For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IT Jobs: ఐటీ ఉద్యోగులకు జాక్‌పాట్.. ఈ కంపెనీలో 7 ఏళ్లలో మేనేజర్‌ అవుతారు.. ఫ్రెషర్లకు..

|

IT Jobs: ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరే చాలా మందికి సహజంగా ఉండే అనుమానం ఇది. ఫ్రెషర్ గా ఉద్యోగంలో చేరి అదే కంపెనీలో మేనేజర్ స్థాయికి ఎదగటానికి ఎంత సమయం పడుతుంది..? అసలు అది సాధ్యమేనా..? అసలు అలా జరగనిస్తారా.. వంటి అనేక డౌట్స్ వస్తుంటాయి. ఇప్పుడు వీటన్నింటికీ బదులిచ్చే ప్రకటన ఒకటి వెలువటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఐటీ దిగ్గజం సంచలన ప్రకటన..

ఐటీ దిగ్గజం సంచలన ప్రకటన..

ప్రస్తుతం దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీగా ఆవిర్బవించిన ఇన్ఫోసిస్ చాలా ముఖ్యమైన ప్రకటన చేసింది. ప్రస్తుతం ఇది ఉద్యోగులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఉద్యోగులు కంపెనీని వీడుతున్న సమయంలో ఇలాంటి ప్రకటన ఎవ్వరూ ఊహించనిదనే చెప్పుకోవాలి. ఇన్ఫోసిస్ 28.4 శాతం అట్రిషన్ రేటును కలిగి ఉంది.

ఉద్యోగులకు ప్రమోషన్స్..

ఉద్యోగులకు ప్రమోషన్స్..

ఇన్ఫోసిస్‌లో 5 సంవత్సరాల క్రితం 8,000-10,000 మంది ఉద్యోగులకు వేతన పెంపు ఇవ్వగా, 2021-22 వరకు కాలంలో 40,000 మంది ఉద్యోగులకు పదోన్నతులు లభించాయి. ప్రస్తుత సంవత్సరంలో ఈ సంఖ్య పెరుగుతుందని ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ గ్రూప్ హెచ్‌ఆర్ హెడ్ క్రిష్ శంకర్ తెలిపారు. ఉద్యోగి అనుభవం, అవకాశాలను మెరుగుపరచడం వారికి మెరుగైన అనుభవాన్ని అందించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది.

మేనేజర్ పోస్ట్..

మేనేజర్ పోస్ట్..

ఇన్ఫోసిస్‌లో ఫ్రెషర్‌గా చేరిన వ్యక్తి మంచి పనితీరును కొనసాగిస్తే, మేనేజర్ పదవిని చేరుకోవటానికి తక్కువ సమయం పడుతుంది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ కంపెనీలో మేనేజర్ కావడానికి 12-13 ఏళ్లు పడుతుంది. అయితే ప్రస్తుత మార్పులతో 9 ఏళ్లలో మేనేజర్ కావచ్చు. అయితే కంపెనీ ఈ కాలాన్ని సగానికి తగ్గించేందుకు కొత్త పద్ధతిని అవలంభిస్తోంది.

7 ఏళ్లలో మేనేజర్..

7 ఏళ్లలో మేనేజర్..

అయితే ఇన్ఫోసిస్ ఇప్పుడు ప్లాటినమ్ క్లబ్ అని ఒకదానిని సృష్టించింది. ఈ క్లబ్ టాప్ పెర్ఫార్మర్స్ కోసం. ఈ క్లబ్‌లోని వ్యక్తులు కేవలం 7 ఏళ్లలో జాగ్రత్తగా, ప్రభావవంతంగా, ఇచ్చిన పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా ప్రెజర్ మేనేజర్‌గా మారగలరని క్రిష్ శంకర్ వెల్లడించారు. అలాగే మొత్తం ఉద్యోగుల్లో ప్రస్తుతం 1-2 శాతం మంది మాత్రమే ఈ ప్లాటినం క్లబ్‌లో ఉన్నారని క్రిష్ శంకర్ తెలిపారు. వీరు మేనేజర్ కావాలంటే 12-13 వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.

స్కిల్ ట్యాగ్..

స్కిల్ ట్యాగ్..

అదేవిధంగా శిక్షణ పూర్తి చేసిన ఉద్యోగులకు వారి నైపుణ్యాలను గౌరవించేందుకు స్కిల్ ట్యాగ్ ఇస్తారు. స్కిల్ ట్యాగ్ పొంది 6 నెలల అనుభవం ఉన్న తర్వాత ఉద్యోగులకు డిజిటల్ స్కోర్ ఇవ్వబడుతుంది. ఇదే క్రమంలో ఉద్యోగులు ఇతర సాంకేతిక ఉద్యోగానికి మారేందుకు BIRDGE అనే కొత్త పథకాన్ని సైతం ఇన్ఫోసిస్ తెచ్చింది. అదేవిధంగా దీనికి సరైన స్కిల్ ట్యాగ్, అనుభవం అవసరమని కంపెనీ తెలిపింది.

English summary

IT Jobs: ఐటీ ఉద్యోగులకు జాక్‌పాట్.. ఈ కంపెనీలో 7 ఏళ్లలో మేనేజర్‌ అవుతారు.. ఫ్రెషర్లకు.. | now freshers in it giant infosys can become a manager in just 7 years with platinum club scheme

now freshers in it jaint infosys can become a manager in just 7 years with platinum club scheme
Story first published: Thursday, September 29, 2022, 17:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X