High Paid Job: నెలకు రూ.3.5 లక్షల జీతం.. హెలికాప్టర్ సౌకర్యం.. రిక్రూట్ మెంట్ స్టార్ట్..
High Paid Job: ప్రపంచంలో మనకు తెలియని చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఈ అరుదైన ఉద్యోగాలకు జీతాలతో పాటు అదనపు సౌకర్యాలు సైతం ఎక్కువగానే ఉంటాయి. సాధారణంగా మనకు ఐటీ రంగంలో జీతాలు ఎక్కువ ఉంటాని భ్రమ పడుతుంటాం. నెలకు రూ.3.5 లక్షల జీతంతో పాటు హెలికాప్టర్ వంటి సదుపాయాలు ఉన్న ఒక జాబ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

రూ.3.5 లక్షలు జీతం..
ప్రతినెల దాదాపు మూడున్నర లక్షల రూపాయల జీతం, ఉచిత హెలికాప్టర్, బోటు షికారు సౌకర్యాలతో ఉద్యోగం అని వింటానికే ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఇది నిజంగానే ఉంది. దీనికి భారీగా మేధస్సు కూడా అవసరం ఉండదు. ఇలాంటి మంచి బెనిఫిట్స్ అందిస్తోంది పక్షులకు రక్షించే ఉద్యోగం చేసేవారికి.

అరుదైన పక్షులు..
న్యూజిలాండ్‌లోని రేర్ బర్డ్ కన్జర్వేన్సీ.. రేర్ బర్డ్ కన్జర్వేషన్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇది అరుదైన పక్షుల సంరక్షణ ఉద్యోగం అని తెలిసి చాలా మంది ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయరు. అయితే తొలిరోజు ఈ ఉద్యోగానికి కేవలం ముగ్గురు మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. కానీ ఈ ఉద్యోగానికి రూ.3.50 లక్షల జీతం, హెలికాప్టర్, బోటు షికారు ఉచితం అని తెలిసి చాలా మంది ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటున్నారట.

అప్లికేషన్స్ ఇలా..
కేవలం న్యూజిలాండ్ నుంచే కాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుంచి ముఖ్యంగా కొలంబియా, స్వీడన్ దేశాల నుంచి కూడా దరఖాస్తుదారుల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. న్యూజిలాండ్ నైరుతి తీరంలో కొన్ని అరుదైన జాతులను సంరక్షించడం ఈ పనిచేసేవారి ప్రాథమిక లక్ష్యం. అందులో కివీ పక్షి కూడా ఒకటి.

సూపర్ వైజర్ ఏం చేస్తారు..?
అరుదైన జాతుల పక్షులను పర్యవేక్షించడం, వాటికి పండ్లతో సహా ఆహారాన్ని అందించటం సూపర్ వైజర్ చేయాల్సిన పని. అయితే ఈ పని చేయటానికి పక్షులను చూడాలంటే హెలికాప్టర్లలోనో, బోట్లలోనో తిరగాల్సి ఉంటుంది. 26,000 చదరపు కిలోమీటర్ల పర్వత శ్రేణులు, బీచ్‌లలో పని చేయాల్సి ఉంటుంది. ప్రకృతిని ఎక్కువగా ప్రేమింటే వారు, సాహసాలు చేయటం ఇష్టం ఉండేవాళ్లకు ఈ జాబ్ క్రేజీ అనుభవాలను ఇస్తుంది.

భారీగా దరఖాస్తులు..
ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అరుదైన జాతులను సంరక్షించేందుకు న్యూజిలాండ్ సంస్థ ఏడాదికి దాదాపు రూ.42 లక్షలు చెల్లిస్తుంది. ఇప్పటివరకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ ఉద్యోగానికి 1400 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ ఉద్యోగం ఎవరిని వరిస్తుందో చూడాలి.