ప్రముఖ అమెరికన్ ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.5కే మొదటి నెల సబ్‌స్క్రిప్షన్‌ను అందించనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 21వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. అయితే ఆఫర్ ధర తక్కువగానే ఉన్నప్పటికీ.. నెట్‌ఫ్లిక్స్ ఒక మెలిక కూడా పెట్టింది. ఈ ఆఫర్ అందరికీ అందుబాటులో ఉండదని.. లిమిటెడ్ మెంబర్స్‌కి మాత్రమే వర్తిస్తుందని చెప్పింది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే.. భవిష్యత్తులో మరింతమందికి అందించేందుకు ప్లాన్ చేస్తామని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ప్రస్తుతం ఇండియాలో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సంస్థల్లో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ధర మిగతావాటి కంటే చాలా ఎక్కువగా ఉంది. అమెజాన్ లాంటి ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సంస్థలు రూ.129కే ఒక నెల సబ్‌స్క్రిప్షన్ అందిస్తుండగా.. నెట్‌ఫ్లిక్స్ ఒక నెల సబ్‌స్క్రిప్షన్ చార్జి రూ.799గా ఉంది. అయితే మొబైల్ యూజర్ల కోసం రూ.199 ప్లాన్‌ను నెట్‌ఫ్లిక్స్ అందుబాటులోకి తెచ్చింది. భవిష్యత్తులో మరింత ఎక్కువమందికి చేరువయ్యే ఆలోచనలో భాగంగా తాజాగా రూ.5 ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నిజానికి గతంలో ఒక నెల ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను కూడా నెట్‌ఫ్లిక్స్ అందించింది. కానీ గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఆఫర్‌ను క్లోజ్ చేసింది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications