For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 465 పాయింట్లు డౌన్

|

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (మే 4) భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమై, ఆ తర్వాత లాభాల్లోకి వచ్చినప్పటికీ, మధ్యాహ్నం సెషన్ నుండి అంతకంతకూ పతనమయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ భయాలు, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో పాటు, ఆసియా మార్కెట్ల క్షీణించడం, కీలక కంపెనీల షేర్ల బలహీనత దేశీయ సూచీలపై ప్రభావం చూపింది. డాలర్ మారకంతో రూపాయి విలువ రూ.73.85 వద్ద ట్రేడ్ అయింది.

భారీ నష్టాల్లో..

భారీ నష్టాల్లో..

సెన్సెక్స్ నేడు 48,881.63 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,996.53 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,149.45 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 465.01 (0.95%) పాయింట్లు నష్టపోయి 48,253.51 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 14,687.25 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,723.40 వద్ద గరిష్టాన్ని, 14,461.50 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 137.65 (0.94%) పాయింట్లు క్షీణించి 14,496.50 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో SBI లైఫ్ ఇన్సురెన్స్ 2.53 శాతం, ONGC 1.81 శాతం, బీపీసీఎల్ 1.31 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.16 శాతం, అదానీ పోర్ట్స్ 0.97 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ 4.70 శాతం, సిప్లా 3.49 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 2.29 శాతం, దివిస్ ల్యాబ్స్ 2.18 శాతం, రిలయన్స్ 2.17 శాతం నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, రిలయన్స్, ఎస్బీఐ ఉన్నాయి.

రంగాలవారీగా..

రంగాలవారీగా..

నిఫ్టీ 50 స్టాక్స్ 0.94 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.31 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 0.60 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.20 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.82 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.50 శాతం, నిఫ్టీ ఐటీ 0.73 శాతం, నిఫ్టీ మీడియా 0.09 శాతం, నిఫ్టీ మెటల్ 0.09 శాతం, నిఫ్టీ ఫార్మా 2.02 శాతం,

నిఫ్టీ రియాల్టీ 0.46 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.65 శాతం, నిఫ్టీ బ్యాంకు 2.02 శాతం నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు మాత్రమే 3.44 శాతం లాభపడింది.

English summary

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 465 పాయింట్లు డౌన్ | Nifty close below 14,500, Sensex slips 465 pts; PSU Banks outshine

Domestic indices had opened higher on Tuesday but soon erased gains to trade in a narrow range. Sensex today touched a high of 48,996.53 and low of 48,149.45. Nifty moved between 14,461.50 and 14,723.40. PSU banks surged.
Story first published: Tuesday, May 4, 2021, 21:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X