి. రెండో క్వార్టర్‌తో పోలిస్తే మూడో క్వార్టర్‌లో కార్యాలయాల అద్దెలు బెంగళూరులో స్వల్పంగా పెరగగా, మిగిలిన ఆరు నగరాల్లో స్థిరంగా ఉన్నట్లు జేఎల్ఎల్ తెలిపింది.

ఆఫీస్ స్పేస్ వెకెన్సీ
ఆఫీస్ ఖాళీ స్పేస్ రెండో జూన్ క్వార్టర్‌తో పోలిస్తే సెప్టెంబర్ క్వార్టర్‌లో పెరిగింది. ఏప్రిల్-జూన్ మధ్య మొత్తం వేకన్సీ 13.1శాతం కాగా, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 13.5 శాతానికి పెరిగింది. 2019 క్యాలెండర్ ఏడాదిలో 47 మిలియన్ చదరపు అడుగులతో ఆఫీస్ స్పేస్ డిమాండ్ రికార్డ్ స్థాయిలో ఉంది. ఇప్పుడు కరోనా ఆఫీస్ డిమాండ్ పైన ప్రభావం చూపుతోంది.
More From GoodReturns

Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు! అలాంటి ఇళ్లకే ఫుల్ డిమాండ్!

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications