For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

COVID 19: మోడీ ప్రభుత్వం కాస్ట్ కట్టింగ్! ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్

|

కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా నెల రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతోంది. జనజీవనం స్తంభించిపోయింది. దీంతో రైతులు, కూలీలు, వలస కార్మికులు, ఉద్యోగులు ఉపాధి లేదా వేతనం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక వ్యవస్థలు నిలిచిపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదాయం లేకుండా పోయింది. రెవెన్యూ భారీగా పడిపోయింది. కనీసం 5 నుండి 10 శాతం వసూలు అయ్యే పరిస్థితులు కూడా లేవు.

వాలంటరీ అడ్మినిస్ట్రేషన్‌కు ఎయిర్‌లైన్స్, ప్రమాదంలో 16,000 ఉద్యోగాలువాలంటరీ అడ్మినిస్ట్రేషన్‌కు ఎయిర్‌లైన్స్, ప్రమాదంలో 16,000 ఉద్యోగాలు

ఇటీవలి డీఏ పెంపుతో ఖజానాకు భారం

ఇటీవలి డీఏ పెంపుతో ఖజానాకు భారం

కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నేపథ్యంలో రెవెన్యూ భారీగా తగ్గిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపును నిలిపివేసింది. మార్చి 13వ తేదీన కేంద్రం ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (DA)ను 4 శాతం నుండి 12 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీని వల్ల 2020-21ఆర్థిక సంవత్సరంలో ఖజానాకు 14,510 భారం పడుతోంది.

ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్

ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్

కరోనా కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన పన్ను రాబడి తగ్గింది. దీంతో డీఏ అమలును ఆలస్యం చేయాలని కేంద్రం నిర్ణయించిందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రానికి ఇది తప్పదు. అదే సమయంలో 1.13 కోట్ల మంది ఉద్యోగులకు, పెన్షనర్లకు బ్యాడ్ న్యూస్.

జూలై 2021 వరకు నిలిపివేత

జూలై 2021 వరకు నిలిపివేత

కేంద్ర కేబినెట్ నిర్ణయం మేరకు 2020 జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. ఏఫ్రిల్ వేతనం సవరించిన డీఏ ప్రకారం రావాలి. జనవరి నుండి మార్చి వరకు బకాయిలు కూడా చెల్లించాల్సి ఉంది. డీఏ పెంపును వాయిదా వేసింది. జూలై 2021 వరకు పెంచిన డీఏను నిలిపివేసింది. 2020 జనవరి 1 నుండి 2021 జూన్ 30వ తేదీ వరకు డీఏ బకాయిల చెల్లింపు ఉండదని పేర్కొంది.

నోటిఫై కాలేదు

నోటిఫై కాలేదు

మార్చి 13వ తేదీన ఆమోదముద్రపడిన డీఏ పెంపును ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేయలేదు. సాధారణంగా దీనిని ఎప్పుడో చేయాలి. కానీ ఆ వెంటనే కరోనా కారణంగా మార్చి 24వ తేదీ నుండి లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో పన్నులు తగ్గి, నిధుల కొరత ఏర్పడింది. ఇందులో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా కాస్ట్ కట్టింగ్ చర్యలకు దిగింది.

ఆదాయం లేకపోవడంతో..

ఆదాయం లేకపోవడంతో..

ఆదాయం లేకపోవడంతో కేంద్రం అన్ని శాఖలకు కేటాయించిన బడ్జెట్‌లో 40 శాతం కోత విధించింది. ఇప్పుడు ఉద్యోగుల డీఏ వేతన పెంపును వాయిదా వేసింది. పెరిగిన డీఏ ఏప్రిల్ నుండి అమలవుతుందని ఎదురు చూసిన ఉద్యోగులకు నిరాశ మిగిలింది.

English summary

COVID 19: మోడీ ప్రభుత్వం కాస్ట్ కట్టింగ్! ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ | No DA hike for central government employees for one year

The government said it will not pay the hike in dearness allowance to employees and pensioners that was due from January 1, 2020, and the rates will remain the same till July next year.
Story first published: Thursday, April 23, 2020, 14:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X