Nirmala Sitharaman: సామాన్య కస్టమర్ గా మారిన ఆర్థిక మంత్రి.. కూరగాయలు కొంటూ.. ఎందుకిలా..?
Nirmala Sitharaman: చాలా మంది తాజాగా ఉండే కూరగాయలు కొంత తక్కువ ధరలకు లభిస్తాయని రద్దీగా ఉంటాయని తెలిసినప్పటికీ మండీలు, మార్కెట్లకు వెళుతుంటారు. అలా అక్కడికి సెలబ్రిటీలు లేదా ప్రముఖ రాజకీయ నాయకులు రావటం చాలా అరుదు. అందులోనూ ఆర్థిక మంత్రి వెళ్లటం అంటే చిన్న విషయం కాదు. వారికి ఉండే పని ఒత్తిడి, సమయం చాలా తక్కువ కాబట్టి. కానీ ఎలక్షన్ల టైంలో ఇలాంటివి కనిపిస్తుంటాయి.
|
కూరగాయలు కొంటూ..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం చెన్నైలోని స్థానిక మార్కెట్‌ను సందర్శించారు. రోజంతా బిజీబిజీగా ఉండే ఆమె కూరగాయలను కొనుగోలు చేయడానికి సమయం కేటాయించారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. పైగా దేశంలోని అన్ని మీడియా సంస్థలు దీనిపై ఫోకస్ చేశాయి. ఈ మధ్య కాలంలో నిర్మలా సీతారామన్ ఇలాంటి సడన్ సప్రైజ్ లు ఇస్తున్నారు.

బేరాలాడారు..
రోజంతా చెన్నై పర్యటనలో ఉన్న నిర్మలమ్మ మైలాపూర్ మార్కెట్‌లో ఆగి.. విక్రేతలు, స్థానిక నివాసితులతో సంభాషించారు. వంటగదికి అవసరమైన కొన్ని వస్తువులను స్వయంగా ఎంచుకుని మరీ కొనుగోలు చేశారు. ఇదంతా చూసినవారు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.ఈ వీడియోను ఆర్థిక మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.

తమిళనాడులో..
తమిళనాడులోని కల్లికుప్పం, అంబత్తూరు, చెన్నైలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం మల్టీ డిసిప్లినరీ సెంటర్ అయిన 'ఆనంద కరుణ విద్యాలయం'ను ఈ పర్యటనలో ఆర్థిక మంత్రి ప్రారంభించారు.ఆటిజం, డైస్లెక్సియా, స్లో లెర్నింగ్ డిజేబిలిటీ వంటి నేర్చుకునే ఇబ్బందులు ఉన్న పిల్లల కోసం 2018లో ఆనందమ్ లెర్నింగ్ సెంటర్ ప్రారంభించబడింది.

ప్రజల రియాక్షన్ ఇలా..
ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ ట్వీట్ విషయంలో ప్రజలు భిన్నంగా స్పందిస్తున్నారు. ఎక్కువ మంది సింగిల్ యూజ్ ప్లాట్సిక్ వినియోగం మానేయాలని కోరారు. ప్రభుత్వం చర్యలు అమలు చేయాలని కోరారు. తప్పని పరిస్థితిలో ఆర్థిక మంత్రి కూడా అవే తీసుకోవాల్సొచ్చిందని అంటున్నారు. మరొకరైతే నిర్మలమ్మ ఇంకే వస్తువులపై జీఎస్ట్రీ వేయాలా అని ఆలోచిస్తున్నారని కామెంట్ చేశారు. రోజువారీ జీవితం నుంచి ఇలా ఆమె కొంత బ్రేక్ తీసుకుని తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారని అన్నారు.