For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్విట్టర్ సీఈవోగా భారతీయుడు, ఎవరీ పరాగ్ అగర్వాల్? జాక్ రాజీనామా అందుకేనా

|

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కొత్త సీఈవోగా భారత సంతతికి చెందిన 45 ఏళ్ల పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆయన కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(CTO)గా ఉన్నారు. కంపెనీ సహ వ్యవస్థాపకులు జాక్ డోర్సె సోమవారం సీఈవో బాధ్యతల నుండి తప్పుకున్నారు. జాక్ డోర్సే పదహారేళ్ల పాటు కంపెనీలో సహ వ్యవస్థాపకుడి నుండి సీఈవోగా, సీఈవో నుండి చైర్మన్, చైర్మన్ నుండి ఎగ్జిక్యూటివ్ చైర్మన్, ఆ తర్వాత తాత్కాలిక సీఈవో, అనంతరం సీఈవోగా వ్యవహరించారు. ఇదే విషయాన్ని జాక్ డోర్సే కూడా ట్వీట్ చేశారు.

వ్యవస్థాపక నాయకత్వంలోనే ఓ కంపెనీ ఉండటం చాలా ముఖ్యమని చర్చలు సాగుతున్నాయని, ఈ వాదన చాలా పరిమితమని, వైఫల్యానికి అదీ ఓ కారణమవుతుందని తాను విశ్వసిస్తానని, కంపెనీ పునాదులు, వ్యవస్థాపకుల నుండి కంపెనీ బయటకు రావడానికి తాను చాలా కష్టపడ్డానని పేర్కొన్నారు. తాను కంపెనీలో వివిధ బాధ్యతలు నిర్వర్తించానని పేర్కొన్నారు. డోర్సో 2022 వరకు బోర్డు మెంబర్‌గా ఉంటారు. జాక్ డోర్సే ప్రకటన తర్వాత ప్రారంభంలో ట్విట్టర్ షేర్లు లాభపడిన, ఆ తర్వాత స్టాక్స్ 2.74 శాతం క్షీణించాయి. తాజాగా సీఈవో బాధ్యతలు భారతీయుడికి వస్తున్నాయి.

ఎవరీ పరాగ్ అగర్వాల్?

ఎవరీ పరాగ్ అగర్వాల్?

పరాగ్ అగర్వాల్ 2017 నుండి ట్విట్టర్ సీటీవోగా ఉన్నారు. ట్విట్టర్‌తో దశాబ్దానికి పైగా అనుబంధం ఉంది. అగర్వాల్ ఐఐటీ బాంబే నుండి గ్రాడ్యుయేషన్ చేశారు. స్టాన్‌ఫోర్ట్ యూనివర్సిటీలో కంప్యూటర్స్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేశారు. అటామిక్ ఎనర్జీ సెంటర్ స్కూల్‌లో చదివారు. అతను 2011లో ట్విట్టర్‌లో యాడ్స్ ఇంజినీర్‌గా చేరారు. అప్పుడు కంపెనీలో ఉద్యోగుల సంఖ్య వెయ్యి లోపు.

ఆ తర్వాత డిస్టింగిష్డ్ సాఫ్టువేర్ ఇంజినీర్ అయ్యారు. 2017లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ బాధ్యతలు చేపట్టారు. 2019 డిసెంబర్‌లో ప్రాజెక్టు బ్లూస్కై బాధ్యతలు అప్పగించారు డోర్సే. ఆగస్ట్ 2021లో బ్లూస్కై లీడర్‌గా జే గ్రాబెర్‌ను నియమించారు. ట్విట్టర్‌లో చేరడానికి ముందు మైక్రోసాఫ్ట్, యాహూ, ఏటీ అండ్ టీలలో రీసెర్చ్ ఇంటర్న్‌షిప్‌గా ఉన్నారు. తాజాగా ట్విట్టర్ సీఈవోగా కావడంతో భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్, సత్య నాదెళ్లతో పాటు సిలికాన్ వ్యాలీ సీఈవోల జాబితాలో చేరారు.

అందుకే అగర్వాల్‌కు బాధ్యతలు

అందుకే అగర్వాల్‌కు బాధ్యతలు

పరాగ్‌కు బాధ్యతలు అప్పగించేందుకు మూడు కారణాలు ఉన్నాయని డోర్సే అన్నారు. బోర్డు తీవ్రంగా వెతికిందని, ఏకగ్రీవంగా పరాగ్‌ను ఎంచుకుందని, కొంతకాలంగా తన ఎంపిక కూడా అతనే అని, ఎందుకంటే కంపెనీని, కంపెనీ అవసరాలను అతను లోతుగా అర్థం చేసుకున్నాడని డోర్సే చెప్పారు. ప్రతి కీలక నిర్ణయం వెనుక పరాగ్ ఉన్నారన్నారు. కంపెనీ ఇలా మారడానికి కారణమయ్యారని తెలిపారు. ఆసక్తి, హేతుబద్దత, సృజనాత్మకత, వినయం ఉన్నాయని, మనసు పెట్టి పని చేస్తారన్నారు.

అగర్వాల్ ఏమన్నారంటే?

అగర్వాల్ ఏమన్నారంటే?

'మన కలిసికట్టుగా చేయడానికి పరిమితి లేదు' అని అగర్వాల్ ట్విట్టర్ ఉద్యోగులతో అన్నారు. ఉద్యోగులకు ఓ మెయిల్ సందేశం పంపించారు. జాక్ డోర్సేకు థ్యాంక్స్. ఉద్యోగులకు కూడా కృతజ్ఞతలు. భవిష్యత్తు పైన చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాను. మీ విశ్వాసం, మద్దతు కోసం అంటూ పరాగ్ ట్వీట్ చేశారు.

పదేళ్లు గడిచినా, తనకు నిన్నటిలాగే ఉందని, ఎత్తుపల్లాలు, సవాళ్లు, గెలుపులు, ఓటములు చూశానని, అయితే అప్పటికీ ,ఇప్పటికీ ట్విటర్ ప్రభావం అద్భుతంగా మారిందని, దీనిని కొనసాగిస్తామన్నారు అగర్వాల్. తమ ముందు గొప్ప అవకాశాలున్నాయని, తమ లక్ష్యాలను చేరడానికి ఇటీవలే వ్యూహాలను మెరుగుపరచుకున్నామన్నారు. ఎలా పని చేస్తాం.. ఎలా ఫలితాలను సాధిస్తామనేదే తమ ముందు ఉన్న కీలక సవాల్ అన్నారు.

అందుకే వెళ్ళారా

అందుకే వెళ్ళారా

డోర్సే స్థాపించిన ఫైనాన్షియల్ కంపెనీ స్క్వేర్‌కు డోర్సే సీఈవోగా ఉన్నారు. ట్విట్టర్‌తో పాటు స్క్వేర్‌కు సీఈవోగా ఉండటంతో రెండి కంపెనీలను సమర్థవంతంగా ఎలా నిర్వహిస్తారని పలువురు పెద్ద పెట్టుబడిదారులు ప్రశ్నించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్ట్ ట్రంప్ ట్విట్టర్‌ను నిషేధించిన సమయంలో విమర్శలు వచ్చాయి. ఇలాంటి వివిధ కారణాలు ఆయన తప్పుకోవడానికి ఉన్నాయని అంటున్నారు. 2022లో పదవీ కాలం ముగిసే వరకు బోర్డులో ఉంటారు.

English summary

New CEO of Twitter: Who is Parag Agrawal?

Parag Agrawal has been elevated as Twitter CEO on November 29, after co-founder Jack Dorsey stepped down from the role.
Story first published: Tuesday, November 30, 2021, 9:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X