For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సేల్ సీజన్ గుడ్‌న్యూస్: మింత్రలో 5,000 జాబ్స్, ఉద్యోగాలు 2 రోజులు రీఛార్జ్ లీవ్

|

ఆన్‌లైన్ ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ స్టోర్ మింత్ర సేల్ సీజన్లో కొత్తగా 5,000 మంది ఉద్యోగులను చేర్చుకోనుంది. తన 12వ ఎడిషన్ 'ఎండ్ అఫ్ రీజన్ సేల్'లో భాగంగా కస్టమర్ కేర్, సప్లై చైన్ విభాగాల్లో ఈ ఉద్యోగులను తీసుకోనుంది. ఈ సేల్ జూన్ 19వ తేదీన ప్రారంభమై జూన్ 22వ తేదీన ముగుస్తుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐటీ సంస్థలు సహా వివిధ రంగాల్లోని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాయి. మింత్ర కూడా చాలామంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది.

భారత్ ఎకానమీ 'నెగిటివ్', కానీ వచ్చే ఏడాది దూసుకెళ్తుంది! రుణరేటు షాక్భారత్ ఎకానమీ 'నెగిటివ్', కానీ వచ్చే ఏడాది దూసుకెళ్తుంది! రుణరేటు షాక్

సేల్ సమయంలో తొలిసారి వర్క్ ఫ్రమ్ హోమ్

సేల్ సమయంలో తొలిసారి వర్క్ ఫ్రమ్ హోమ్

ఇలాంటి సేల్ సమయంలో మింత్ర ఉద్యోగులు తొలిసారి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఎండ్ అఫ్ రీజన్ సేల్ మొత్తం ఈవెంట్‌ను ఉద్యోగులు లైవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానమవుతారు. ఈ ఎండ్ అఫ్ రీజన్ సేల్‌లో దేశవ్యాప్తంగా 3000కు పైగా బ్రాండ్స్, నుండి 7 లక్షలకు పైగా ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. ఈ సేల్ సమయంలో దాదాపు 30 లక్షలమంది కస్టమర్ల్స్ మింత్రా ప్లాట్ ఫామ్ ద్వారా కొనుగోలు చేయవచ్చునని భావిస్తోంది.

గంటకు 20,000 ఆర్డర్స్ రెడీ

గంటకు 20,000 ఆర్డర్స్ రెడీ

ఫ్యాషన్ ఎసెన్షియల్స్, వుమెన్ ఎతిక్ వేర్, కిడ్స్ వేర్, యాక్టివ్ అండ్ స్పోర్ట్ వేర్, బ్యూటీ, పర్సనల్ కేర్ వంటివి అన్‌లాక్-1.0లో భారీగా అమ్ముడు అయ్యాయని మింత్ర సీఈవో అమర్ నాగారం చెప్పారు. ఈ అమ్మకాలు ఎండ్ అఫ్ రీజన్ సేల్‌లోను పెరుగుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సేల్ సమయంలో నిమిషానికి 20,000 ఆర్డర్స్ హ్యాండిల్ చేయడానికి తమ బృందం సిద్ధమవుతోందని చెప్పారు. 12వ ఎడిషన్‌లో 3 మిలియన్ల మంది షాపింగ్ చేస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.

డెలివరీస్ సహకారం, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం

డెలివరీస్ సహకారం, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం

300 నగరాల్లోని 15,000 తమ కిరాణా భాగస్వాములు 75శాతం డెలివరీస్ చేస్తారని చెప్పారు. 400కు పైగా బ్రాండ్స్ నుండి 3500కు పైగా భారతీయ చేనేత ఉత్పత్తులను ఈ ప్లాట్‌ఫాం ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సహిస్తున్నామన్నారు. గత ఎడిషన్‌లో మింత్ర 2.85 మిలియన్ల కస్టమర్లకు, 9.6 మిలియన్ల ఐటమ్స్, 4.2 మిలియన్ల ఆర్డర్స్ విక్రయించింది.

ఉద్యోగులకు రెండు రోజులు రీచార్జ్ లీవ్

ఉద్యోగులకు రెండు రోజులు రీచార్జ్ లీవ్

ఇదిలా ఉండగా మింత్ర ఫ్యాషన్ ఈ-రిటైలర్ 'రీచార్జ్ లీవ్'ను ప్రవేశపెట్టింది. అంటే ఎండ్ ఆప్ రీజన్ సేల్ పూర్తయ్యాక ఉ్దయోగులకు రెండు రోజుల పాటు సెలవు ఇవ్వనుంది. అంటే ఈ సీజన్‌లో ఊపిరిసలపకుండా పని ఉంటుంది. దీంతో ఆ తర్వాత సెలవు ద్వారా వెసులుబాటు ఇవ్వనుంది.

English summary

సేల్ సీజన్ గుడ్‌న్యూస్: మింత్రలో 5,000 జాబ్స్, ఉద్యోగాలు 2 రోజులు రీఛార్జ్ లీవ్ | New Jobs: Myntra hires 5000 people for sale season

Myntra, an online fashion and lifestyle store owned by Flipkart, has hired 5,000 employees across its supply chain and customer care departments as it kicks off the 12th edition of its ‘End of Reason Sale’ from June 19 to June 22.
Story first published: Friday, June 19, 2020, 14:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X