For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆధార్-పాన్, ఈపీఎఫ్ఓ లింకింగ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు

|

ఆధార్ కార్డుతో పాన్/EPFO అనుసంధాన సదుపాయాల్లో ఎలాంటి అంతరాయం లేదని శనివారం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) పేర్కొంది. అన్ని సేవలు స్థిరంగా ఉన్నట్లు, సక్రమంగా పని చేస్తున్నట్లు స్పష్టం తెలిపింది. ఆధార్‌తో పాన్, ఈపీఎఫ్ఓల అనుసంధానంలో అంతరాయం కలుగుతోందన్న వార్తల నేపథ్యంలో UIDAI పైవిధంగా స్పందించింది.

గతవారం రోజులుగా తమ వ్యవస్థల్లో అవసరమైన భద్రతాపరమైన మెరుగులు జరుగుతున్నాయని, ఆ సమయంలో కొంత మేర సేవల్లో అంతరాయం కలిగిందని తెలిపింది. అది కూడా కొన్ని కేంద్రాల్లో మాత్రమే ఎన్‌రోల్‌మెంట్, మొబైల్ అప్ డేషన్ సర్వీసుల్లో ఇబ్బంది తలెత్తిందని, ఇప్పుడు అన్నీ పని చేస్తున్నయని UIDAI తెలిపింది.

No outages in facility linking Aadhaar with PAN, EPFO

అప్ డేషన్ ప్రారంభమైన గత తొమ్మిది రోజుల్లో 51 లక్షల మంది నమోదు చేసుకున్నారని, సగటున రోజుకు 5.68 లక్షల సేవలు అందుకున్నారని తెలిపింది. కాబట్టి పాన్, ఈపీఎఫ్‌తో ఆధార్ అనుసంధానంలో UIDAI వ్యవస్థలో అంతరాయం కలిగిందన్న వార్తల్లో వాస్తవం లేదని పేర్కొంది. అథెంటికేషన్ ఆధారిత సదుపాయంతో కూడిన ఆధార్-పాన్, ఈపీఎఫ్ఓ లింకేజీకి సంబంధించి ఎలాంటి అవాంతరాలు లేవని UIDAI ప్రకటించింది.

భారతీయులందరికీ 12 అంకెల ఆధార్ కార్డును జారీ చేయాలని UIDAI ఆదేశాలు జారీ చేసింది. గత వారం రోజులుగా దాని వ్యవస్థలో అత్యవసర భద్రతా అప్ గ్రేడ్ జరుగుతోందని తెలిపారు. ఆధార్ అనేది UIDAI జారీ చేసే 12 అంకెల ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. పాన్ నెంబర్ అనేది ఆదాయపు పన్ను శాఖ కేటాయించిన పది అంకెల అల్పాన్యూమరిక్ నెంబర్. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఆధార్, పాన్ లింక్ తప్పనిసరి.

English summary

ఆధార్-పాన్, ఈపీఎఫ్ఓ లింకింగ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు | No outages in facility linking Aadhaar with PAN, EPFO

The UIDAI clarified on Saturday, August 28, that there have been no outages in its Aadhaar linking facility with PAN and EPF, which are authentication-based facilities, and asserted that all its services are stable.
Story first published: Sunday, August 29, 2021, 9:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X