For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెస్లాపై నితిన్ గడ్కరీ కీలక ప్రకటన, 30% నిబంధనతోనే ఆలస్యమని ఎలాన్ మస్క్!

|

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలు టెస్లా ఇంక్ భారత్‌లోకి వస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ధృవీకరించారు. సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ.. 2021 ప్రారంభంలో టెస్లా మనదేశంలో కార్ల అమ్మకాలను ప్రారంభించబోతోందని, కొనుగోలుదారుల నుంచి వచ్చే స్పందనను బట్టి దేశీయంగా మాన్యుఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్ ప్లాంట్స్‌ను ఏర్పాటు చేసే వియాన్ని టెస్లా పరిశీలిస్తుందని తెలిపారు. టెస్లా మోడల్ 3 కార్లను 2021 జూన్ నెలలో భారత్‌లో లాంచ్ చేయనుందని, ఇందుకోసం ఈ మోడల్ బుకింగ్ వచ్చే నెల (జనవరి) నుండి ప్రారంభిస్తున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గడ్కరీ టెస్లాపై స్పందించారు.

డీలర్ లేకుండా... టెస్లా మోడల్ 3 కారు బుకింగ్స్ జనవరి నుండే, జూన్‌లో ఫస్ట్ కారుడీలర్ లేకుండా... టెస్లా మోడల్ 3 కారు బుకింగ్స్ జనవరి నుండే, జూన్‌లో ఫస్ట్ కారు

గడ్కరీ ఏమన్నారంటే '

గడ్కరీ ఏమన్నారంటే '

'టెస్లా కంపెనీ వ్చే ఏడాది ఇండియాలో తన కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. మొదట సేల్స్ ద్వారా ఆపరేషన్స్ ప్రారంభిస్తుంది. డిమాండ్‌కు అనుగుణంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది' అని గడ్కరీ అన్నారు.

చైనాలో అసెంబ్లింగ్

చైనాలో అసెంబ్లింగ్

భారత్‌లోకి టెస్లా 2021లో వస్తోందని ఆ కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ అన్నారు. కానీ భారత్‌లో టెస్లా కార్ల తయారీకి ఉపయోగించే సామగ్రిలో కనీసం 30% స్థానిక సామగ్రి ఉండాలనే నిబంధనతో తమ ప్రణాళికలు ఆలస్యమవుతున్నట్లు వెల్లడించారు. ఎంతో కాలం నుంచి భారత్‌కు దూరంగా ఉన్న టెస్లా చైనాలోని షాంఘైలో ఓ ప్లాంట్‌ను నడుపుతోంది. ప్రస్తుతం ఆ ప్లాంట్‌లో మోడల్ 3 కార్లను టెస్లా అసెంబ్లింగ్ చేస్తోంది. ఇకపై ఆ ప్లాంట్‌ను మోడల్-వై కార్ల అసెంబ్లింగ్‌కు ఉపయోగించాలని భావిస్తోంది.

మార్కెట్ వ్యాల్యూ ఎంతంటే

మార్కెట్ వ్యాల్యూ ఎంతంటే

ప్రస్తుతం టెస్లా దాదాపు 659 బిలియన్‌ డాలర్ల (రూ. 48,45,702 కోట్ల) మార్కెట్ వ్యాల్యూతో ప్రపంచంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీగా ఉంది. జపాన్ ఆటోమొబైల్ టయోటా మార్కెట్ వ్యాల్యూ రూ.15,80,920 కోట్ల కంటే మూడు రెట్ల కంటే ఎక్కువ. కరోనా సంక్షోభ సమయంలో కూడా టెస్లా రాణించింది. గత క్వార్టర్‌లో ఆ సంస్థ 8.77 బిలియన్ డాలర్ల (రూ.64,486 కోట్ల) ఆదాయాన్ని ఆర్జించింది. ఇటీవల ఎస్ అండ్ పీ 500 సూచీలో చోటు దక్కించుకుంది.

English summary

టెస్లాపై నితిన్ గడ్కరీ కీలక ప్రకటన, 30% నిబంధనతోనే ఆలస్యమని ఎలాన్ మస్క్! | Nitin Gadkari confirms Tesla coming to India in early 2021

Union Minister for Road Transport and Highways and the Minister of Micro, Small and Medium Enterprises Nitin Gadkari on Monday told The Indian Express Idea Exchange programme that US clean energy and electric vehicle company Tesla will “start operations” in India in early 2021.
Story first published: Tuesday, December 29, 2020, 7:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X