For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2021-22 ఆర్థిక సంవత్సరంలో 15 శాతానికి పెరగనున్న బ్యాడ్ లోన్స్

|

బ్యాంకుల బ్యాడ్ లోన్స్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో 13 శాతం నుండి 15 శాతం వరకు పెరగవచ్చునని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. పెద్ద బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు బ్యాడ్ లోన్స్ కారణంగా సవాళ్లను ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా ఉద్యోగాల కోత, వేతనాల కోత, ఉపాధి తగ్గడంతో చెల్లింపు సామర్థ్యం తగ్గి బ్యాడ్ లోన్స్ పెరుగుతున్నాయి.

ఎన్పీఏలు గత ఏడాది ఎనిమిది శాతానికి పెరిగాయి. ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో, పైగా లోన్ మారటోరియం కారణంగా 13 శాతం నుండి 15 శాతానికి పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. కాగా, మొండి బకాయిలు వసూలు చేసేందుకు కేంద్రం బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేస్తోన్న విషయం తెలిసిందే. దీనిని నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్(NARCL) లేదా బ్యాడ్ బ్యాంకుగా పిలుస్తున్నారు.

 New surge in bad loans, Could rise to 15 percent in FY22

ఈ బ్యాడ్ బ్యాంకులో ప్రభుత్వరంగ కెనరా బ్యాంకు 12 శాతం వాటాను తీసుకోనుంది. ఈ మేరకు మంగళవారం తెలిపింది. ఈ బ్యాడ్ బ్యాంకులో 12 శాతం వాటా తీసుకోవడం ద్వారా లీడ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తామని కెనరా బ్యాంకు తెలిపింది.

English summary

2021-22 ఆర్థిక సంవత్సరంలో 15 శాతానికి పెరగనున్న బ్యాడ్ లోన్స్ | New surge in bad loans, Could rise to 15 percent in FY22

With A number of large banks and non-banking finance companies facing fresh challenges posed by the second Covid wave, bad loans are projected to see a fresh spike as the rising stress across sectors is beginning to impact the repayment capacity of borrowers.
Story first published: Wednesday, June 16, 2021, 16:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X