For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండ్రోజుల లాభం తర్వాత నష్టాల్లో ముగిసిన మార్కెట్లు: నిఫ్టీ 15,000 పైనే..

|

ముంబై: రెండు రోజుల లాభాలకు చెక్ పడింది. స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. బలహీన సమయంలోను నిఫ్టీ 15,000 పాయింట్ల పైనే ముగిసింది. సెన్సెక్స్ మాత్రం 50 వేల పాయింట్లను నిలుపుకోలేకపోయింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా కీలక రంగాల సూచీలు నష్టాల్లో పయనించడం మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసింది. రెండు రోజుల లాభాల నేపథ్యంలో గరిష్ఠాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపారు. దీంతో సూచీలు నష్టాల్లో ముగిశాయి.

రెండు రోజుల లాభాలకు బ్రేక్

రెండు రోజుల లాభాలకు బ్రేక్

సెన్సెక్స్ 50,088.81 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,279.01 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,015.57 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ఉదయం గం.11 సమయానికి 110.45 (0.22%) పాయింట్లు ఎగిసి 50,078 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 15,058.60 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,133.40 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,049.65 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.11 సమయానికి 28.55 (0.19%) పాయింట్లు నష్టపోయి 15,080 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ లూజర్స్, గెయినర్స్

టాప్ లూజర్స్, గెయినర్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో కోల్ ఇండియా 3.69 శాతం, సిప్లా 2.21 శాతం, సన్ ఫార్మా 1.82 శాతం, యూపీఎల్ 1.66 శాతం, నెస్ట్లే 1.56 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో టాటా మోటార్స్ 5.41 శాతం, HDFC బ్యాంకు 1.72 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.62 శాతం, జేఎస్‌డబ్ల్యు స్టీల్ 1.62 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 1.59 శాతం, నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎస్బీఐ, రిలయన్స్, యాక్సిస్ బ్యాంకు ఉన్నాయి.

ఇక, అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. నిక్కీ 1.62 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.82 శాతం నష్టాల్లో ఉండగా, హాంగ్‌షెంగ్ 1.42 శాతం లాభపడింది.

రంగాలవారీగా...

రంగాలవారీగా...

నిఫ్టీ 50 స్టాక్స్ 0.52 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.05 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఆటో 0.73 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.70 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.98 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.03 శాతం, నిఫ్టీ మెటల్ 0.92 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.81 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఎనర్జీ 0.55 శాతం, నిఫ్టీ ఐటీ 0.09 శాతం, నిఫ్టీ మీడియా 2.01 శాతం, నిఫ్టీ ఫార్మా 1.22 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.24 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.15 శాతం లాభపడ్డాయి.

English summary

రెండ్రోజుల లాభం తర్వాత నష్టాల్లో ముగిసిన మార్కెట్లు: నిఫ్టీ 15,000 పైనే.. | Nifty manages to hold 15K amid weakness, Sensex falls 290 points

Tata Motors, HDFC, JSW Steel, M&M and Bajaj Finserv were among the top losers on the Nifty. Gainers included Coal India, Cipla, Sun Pharma, UPL and IOC.
Story first published: Wednesday, May 19, 2021, 19:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X