ప్రపంచంతో పాటు దేశంలోని ఆర్థిక మందగమనం పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పెట్టుబడులు ఆశించినంతగా లేవు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI-foreign direct investment) కొత్త నిబంధనలు కాస్త సులభతరంగా ఉండనున్నాయట. ఇండియన్ కంపెనీల జాయింట్ వెంచర్స్‌కు సంబంధించి FDI నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సులభతరం చేయనుందని వార్తలు వస్తున్నాయి. తద్వారా విదేశీ నిధులు పెద్ద ఎత్తున వస్తాయని అంచనా వేస్తోంది.
చట్టబద్దమైన వ్యాపార కార్యకలాపాలలో విదేశీ నిధుల ప్రవాహాన్ని సులభతరం చేసేందుకు గాను జాయింట్ వెంచర్స్ (JVs) లేదా భారతీయ కంపెనీ యాజమాన్యంలోని అనుబంధ సంస్థల (WOS) నిబంధనలు సరళతరం చేయనుందట.

FEMA ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆర్బీఐ ముందస్తు అనుమతి లేకుండా ఓ భారతీయ సంస్థకు విదేశీ జాయింట్ వెంచర్ లేదా WOS ద్వారా ఎఫ్‌డీఐలను అనుమతించరు. అలాగే, భారత్‌లో ఇప్పటికే ఎఫ్‌డీఐ పెట్టుబడులు కలిగి ఉన్న విదేశీ సంస్థలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను చేపట్టేందుకు భారతీయ సంస్థలపై ఆంక్షలు ఉన్నాయి.
ఇప్పటికే ఉన్న పరిమితుల్లో మార్పులు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించినట్లుగా ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. అనుమతులు సులభతరం చేయడం, అలాంటి పెట్టుబడులు ఆటో మేటిక్‌గా (ఆర్బీఐ ముందస్తు అనుమతి లేకుండా) వచ్చేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలలో మార్పులు చేయనున్నట్లు చెప్పారని తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. భారత్‌లోను అదే పరిస్థితి. పెట్టుబడులు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ మార్పులు తప్పనిసరి అంటున్నారు.
ఎగుమతులు పెంపు అంశంపై ఆర్థిక నిపుణులు సుర్జీతి భల్లా నేతృత్వంలో హై లెవల్ అడ్వైజరీ గ్రూప్ (HLAG) నివేదిక తయారు చేసింది. ఇందులో భాగంగా ఈ కమిటీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా పలు సూచనలు చేసింది. సంబంధిత ఎఫ్‌డీఐ నిబంధనల మార్పు విషయమై డిపార్టుమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) కూడా పని చేస్తోందని చెబుతున్నారు.
More From GoodReturns

ఈస్టర్ 2026: గుడ్ ఫ్రైడే, పామ్ సండే, లెంట్ తేదీల పూర్తి వివరాలు ఇవిగో..

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications