For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Union Budget 2023: బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన నిర్మలమ్మ.. ప్రపంచ స్థాయిలో భారత్ భేష్

|

Union Budget 2023: భారత్ ప్రవేశపెడుతున్న బడ్జెట్ అమృత్ కాల్ లో జరుగుతోందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారత ఆర్థిక వ్యవస్థ అత్యుత్తమ పనితీరుతో బ్రైట్ స్టార్ గా నిలిచిందని వెల్లడించారు. కరోనా సమయంలో ఎవ్వరూ ఆకలితో ఉండకుండా చూసేందుకు ఉచిత ఆహార ఉత్పత్తులను ప్రజలకు అందించినట్లు వెల్లడించారు.

డిజిటల్ సేవలను సాధారణ ప్రజల వరకు తీసుకెళ్లేందుకు కోవిన్, ఆధార్ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చి విజయవంతంగా ముందుకు తీసుకెళ్లినట్లు వెల్లడించారు. దేశంలో తలసరి ఆదాయం రూ. 1.97 లక్షలుగా ఉన్నట్లు వెల్లడించారు. పరిపాలన, వ్యాపార వాతావరణం విషయంలో ప్రపంచంలోనే భారత్ అత్యుత్తమ పనితీరు కనబరిచినట్లు. 2022లో డిజిటల్ చెల్లింపుల్లో భాగంగా యూపీఐ చెల్లింపులు రికార్డు స్థాయిలో పెరిగినట్లు నిర్మలమ్మ తెలిపారు.

Nirmala sitharaman over india as bright star in global econmy in union budget 2023

టెక్నీలజీ ఆధారిత అభివృద్దితో ముందుకు సాగాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వివరించారు. ఇందుకోసం దేశ యువతకు అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని మహిళలకు శక్తివంతంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశ వృద్ధి రేటు 7 శాతంగా ఉండనున్నట్లు తాము అంచనా వేసినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. MSMEల వృద్ధికి రుణాలు అందించటంతో పాటు, స్కిల్ డెవలప్ మెంట్, డిజిటల్ సేవలను చేరువ చేయనున్నట్లు వెల్లడించారు.

Nirmala sitharaman over india as bright star in global econmy in union budget 2023

ఈ బడ్జెట్లో లద్దాఖ్, కశ్మీర్, ఉత్తర భారతంపై దృష్టి సారిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వ్యవసాయం కోసం నిధిని వ్యవసాయ స్టార్టప్స్ కోసం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దీనిని రైతుల కష్టాలకు పరిష్కారాలు కనుగొనేందుకు వినియోగిస్తామని చెప్పారు. ఆత్మనిర్బర్ క్లీన్ ప్లాంట్ పథకాన్ని తీసురుకురానున్నట్లు వెల్లడించారు. దీని కోసం రూ.2000 కోట్లను కేటాయిస్తున్నట్లు నిర్మలాసీతారామన్ తెలిపారు. చిరుధాన్యాలకు గ్లోబర్ హబ్ గా భారత్ నిలిచినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు.

English summary

Union Budget 2023: బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన నిర్మలమ్మ.. ప్రపంచ స్థాయిలో భారత్ భేష్ | Nirmala sitharaman over india as bright star in global econmy in union budget 2023

Nirmala sitharaman over india as bright star in global econmy in union budget 2023
Story first published: Wednesday, February 1, 2023, 11:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X