For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా తగ్గిన వాహన విక్రయాలు, కమర్షియల్ వెహికిల్ సేల్స్ జంప్

|

నవంబర్ నెలలో ఆటో సేల్స్ తగ్గాయి. సెమీ కండక్టర్ల కొరత కారణంగా వాహన ఉత్పత్తి తగ్గింది. ఇది అమ్మకాల పైన ప్రభావం చూపింది. అయితే మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, టయోటా సేల్స్ మాత్రం పెరిగాయి. కమర్షియల్ వెహికిల్ సేల్స్ నవంబర్ నెలలో 15 శాతం పెరిగాయి. టాటా మోటార్స్ మాత్రం ఏడాది ప్రాతిపదికన 38 శాతం వృద్ధిని నమోదు చేసింది. మహీంద్రా సేల్స్ గత ఏడాది నవంబర్ నెలతో పోలిస్తే ఏడు శాతం పెరిగాయి. ద్విచక్రవాహనాల విక్రయాల సేల్స్ కూడా తగ్గాయి. టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, హీరో మోటో కార్ప్, హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ విక్రయాలు వరుసగా 29 శాతం, 20 శాతం, 41 శాతం, 35 శాతం క్షీణించాయి.

మారుతీ సుజుకీ సేల్స్

మారుతీ సుజుకీ సేల్స్

భారత అతిపెద్ద కారుమేకర్ మారుతీ సుజుకీ ఇండియా విక్రయాలు నవంబర్ నెలలో 9 శాతం క్షీణించాయి. గత ఏడాది నవంబర్ నెలలో 1,53,223 యూనిట్లు సేల్ కాగా, ఈ నవంబర్ నెలలో 1,39,184 శాతానికి పడిపోయాయి. డొమెస్టిక్ సేల్స్ 18 శాతం క్షీణించి 1,44,219 యూనిట్ల నుండి 1,17,791కు పడిపోయాయి. మినీ సెగ్మెంట్ ఆల్టో, ఎస్-ప్రెస్సో సేల్స్ 21 శాతం, కాంపాక్ట్ సెగ్మెంట్ బాలెనో, సెలారియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, టూర్ ఎస్, వాగన్ఆర్ సేల్స 25 శాతం, సియాజ్ సేల్స్ 1879యూనిట్ల నుండి 1089 యూనిట్లకు తగ్గింది. యూవీ సెగ్మెంట్ సేల్స్ మాత్రం కాస్త పెరిగాయి.

పాసింజర్ వెహికిల్ సేల్స్ జంప్

పాసింజర్ వెహికిల్ సేల్స్ జంప్

మహీంద్రా అండ్ మహీంద్రా నవంబర్ నెలలో 40,102 యూనిట్లను విక్రయించింది. పాసింజర్ వెహికిల్ సేల్స్ ఏడు శాతం పెరిగాయి. కమర్షియల్ వెహికిల్ సేల్స్ మాత్రం 23 శాతం క్షీణించాయి. ఎగుమతులు 90 శాతం పెరిగి 1636 యూనిట్ల నుండి 3101 యూనిట్లకు పెరిగాయి. ఎస్‌యూవీ సేల్స్ 8 శాతం పెరిగాయి.

ఎంజీ మోటార్స్ ఇండియా రిటైల్ సేల్స్ 40 శాతం క్షీణించాయి. సెమీ కండక్టర్స్ కొరత కారణంగా ఈ సేల్స్ పడిపోయాయి.

బజాజ్ ఆటో సేల్స్ 2020 నవంబర్ నెలలో 4,22,240 యూనిట్లు కాగా, పది శాతం క్షీణించి 3,79,276 పడిపోయాయి. గత నెలలో డొమెస్టిక్ సేల్స్ కూడా 1,98,933 యూనిట్ల నుండి 20 శాతం తగ్గి 1,58,755 యూనిట్లకు పడిపోయాయి. టూవీలర్ సేల్స్ ఏడాది ప్రాతిపదికన 3,84,993 నుండి 3,38,473 యూనిట్లకు తగ్గాయి. కమర్షియల్ వెహికిల్ సేల్స్ మాత్రం 37,247 నుండి పది శాతం పెరిగి 40,803 యూనిట్లకు పెరిగాయి.

టీవీఎస్ మోటార్స్ సేల్స్ 15 శాతం క్షీణించి 3,22,709 యూనిట్ల నుండి 2,72,693 యూనిట్లకు తగ్గాయి. డొమెస్టిక్ టూవీలర్ సేల్స్ 2.47 లక్షల నుండి 1.75 లక్షలకు పడిపోయాయి.

హ్యుండాయ్ మోటార్ సేల్స్ 21 శాతం క్షీణించి 59,200 యూనిట్ల నుండి 46,910 యూనిట్లకు పడిపోయాయి.

టాటా మోటార్స్ సేల్స్ జంప్

టాటా మోటార్స్ సేల్స్ జంప్

ఎస్కార్ట్ సేల్స్ 30 శాతం క్షీణించి 7,116 యూనిట్లకు తగ్గాయి. అంతకుముందు ఏడాది ఇదే నంబర్ నెలలో 10,165 యూనిట్లను విక్రయించింది. డొమెస్టిక్ ట్రాక్టర్ సేల్స్ 32 శాతం తగ్గాయి. అయితే ఎగుమతులు మాత్రం 24 శాతానికి పైగా పెరిగాయి.

అశోక్ లేలాండ్ సేల్స్ 4 శాతం క్షీణించి 9,727 యూనిట్ల నుండి 9,364 యూనిట్లకు పెరిగాయి.

ఐచర్ మోటార్ సేల్స్ 10 శాతం క్షీణించి 4,085 యూనిట్లకు తగ్గాయి. కమర్షియల్ వెహికిల్ సేల్స్ మాత్రం పెరిగాయి.

టాటా మోటార్స్ సేల్స్ ఏకంగా 25 శాతం పెరిగి 49,650 యూనిట్ల నుండి 62,192 యూనిట్లకు పెరిగాయి. డొమెస్టిక్ హోల్ సేల్ విక్రయాలు 21 శాతం పెరిగాయి.

English summary

భారీగా తగ్గిన వాహన విక్రయాలు, కమర్షియల్ వెహికిల్ సేల్స్ జంప్ | November 2021 car sales: From Maruti Suzuki, M&M to Tata Motors

As November 2021 concludes, auto sales for the most part are bobbing in the red. While MSIL reported decline in domestic sales last month, its exports are reported at the highest ever. This is no small feat in current times of sales constraints owing to supply chain disruptions.
Story first published: Thursday, December 2, 2021, 8:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X