For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.2,000 నోట్ల ప్రింటింగ్ నిలిపివేత, ప్రభుత్వం క్లారిటీ

|

ఢిల్లీ: రూ.2000 నోట్లను నిలిపివేయాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ శనివారం లోకసభకు తెలిపింది. ప్రజల లావాదేవీల డిమాండ్‌ను సులభతరం చేయడానికి ఆర్బీఐని సంప్రదించి ప్రత్యేక విలువ కలిగిన బ్యాంకు నోట్ల ముద్రణను ప్రభుత్వం నిర్ణయిస్తుందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. గత రెండు ఆర్థిక సంవత్సరాలలో రూ.2000 నోట్లను ముద్రించని విషయం తెలిసిందే. అయితే ఈ నోట్ల ముద్రణను నిలిపివేయాలనే నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

ఏటీఎంకు వెళ్తున్నారా.. ఈరోజు నుండి మొబైల్ కచ్చితంగా వెంట తీసుకెళ్లండి!ఏటీఎంకు వెళ్తున్నారా.. ఈరోజు నుండి మొబైల్ కచ్చితంగా వెంట తీసుకెళ్లండి!

నోట్ల ముద్రణ అప్పుడు ఆపేశాం..

నోట్ల ముద్రణ అప్పుడు ఆపేశాం..

2019 మార్చి 31వ తేదీ నాటికి 27,398 లక్షల రూ.2,000 నోట్లు చలామణిలో ఉన్నట్లు తెలిపారు. అయితే 2019 మార్చి 31వ తేదీ నాటికి 32,910 లక్షల నోట్లు చలామణిలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా రూ.2000 నోట్ల ముద్రణ తాత్కాలికంగా నిలిచిపోయిందని చెప్పారు. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం నోట్ ప్రింటింగ్‌ను దశలవారీగా ప్రారంభించినట్లు తెలిపారు. భారతీయ రిజర్వ్ బ్యాంకు నోట్ ముద్రన్ ప్రయివేటు లిమిటెడ్(BRBNMPL)లో నోట్ల ముద్రణ కార్యకలాపాలు 2020 మార్చి 23వ తేదీ నుండి 2020 మే 23వ తేదీ వరకు నిలిపివేయబడిందని తెలిపారు. నోట్ల ముద్రణ తిరిగి మే 4వ తేదీ నుండి ప్రారంభమైందన్నారు.

ప్రింటింగ్ నిలిపివేత

ప్రింటింగ్ నిలిపివేత

కరోనా మహమ్మారి కారణంగా సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SPMCIL) తమ ముద్రణ కార్యక్రమాలపై ప్రభావం చూపిందని తెలిపారు. కరెన్సీ నోట్ ప్రెస్, నాషిక్ అండ్ బ్యాంకు నోట్ ప్రెస్ కరోనా కారణంగా నిలిచిపోయిందన,ి తిరిగి జూన్ నెలలో ప్రారంభమైనట్లు తెలిపారు.

లాక్ డౌన్ సమయంలో సరఫరా

లాక్ డౌన్ సమయంలో సరఫరా

కరోనా లాక్ డౌన్ సమయంలో నోట్ ప్రింటింగ్ ప్రెస్‌లు ఆర్బీఐ కార్యాలయాలు, కరెన్సీ చెక్ పోస్టులకు భారతీయ రైల్వే ట్రెజరీ వ్యాగన్ల ద్వారా నోట్ల స్టాక్ నుండి నిరంతరాయంగా నోట్లను సరఫరా చేసినట్లు తెలిపారు. కాగా, రూ.2వేల నోట్లను క్రమంగా తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వార్తలు వచ్చాయి. దీనిపై లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

English summary

రూ.2,000 నోట్ల ప్రింటింగ్ నిలిపివేత, ప్రభుత్వం క్లారిటీ | No decision to discontinue printing of Rs 2,000 notes

The Finance Ministry on Saturday informed the Lok Sabha that no decision has been taken to discontinue the printing of Rs 2,000 denomination currency notes.
Story first published: Sunday, September 20, 2020, 7:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X