For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇవాంకా, ఎలిజబెత్ కంటే నిర్మలా సీతారామన్ పవర్‌ఫుల్, టాప్ 100లో హెచ్‌సీఎల్ రోష్ని

|

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత దక్కించుకున్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన తొలి 100 మహిళల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. ఇందులో నిర్మలతో పాటు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈవో రోష్నీ నాడర్ మల్హోత్రా, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందర్ షా ఉన్నారు. జాబితాలో మొదటి స్థానాన్ని జర్మనీ వైస్ ఛాన్సులర్ ఏంజెలా మెర్కెల్ దక్కించుకున్నారు.

విజయవాడవాసులకు శుభవార్త, ఆర్టీసీ డోర్ డెలివరీ సర్వీస్విజయవాడవాసులకు శుభవార్త, ఆర్టీసీ డోర్ డెలివరీ సర్వీస్

జాబితాలో షేక్ హసీనా, నిర్మలా సీతారామన్

జాబితాలో షేక్ హసీనా, నిర్మలా సీతారామన్

ఫోర్బ్స్ పవర్ ఫుల్ వుమెన్ జాబితాలో ఏంజెలా మెర్కెల్ తొలి స్థానంలో నిలవగా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ప్రెసిడెంట్ క్రిస్టినా లాగార్డే రెండో స్థానంలో నిలిచారు. యూఎస్ హౌస్ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పిలోసీ మూడో స్థానంలో నిలిచారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా 29వ స్థానంలో ఉన్నారు. నిర్మలా సీతారామన్ 34వ స్థానంలో నిలిచారు. భారత తొలి పూర్తి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో డిఫెన్స్ మినిస్టర్‌గా కూడా పని చేశారు. అంతకుముందు ఇందిరా గాంధీ ఆర్థిక మంత్రిగా అదనపు బాధ్యతలు తీసుకున్నారు. తొలిసారి నిర్మల పూర్తిగా తీసుకున్నారు.

54వ స్థానంలో రోష్నీ

54వ స్థానంలో రోష్నీ

రోష్నీ నాడర్ మల్హోత్రా ఈ జాబితాలో 54వ స్థానం దక్కించుకున్నారు. ఈమె హెచ్‌సీఎల్ కార్పోరేషన్ సీఈవో. 8.9 బిలియన్ డాలర్ల ఈ కంపెనీ స్ట్రాటెజిక్ నిర్ణయాలు అన్నీ ఆమెవే. కంపెనీ సీఎస్ఆర్ కమిటీ చైర్ పర్సన్. శివనాడార్ ఫౌండేషన్ ట్రస్టీ. ఈ ఫౌండేషన్ విద్యపై దృష్టి సారించింది. పలు కాలేజీలు, స్కూల్స్ రన్ చేస్తున్నారు.

65వ స్థానంలో మజుందర్ షా

65వ స్థానంలో మజుందర్ షా

మజుందర్ షా 65వ స్థానంలో నిలిచారు. ఈమె నేతృత్వంలో కంపెనీ పరిశోధనలకు అవసరమైన సౌకర్యాల కల్పన, ప్రతిభావంతులను ప్రోత్సహించి బయోటెక్ విభాగంలో పరిశోధనను ప్రోత్సహిస్తున్నారు.

టాప్ 100లో ఇవాంకా, గ్రేటా

టాప్ 100లో ఇవాంకా, గ్రేటా

ఇంకా, టాప్ 100లోని ప్రముఖుల్లో బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ మెలిందా గేట్స్ 6వ స్థానం, ఐబీఎం సీఈవో గిన్నీ రోమెట్టీ 9వ స్థానం, ఫేస్‌బుక్ సీవోవో షెర్లీ శాండ్‌బర్గ్ 18వ స్థానం, న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెన్ 38వ స్థానం, డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ 42వ స్థానంలో, సింగర్ రిహన్నా 61వ స్థానంలో, బియోన్స్ 66వ స్థానంలో, టేలర్ స్విఫ్ట్ 71వ స్థానంలో, టెన్నిస్ స్టార్ సెరీనా విలియమ్స్ 81వ స్థానంలో, క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రేటా 100వ స్థానంలో నిలిచారు.

English summary

ఇవాంకా, ఎలిజబెత్ కంటే నిర్మలా సీతారామన్ పవర్‌ఫుల్, టాప్ 100లో హెచ్‌సీఎల్ రోష్ని | Nirmala Sitharaman is the new entrant in Forbes list of world's most powerful women

Forbes released its list of world's 100 most powerful women for honoring those in top leadership positions in business, philanthropy, media, and politics. This year the newcomer in the list is Indian Finance Minister, Nirmala Sitharaman.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X