For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత ప్రజల ప్రాణాలు పణంగా పెట్టం: వ్యాక్సీన్‌పై సీరమ్

|

భారత ప్రజలను పక్కన పెట్టి తాము కరోనా వ్యాక్సీన్‌ను ఎగుమతులు చేయలేదని, చేయడం లేదని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అధర్ పూనావాలా మంగళవారం అన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు తాము పూర్తిస్థాయిలో అండగా ఉంటామని చెప్పారు. భారత ప్రభుత్వం, సీరమ్ సహా వ్యాక్సీన్ తయారీ కంపెనీలు టీకాల ఎగుమతి సిన అంశం గత కొద్దిరోజులుగా చర్చనీయాంశంగా మారినట్లు ఓ ప్రకటనలో వివరించింది. తాము టీకాలను ఎందుకు ఎగుమతి చేశామో కూడా వివరణ ఇచ్చింది. అదే సమయంలో భారత ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి తాము వ్యాక్సీన్‌ను ఎగుమతి చేయలేదని స్పష్టం చేసింది.

మనం సాయం చేశాం.. మనకు అందుతోంది

మనం సాయం చేశాం.. మనకు అందుతోంది

జనవరి 2021లో తమ వద్ద భారీస్థాయిలో వ్యాక్సీన్ నిల్వలు ఉన్నాయని, ఆ సమయంలో కేసులు ఆల్‌టైమ్ కనిష్ఠస్థాయిలో ఉన్నాయని, అప్పుడు ప్రపంచ దేశాల్లో తీవ్రమైన కరోనా సంక్షోభం ఉందని, సహాయం అవసరం ఏర్పడిందని, సహకారం అందించవలసి వచ్చిందని సీరమ్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. ఆ సమయంలో భారత ప్రభుత్వం కూడా ఆ దేశాలకు సహాయం చేయాలని నిర్ణయించిందని, ఇపుడు అందుకు ప్రతిఫలం కూడా కనిపిస్తోందని తెలిపింది. ఇప్పుడు మనం సంక్షోభంలో ఉన్న సమయంలో వివిధ దేశాల నుండి మనకు సహాయం అందుతోందని సీరమ్ గుర్తు చేసింది.

అలా కరోనాను అంతమొందించవచ్చు

అలా కరోనాను అంతమొందించవచ్చు

కరోనాకు భౌగోళిక లేదా రాజకీయ పరిమితులు లేవని, ప్రపంచంలో అందరూ భద్రంగా ఉంటేనే మనం కూడా క్షేమంగా ఉండగలుగుతామని, తమ అంతర్జాతీయ భాగస్వామ్యాల్లో భాగంగా కోవాక్స్ పథకానికి తాము సహకరించవలసి వచ్చిందని, వారంతా అంతర్జాతీయంగా వ్యాక్సీన్‌ను సరఫరా చేయడం ద్వారా కరోనాను అంతమొందించవచ్చునని తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న రెండో దేశం భారత్ అని, రెండు మూడు నెలల్లో అందరికీ వ్యాక్సీన్ అసాధ్యమన్నారు.

తర్వాత ఆమోదం లభించినా.

తర్వాత ఆమోదం లభించినా.

అమెరికా కంపెనీలకు అత్యవసర అనుమతులు వచ్చిన 2 నెలల తర్వాత తమకు ఆమోదం లభించినప్పటికీ తాము 20 కోట్ల వ్యాక్సీన్‌లను ప్రజలకు అందించామని, తమకు భారత్ తొలి ప్రాధాన్యత అని, ఈ లక్ష్యంగానే వ్యాక్సీన్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది.

English summary

భారత ప్రజల ప్రాణాలు పణంగా పెట్టం: వ్యాక్సీన్‌పై సీరమ్ | Never exported vaccines at the cost of people of India, says Serum Institute of India

Serum Institute of India chief Adar Poonawalla on Tuesday said the company has never exported vaccines at the cost of the people in the country and remains committed to do everything it can in support of the vaccination drive in India.
Story first published: Wednesday, May 19, 2021, 7:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X