For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చందా కొచ్చర్ పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోం .. సుప్రీం కోర్టుకు తెలిపిన ఈడీ

|

మనీలాండరింగ్ కేసులో ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ ఎస్.కె కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈరోజు వాదన వినిపించిన ఈడి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఐసిఐసిఐ బ్యాంక్-వీడియోకాన్ గ్రూప్ లోన్ కేసులో నమోదైన ఈసిఐఆర్‌ను అనుసరించడానికి ఈడీ ఎటువంటి బలవంతపు చర్య తీసుకోదని తెలియజేశారు.

చందా కొచ్చర్ కు మరో ఎదురు దెబ్బ .. దీపక్ కొచ్చర్ విజ్ఞప్తికి నో అన్న కోర్టుచందా కొచ్చర్ కు మరో ఎదురు దెబ్బ .. దీపక్ కొచ్చర్ విజ్ఞప్తికి నో అన్న కోర్టు

చందా కొచ్చర్ మరో రెండు పిటీషన్లు తరువాత విచారిస్తామన్న ధర్మాసనం

చందా కొచ్చర్ మరో రెండు పిటీషన్లు తరువాత విచారిస్తామన్న ధర్మాసనం

ఈ కేసులో తన భర్త దీపక్ కొచ్చర్ అరెస్టును సవాలు చేస్తూ చందా కొచ్చర్ దాఖలు చేసిన పిటీషన్ తో పాటు చందా కొచ్చర్ బెయిల్ పిటిషన్లను తరువాత విచారించనున్నట్లు జస్టిస్ దినేష్ మహేశ్వరి, హృషికేశ్ రాయ్ లతో కూడిన ధర్మాసనం తెలిపింది.మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇటీవల చందా కొచ్చర్ , దీపక్ కొచ్చర్ మరియు వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌పై చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే వారిపై ఈడీ ఆరోపణలను వారు ఖండించారు . మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద చార్జిషీట్ లేదా ప్రాసిక్యూషన్ ఫిర్యాదును ముంబైలోని ప్రత్యేక కోర్టు ముందు దాఖలు చేసినట్లు తెలిపారు.

పోస్ట్ కోవిడ్ ట్రీట్మెంట్ కోసం బెయిల్ కోసం అభ్యర్థించిన దీపక్ కొచ్చర్

పోస్ట్ కోవిడ్ ట్రీట్మెంట్ కోసం బెయిల్ కోసం అభ్యర్థించిన దీపక్ కొచ్చర్

చందా కొచ్చర్ , దీపక్ కొచ్చర్ , ధూత్ మరియు ఇతరులపై సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పరిశీలించిన తరువాత మనీలాండరింగ్ కేసులో క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దీపక్ కొచ్చర్ ను సెప్టెంబర్ లో అరెస్ట్ చేసింది. ఆ తరువాత దీపక్ కొచ్చర్ కరోనా బారినపడటం, ఆస్పత్రిలో చికిత్స పొందిన తరువాత తిరిగి కస్టడీకి తీసుకోవడం జరిగింది. అయితే పోస్ట్ కోవిడ్ ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లడానికి అనుమతించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసిన దీపక్ కొచ్చర్ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. నవీ ముంబైలోని తలోజా జైలులో ప్రస్తుతం దీపక్ కొచ్చర్ ఉన్నారు.

దీపక్ కొచ్చర్ బెయిల్ పిటిషన్‌ను నవంబర్ 23 న ట్రయల్ కోర్టులో విచారణ

దీపక్ కొచ్చర్ బెయిల్ పిటిషన్‌ను నవంబర్ 23 న ట్రయల్ కోర్టులో విచారణ

మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న చందా కొచ్చర్ తన అరెస్టు చేసిన భర్త దీపక్ కొచ్చర్‌ను బెయిల్‌పై విడుదల చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. తన భర్త అరెస్టు చట్టవిరుద్ధమని చందా కొచ్చర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ బెయిల్ పిటిషన్‌ను నవంబర్ 23 న ట్రయల్ కోర్టులో విచారించనున్నామని పేర్కొంది .సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఆమె బెయిల్ పిటిషన్ ట్రయల్ కోర్టులో సోమవారం జాబితా చేయబడిన దీపక్ బెయిల్ పిటిషన్‌ను ప్రభావితం చేస్తుందని చందా కొచ్చర్ తరఫున హాజరైన మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి అన్నారు.

చందా కొచ్చర్ బెయిల్ పిటీషన్ నవంబర్ 27 న విచారణ

చందా కొచ్చర్ బెయిల్ పిటీషన్ నవంబర్ 27 న విచారణ

సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న బెయిల్ పిటిషన్ ట్రయల్ కోర్టు విచారణపై ఎలాంటి ప్రభావం చూపదని అత్యున్నత న్యాయస్థానం ఈ రోజు పేర్కొంది. ఇక ఆమె పిటిషన్‌ను నవంబర్ 27 న తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది దీపక్ కొచ్చర్ బెయిల్ పిటీషన్ నవంబర్ 23 న విచారిస్తామని పేర్కొంది. వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు 1,875 కోట్ల రూపాయల రుణాలను అక్రమంగా మంజూరు చేసినందుకు చందా కొచ్చర్ , దీపక్ కొచ్చర్ మరియు వారి వ్యాపార సంస్థలపై మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో కేసులు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో ఐసిఐసిఐ బ్యాంకు చందా కొచ్చర్ ను సీఈవో పదవి నుండి తొలగించింది.

English summary

చందా కొచ్చర్ పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోం .. సుప్రీం కోర్టుకు తెలిపిన ఈడీ | no coercive action against former ICICI Bank CEO Chanda Kochhar ED To SC

No coercive action will be taken against former ICICI Bank CEO Chanda Kochhar, who is facing charges for alleged money laundering, the Enforcement Directorate told the Supreme Court today. The investigators' assurance came after Ms Kochhar filed a petition to free her arrested husband Deepak Kochhar, who is also facing money-laundering charges, on bail.
Story first published: Friday, November 20, 2020, 17:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X