For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ ఆర్థిక రికవరీపై ఒమిక్రాన్ ప్రభావం, వ్యాక్సినేషన్ పూర్తయితేనే..

|

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ఆర్థిక రికవరిపై కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్ర ప్రభావం చూపుతోందని ప్యారిస్‌కు చెందిన ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(OECD) హెచ్చరించింది. 2021 క్యాలెండర్ ఏడాదిలో ప్రపంచ ఆర్థిక రికవరీ మందగిస్తుందని, దీంతో వృద్ధి రేటు అంచనాలు తగ్గుతున్నట్లు వెల్లడించింది.

కరోనాను ఎదుర్కోవడానికి కోవిడ్ వ్యాక్సీన్‌ను మరింత వేగంవంతం చేయాలని అభిప్రాయపడింది. ఒమిక్రాన్‌కు ముందు ఆర్థిక రికవరీ వేగవంతంగా కనిపించిందని, ఈ రికవరీ దూకుడుకు ఒమిక్రాన్ అడ్డుపడిందని తెలిపారు. దీంతో అమెరికా, చైనా, యూరోజోన్ వంటి టాప్ ఆర్థిక వ్యవస్థల జీడీపీ వృద్ధి రేటు తగ్గుతుందని పేర్కొంది.

జీడీపీ వృద్ధి మందగమనం

జీడీపీ వృద్ధి మందగమనం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ క్యాలెండర్ ఏడాదిలో 5.7 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని గతంలో అంచనా వేయగా, ఒమిక్రాన్ కారణంగా ఇది 5.6 శాతానికి సవరిస్తున్నట్లు ఓఈసీడీ తెలిపింది. వైరస్ మ్యుటేషన్స్ ఉన్నాయని, దీనికి తోడు పలుప్రాంతాల్లో వ్యాక్సినేషన్ తక్కువగా ఉందని పేర్కొంది. 2022 క్యాలెండర్ ఏడాదిలో జీడీపీ వృద్ధి రేటు 4.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళనకరంగా ఉందని, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అధిక రిస్క్, అనిశ్చితి నెలకొందని, ప్రస్తుత ఒమిక్రాన్ రికవరీకి మరింత దెబ్బ అని ఓఈసీడీ చీఫ్ ఎకనమిస్ట్ లారెన్స్ బూనే అన్నారు.

అప్పటి వరకు రికవరీ అనిశ్చితి

అప్పటి వరకు రికవరీ అనిశ్చితి

రికవరీ హెచ్చరికతో కూడిన ఆశావాదంగా కనిపించినప్పటికీ, ఆరోగ్యం, అధిక ద్రవ్యోల్భణం, సరఫరా గొలుసుకు అడ్డంకులు కీలక ఆందోళనలు అని హెచ్చరించింది. బూస్టర్ డోస్‌లతో సహా ప్రపంచవ్యాప్తంగా వీలైనంత త్వరగా వ్యాక్సీన్‌లు ఉత్పత్తి చేయబడేలా, అమలు చేయబడేలా చూడటం మొదటి ప్రాధాన్యత అని ఓఈసీడీ తెలిపింది. వ్యాక్సీనేషన్ పూర్తయ్యే వరకు అన్ని దేశాల్లో రికవరీ అనిశ్చితితో ఉంటుందని తెలిపింది.

వ్యాక్సినేషన్

వ్యాక్సినేషన్

20 అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు కరోనా మహమ్మారి సమయంలో 10 ట్రిలియన్ డాలర్లను ఖర్చు చేశాయని, ఇందులో ప్రపంచ వ్యాప్త వ్యాక్సినేషన్ ఖర్చు 50 బిలియన్ డాలర్లుగా ఉంటుందని లారెన్స్ బూనె తెలిపారు. వ్యాక్సినేషన్ పూర్తయిందని ఎవరైనా అనుకుంటే అది పెద్ద తప్పు అవుతుందన్నారు.

ఇదిలా ఉండగా, ఒమిక్రాన్ ప్రభావం ప్రపంచ వృద్ధి పైన 0.25 శాతం పాయింట్ల మేర పడుతుందని ఆక్స్‌ఫర్డ్ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు.

English summary

ప్రపంచ ఆర్థిక రికవరీపై ఒమిక్రాన్ ప్రభావం, వ్యాక్సినేషన్ పూర్తయితేనే.. | OECD warns Omicron threatens world economy

The OECD warned Wednesday that the Omicron coronavirus variant threatens the global economic recovery as it lowered the growth forecast for 2021 and appealed for a swifter rollout of Covid vaccines.
Story first published: Thursday, December 2, 2021, 15:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X