For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కస్టమర్ల వద్దకే... కరోనా దెబ్బతో కంపెనీల్లో 3 కీలక మార్పులు

|

కరోనా మహమ్మారి వల్ల తలెత్తిన సవాళ్లను తాము అధిగమించే పరిస్థితి లేదని క్యాప్‌జెమిని రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సర్వేలో 21 శాతం మంది వెల్లడించారు. కస్టమర్ డిమాండ్ లేకపోవడం, సప్లై గొలుసు తెగిపోవడం వంటి వివిధ కారణాలు ఉన్నాయని తెలిపింది. సమీప భవిష్యత్తులో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదని వెల్లడించాయి. సమీప భవిష్యత్తులో డిమాండ్, సప్లై చైన్ మార్పులకు అనుగుణంగా పరిస్థితులు ఉంటాయని అభిప్రాయపడ్డారు.

సంస్థలు, ఉద్యోగులపై తీవ్రఒత్తిడి: మారటోరియం మళ్లీ పొడిగిస్తేసంస్థలు, ఉద్యోగులపై తీవ్రఒత్తిడి: మారటోరియం మళ్లీ పొడిగిస్తే

కరోనాతో ఈ మూడు కీలక మార్పులు

కరోనాతో ఈ మూడు కీలక మార్పులు

కరోనా కారణంగా పని పద్ధతులు, వ్యాపార కార్యకలాపాల నిర్వహణ, ఫ్యాక్టరీలలో ఉత్పత్తి ప్రక్రియలు భారీ మార్పుకు లోనవుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. కరోనా తగ్గిపోయిన తర్వాత ఈ మార్పులు కొనసాగుతాయని తెలిపారు. ప్రధానంగా మడు మార్పులు తప్పనిసరిగా ఉంటాయని వెల్లడైంది. ప్రజల జీవన విధానంలో రిమోట్ వర్కింగ్ తప్పనిసరి అవుతుంది. డిజిటలైజేషన్, ఆటోమేషన్‌కు ప్రాధాన్యత మరింతగా.. వేగంగా పెరుగుతుంది. వస్తువులకు వినియోగదారులు మార్కెట్ ఎక్కడ ఉంటే అక్కడికి సమీపంగానే ఉత్పత్తి ప్రక్రియ చేపట్టవలసి వస్తుంది. వేరేచోట తయారు చేసిన సుదూర ప్రాంతాల్లో కస్టమర్లకు సరఫరా చేసే పరిస్థితి తగ్గుముఖం పడుతుంది.

సర్వేలో ఎవరు పాల్గొన్నారు

సర్వేలో ఎవరు పాల్గొన్నారు

అమెరికా, యూరోప్, చైనా, భారత్ సహా వివిధ దేశాలకు చెందిన వెయ్యి మందికి పైగా వివిధ వ్యాపార సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఆటోమోటివ్, వినియోగవస్తువులు, రిటైల్, ఆర్థిక సేవలు, ఆయిల్ యంత్ర సామాగ్రి పరిశ్రమలకు చెందిన ఎగ్జిక్యూటివ్స్ పాల్గొన్నారు

మార్పులు చేయాలి

మార్పులు చేయాలి

మన దేశం నుండి పాల్గొన్నవారిలో 21 శాతం మంది కరోనా పరిస్థితులను అధిగమించడం కష్టంగా ఉందన్నారు. మారుతున్న వినియోగదార్ల ప్రాధామ్యాలకు తగినట్లుగా తమ ఐటీ వ్యవస్థలను మార్చుకోలేని పరిస్థితి ఎదురవుతోందని 44 శాతం మంది, డిమాండ్ క్షీణించిందని 36 శాతం మంది చెప్పారు. కరోనా కారణంగా సంస్థాగత మార్పులను వేగవంతం చేసినట్లు సగం మంది తెలిపారు. తమ సంస్థల్లో ఐటీ మార్పులను చేపట్టాల్సి ఉన్నదని, ఫైనాన్స్-అకౌంటింగ్, సప్లై చైన్ విభాగాల్లో సమూలమైన మార్పులు చేపట్టాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

రిమోట్ వర్కింగ్

రిమోట్ వర్కింగ్

భారత్‌లో 50 శాతానికి పైగా సంస్థలు రిమోట్ వర్కింగ్ విధానానికి మారుతున్నట్లు చెప్పారు. ఉత్పత్తి కార్యకలాపాలను కూడా మార్కెట్ సమీపానికి తీసుకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఇండియా నుండి పాల్గొన్న వారిలో 52 శాతం మంది ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. వినియోగదారుల ఆరోగ్యం, సంరక్షణను ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలసి ఉందని సర్వేలో ఎక్కువమంది చెప్పారు. మొత్తంగా 68 శాతం మంది రిమోట్ వర్కింగ్‌కు మారుతున్నట్లు తెలిపారు.

English summary

కస్టమర్ల వద్దకే... కరోనా దెబ్బతో కంపెనీల్లో 3 కీలక మార్పులు | Nearshoring will emerge as a top agenda for companies: Capgemini Survey

A study by Capgemini Research Institute found that 21% of organisations in India see COVID-19 as a challenge that their organization will not be able to overcome. Lack of customer demand and rigidity of supply chain were the top reasons for the impact, according to the study.
Story first published: Thursday, July 9, 2020, 12:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X