For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెల్కోలు, కొత్త ఇంధన సంస్థలు: బ్యాంకులకు ఎన్పీఏల భయం

|

బ్యాంకులకు రుణాలపై కొత్త భయం పట్టుకుంది. రెన్యూవబుల్ పవర్ యుటిలిటీస్, టెలికం కంపెనీలకు గత అయిదేళ్లుగా ఇచ్చిన రుణాలు బ్యాడ్ రుణాలుగా మారే అవకాశాలు ఉన్నాయని ఆందోళన చెందుతున్నాయి. రెన్యువబుల్ ఎనర్జీ జనరేటర్ బకాయిలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలకు చెందిన డిస్కమ్స్ నుంచి బకాయిల చెల్లింపులు తగ్గుతున్నాయి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ గణాంకాల ప్రకారం 2019 జూలై 31వ తేదీ నాటికి బకాయిలు రూ.10,000 కోట్లు పేరుకుపోయాయి.

పొరపాటు: ఆర్డర్లతో అమెజాన్‌తో ఆటాడుకున్న విద్యార్థులు, రూ.కోట్ల నష్టం!పొరపాటు: ఆర్డర్లతో అమెజాన్‌తో ఆటాడుకున్న విద్యార్థులు, రూ.కోట్ల నష్టం!

కొన్ని కేసుల్లో బకాయి చెల్లింపులు 12 నెలలు కూడా దాటింది. దీని వల్ల ఆయా బ్యాంకుల మూలధన ప్రవాహానికి ఇబ్బందులు రావడంతో పాటు రుణ సేవా సామర్థ్యానికి అడ్డంకింగా మారింది. మొత్తంమీద 15కు పైగా డిస్కమ్‌ల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది.

New energy firms & telcos stare at default, NPA fear grips banks

మరోవైపు, ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు కారణంగా టెలికం కంపెనీలు చిక్కుల్లో పడ్డాయి. అడ్జస్ట్ గ్రాస్ రెవెన్యూ (AGR)పై అత్యున్నత న్యాయస్థానం తీర్పు వల్ల టెలికం కంపెనీలు రూ.92,500కు పైగా చెల్లించవలసి ఉంది. ఇందులో 40 శాతం వరకు ఎయిర్‌సెల్ లిమిటెడ్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ నుంచి రావాలి. ఈ కంపెనీలు ఇప్పటికే దివాలా కోసం దాఖలు లేదా కార్యకలాపాలు నిలిపివేశాయి. మిగిలిన ఎక్కువ భాగం వొడాపోన్ ఐడియా లిమిటెడ్, భారతీ ఎయిర్ టెల్ నుంచి రావాలి. 4:3 నిష్పత్తిలో ప్రభుత్వానికి రూ.50,000 కోట్లు రుణపడి ఉన్నాయి.

జూన్ త్రైమాసికంలో వొడాఫోన్ ఐడియా క్యాష్ బ్యాలెన్స్ రూ.21,200 కోట్లుగా ఉంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.28,300కు ఇది చాలా తక్కువ. ప్రమోటర్లు దీనిపై ఆందోళనగా ఉన్నారు. మౌలికసదుపాయాల రంగంలో దాదాపు సగం క్రెడిట్ విద్యుత్ రంగానిదే. ఆ తర్వాత టెలికం రంగం రెండోస్థానంలో ఉంటుంది.

పవర్ సెక్టార్‌లో పునరుత్బాదక ఇంధన రంగానికి గత నాలుగేళ్లలో 3.22 బిలియన్ డాలర్ల FDIలు వచ్చాయి. ఇది ఎక్కువగా బ్యాంకు నిధుల ద్వారా పరపతి పొందిన దేశీయ పెట్టుబడితో పాటు వచ్చింది.

ఆగస్ట్ 2019 చివరి నాటికి ఇన్‌స్టాల్డ్ పవర్ కెపాసిటీ దాదాపు 80.63 గిగావాట్స్ వద్ద ఉంది. గత అయిదేళ్లలో దీని సామర్థ్యం రెండింతలు పెరిగింది. ఇందులో ప్రయివేటు ప్లేయర్స్ ఎక్కువగా ఉన్నారు. అప్పులు చేసి రుణాలు సమకూర్చారు.

అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ ఫర్మ్ జెఫెరీస్ గ్రూప్ ఎల్ఎల్‌సీ భారతీయ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూట్స్ పైన అక్టోబర్‌లో ఓ నోట్ ఇచ్చింది. ఇందులో బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్లీ ఎన్పీఏలను ఎదుర్కోవచ్చునని, ముఖ్యంగా టెలికం, కన్స్ట్రక్షన్ సెక్టార్ రంగం నుంచి ఎదుర్కోవచ్చునని అభిప్రాయపడింది.

పేమెంట్స్ ఆలస్యం వల్ల పెద్ద రెన్యువబుల్ ఎనర్జీ జనరేటర్లు ఒత్తిడిని తట్టుకుంటున్నారు. ఎందుకంటే అలాంటి పెద్ద కంపెనీలకు వివిధ కార్యకలాపాలు, వివిధ ఆర్థిక కార్యకలాపాలు ఉంటాయి. కాబట్టి తట్టుకోగలుగుతున్నాయి. అయితే క్రెడిట్ దృక్పథం, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింటోందని చెబుతున్నారు. ఇక చిన్న కంపెనీల పరిస్థితి దారుణంగా ఉంది. పవర్ సెక్టార్ గురించి క్రిసిల్ రేటింగ్ సీనియర్ డైరెక్టర్ మనీష్ గుప్తా మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డిస్కంలకు సింగిల్ అసెట్ ఎక్స్పోజర్ కలిగిన చిన్న కంపెనీలు ఎక్కువగా ప్రభావితమయ్యాయని చెప్పారు.

English summary

టెల్కోలు, కొత్త ఇంధన సంస్థలు: బ్యాంకులకు ఎన్పీఏల భయం | New energy firms & telcos stare at default, NPA fear grips banks

Payment dues of renewable energy generators are mounting, primarily as distribution companies (discoms) of states such as Andhra Pradesh, Tamil Nadu and Telangana have been falling back on payments for electricity contracted. The dues were pegged at close to Rs 10,000 crore upto July 31, 2019, according to data compiled by the Central Electricity Authority, and the amount is piling up.
Story first published: Wednesday, October 30, 2019, 11:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X