For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకు ఖాతాలకు మతమేంటో చెప్పడం తప్పనిసరి కాదు: రాజీవ్ కుమార్

|

న్యూఢిల్లీ: ఎవరైనా బ్యాంకులో అకౌంట్ తీయడానికి లేదా KYC (Know Your Customer) కోసం తమ మతాన్ని పేర్కొనవలసిన అవసరం లేదని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ శనివారం స్పష్టం చేసింది. భారతీయులు ఎవరు కూడా మతాన్ని పేర్కోవడం తప్పనిసరి కాదు అని తేల్చి చెప్పింది. ఈ విషయమై వదంతులు వస్తున్న తరుణంలో ఈ ప్రచారం నిరాధారమని కొట్టి పారేసింది.

KYC నిబంధనల్లో భాగంగా దేశీయ బ్యాంకులు డిపాజిటర్లను, కస్టమర్లను తమ మతం గురించి అడిగే అవకాశాలున్నాయన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ మేరకు ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ శనివారం స్పష్టతనిచ్చారు. కొత్త, ప్రస్తుత బ్యాంకు ఖాతాల కోసం భారత పౌరులు ఎవరు కూడా తమ మతం గురించి పేర్కొనవలసిన అవసరం లేదని ట్విట్టర్ ద్వారా శనివారం రాత్రి సూచించారు.

Now, banks could ask customers to list their religion

ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని ఎవరూ కూడా విశ్వసించవద్దని రాజీవ్ కుమార్ కోరారు. కాగా, ఇప్పటికే దేశంలో CAA (పౌరసత్వ సవరణ చట్టం)పై ఆందోళనలు చెలరేగుతున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి ఇచ్చే పౌరసత్వంపై దాదాపు ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్, ఇతర లెఫ్ట్ పార్టీలు అడిగిన చట్టాన్ని తాము తీసుకు వచ్చామని బీజేపీ చెబుతోన్న విషయం తెలిసిందే.

English summary

బ్యాంకు ఖాతాలకు మతమేంటో చెప్పడం తప్పనిసరి కాదు: రాజీవ్ కుమార్ | Now, banks could ask customers to list their religion

The finance ministry on Saturday clarified that there will be no requirement for Indian citizens to declare their religion for opening a bank account orfor KYC.
Story first published: Sunday, December 22, 2019, 11:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X