For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న్యూఇయర్ గిఫ్ట్!: తక్కువ ధరకే మరిన్ని టీవీ ఛానల్స్, రూ.153కే 200 ఛానల్స్, రూ.160 చెల్లిస్తే...

|

టీవీ ఛానళ్ల రేట్లకు సంబంధించి టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త సవరణలను విడుదల చేసింది. టీవీ ఛానల్స్‌లో ప్రస్తుతం ఉన్న స్లాబ్స్‌లలో సవరణలు తెస్తూ కొత్త టారిఫ్ ఆర్డర్ (NTO) జారీ చేసింది. దీని వల్ల వినియోగదారులకు మరింత ప్రయోజనం కలగనుంది. కొత్త ఏడాదిలో టీవీ యూజర్లకు ట్రాయ్ శుభవార్త చెప్పింది. ఆపరేటర్లు తాజా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ట్రాయ్ స్పష్టం చేసింది.

కొత్త ఏడాదిలో శుభవార్త: 7లక్షల ఉద్యోగాలు, ఈ రంగంలో ఎక్కువ, శాలరీ పెరుగుదల మాత్రం..కొత్త ఏడాదిలో శుభవార్త: 7లక్షల ఉద్యోగాలు, ఈ రంగంలో ఎక్కువ, శాలరీ పెరుగుదల మాత్రం..

రూ.153కు 200 టీవీ ఛానల్స్

రూ.153కు 200 టీవీ ఛానల్స్

ఈ కొత్త టారిఫ్ వచ్చే మార్చి 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. దీని ప్రకారం రూ.153 (పన్నులు కలిపి) చెల్లిస్తే 200 టీవీ ఛానల్స్‌ను ఆపరేటర్లు ఉచితంగా ఇవ్వాలి. వీటితో పాటు 26 దూరదర్శన్ ఛానల్స్‌ను కూడా కేబుల్ ఆపరేటర్లు తప్పనిసరిగా ఇవ్వవలసి ఉంటుంది. ఇదివరకు రూ.130 చెల్లిస్తే 100 ఫ్రీ ఛానల్స్ వచ్చేవి. ఛానల్స్ సమూహాన్నికూడా సమీక్షించింది.

ఆపరేటర్లకు ఆదేశాలు

ఆపరేటర్లకు ఆదేశాలు

ట్రాయ్ వివిధ నిబంధనలను పరిశీలించిందని, రూ.130కి (నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు లేదా NFC) 200 ఛానల్స్ అందించాలని కేబుల్ ఆపరేటర్లను ఆదేశించినట్లు పేర్కొంది. పన్నులు మినహాయించి రూ.130. పన్నులు కలుపుకుంటే రూ.153 అవుతుంది.

రూ.160 చెల్లిస్తే అన్ని ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్

రూ.160 చెల్లిస్తే అన్ని ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్

ట్రాయ్ టీవీ వినియోగదారులకు మరో శుభవార్త కూడా చెప్పింది. 200 ఛానల్స్ కంటే ఎక్కువ వినియోగిస్తే రూ.160 చెల్లిస్తే చాలునని తెలిపింది. రూ.160 చెల్లిస్తే దేశంలోని అన్ని ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ అన్నీ కూడా వస్తాయి.

ఆర్పు రేటు తగ్గుదల

ఆర్పు రేటు తగ్గుదల

ట్రాయ్ కొత్త నిబంధనల వల్ల కేబుల్ ఆపరేటర్లు తక్కువ ఛార్జీతో వినియోగదారులకు ఎక్కువ ఛానల్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఆపరేటర్లు అందరూ జనవరి 15వ తేదీ లోపు తమ కొత్త ధరల స్ట్రక్చర్‌ను ప్రకటించాలని కూడా ట్రాయ్ ఆదేశించింది. బ్రాడ్ కాస్టర్లు కొత్త ఎమ్మార్పీ రేట్లను 15 జనవరి లోగా అప్ డేట్ చేయాలి. అలాగే డీపీవోలు కూడా అలాకార్ట్ ఛానల్స్ రేట్ల కొత్త ధరలను జనవరి 30 నాటికి పబ్లిష్ చేయాలి. కాగా, ట్రాయ్ నిబంధనల వల్ల ఆర్పు రేటు తగ్గనుందని నిపుణులు చెబుతున్నారు. 2019లో న్యూ టారిఫ్ ఆర్డర్ (NTO) అమలులోకి వచ్చాక ఛానల్స్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఆర్పు పెరిగింది.

నాడు ధరలు తగ్గుతాయని భావిస్తే...

నాడు ధరలు తగ్గుతాయని భావిస్తే...

NTOకు ముందు నాణ్యతకు సంబంధించి, ఇంటర్ కనెక్షన్‌కు సంబంధించి నిబంధనలను ట్రాయ్ సవరించింది. దీని ప్రకారం కస్టమర్ తమకు నచ్చిన ఛానల్‌ను ఎంపిక చేసుకొని వాటికి మాత్రమే చెల్లిస్తాడు. అదికూడా ఛానల్స్ నిర్ణయించిన ఎమ్మార్పీ చెల్లిస్తాడు. ఈ నిర్ణయంతో ధరలు తగ్గుతాయని ప్రభుత్వం భావించింది. కానీ ధరలు పెరగడంతో NTO విమర్శలు ఎదుర్కొంటోంది. దీనిపై ట్రాయ్ వివిధ పక్షాల అభిప్రాయాలను కోరింది. దీంతో NTOలోని అంశాలను సవరిస్తామని ట్రాయ్ తెలిపింది.

డిస్కౌంట్లకు అనుమతి

డిస్కౌంట్లకు అనుమతి

మరోవైపు, ఆరు నెలలకు అంతకుమించిన దీర్ఘకాలిక సబ్‌స్క్రిప్షన్ పైన డీపీవోలు డిస్కౌంట్లు ఆఫర్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. డీపీవోలు వసూలు చేసే ఫీజుపై నెలకు రూ.4 లక్షల పరిమితి విధించింది. దీంతో పాటు ఆల్ కార్డ్ ఛానల్స్, ఎలక్ట్రానిక్ ప్రోగ్రామ్ గైడ్, ఛానల్ బొకెట్ తదితరాలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు తెస్తోంది.

English summary

న్యూఇయర్ గిఫ్ట్!: తక్కువ ధరకే మరిన్ని టీవీ ఛానల్స్, రూ.153కే 200 ఛానల్స్, రూ.160 చెల్లిస్తే... | New TV channel pricing: Trai mandates provision of 200 channels at Rs 153

The TRAI has released amendments to the New Tariff Order (NTO), in which it has directed cable operators to provide 200 channels for Rs 153. It has also reviewed the pricing of channel bouquets compared to a la carte ones.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X